పిండం, శిశువు పెరుగుదలకు అత్యవసరమైన భాగము. .భ్రూణాని మాతృకణజాలంతో కలిపే ప్రత్యేక నిర్మాణాన్ని జరాయువు (Placenta) అంటారు. ఇది గర్భాశయ కణజాలం, పిండబాహ్యత్వచాల కలయిక (fusion) ద్వారా ఏర్పడుతుంది. పిండాభివృధి సమయంలో మాతృ గర్భాశయం నుంచి పోషక పదార్ధాలను, ఆక్సిజన్ ను నెరుగా గ్రషించి .భ్రూణాని అందచేయడానికి తోడ్పదుతుంది. తల్లి, పిండం రక్తకణాలు పరస్పర కలియకుండా జరాయువు వక్క అడ్డు త్వచం (Placental barrier ) గా ఏర్పడుతుంది.

జరాయువు (ప్లాసెంటా)

జరాయువు రకాలుసవరించు

 1. భ్రూణ జరాయువు: పిండబాహ్యత్వచాల నుండి అభివృద్ధి చెందుతుంది.
 2. మాతృ జరాయువు ; గర్భాశయపు ఎండోమెట్రియం నుండి అభివృద్ధి చెందుతుంది.

ప్లాసెంటేషన్(Placentation)సవరించు

మాతృ గర్భశయ కుడ్యభాగమునకు, పరాయువు పొర లేక పిండపు ట్రోపోబ్లస్ట్ కు మధ్యగల అతిసన్నిహిత సంబంధాన్ని ప్లాసెంటేషన్ (Placentation) అని అంటారు.

ఇంఫ్లాంటేషన్(Implantation)సవరించు

అభివృద్ధి చెందుతున్న పిండం లేక భ్రుణం మాతృ గ్రర్భాశయక్యుడ్యముతో అతికి ఉండటానిని ఇంఫ్లాంటేషన్ అంటారు. ఇది మూడు రకాలు

 • మధ్య ఇంఫ్లాంటేషన్ (Central Implantation) : దీనిని ఉపరితల ఇంఫ్లాంటేషన్ అని కూడా అంటారు. పిండము గర్భాశయ క్యుడ్యపు ఉపరితలములో అంటిపెట్టుకొని, గర్భాశయ కుహరములోనికి చొచ్చుకొని వస్తుంది.

ఉదా: క్షీరదాలైన కుందేలు, అంగులేట్స్ మాంసహార, నిమ్న ప్రైమేట్స్.

 • ఏక కేంద్రక ఇంఫ్లాంటేషన్ (Concentric Implantation) : పిండము గర్భాశయ కుహరములో సంచి లేక గాడిలో అమిరి ఉండి, గర్భాశయ కుడ్యశేష్మ పొరలతో చుట్టబడి ఉంటుంది.

ఉదా: క్షీరదాలైన చుంచెలుకలు, ఉడత

 • మధ్యాంతర ఇంఫ్లాంటేషన్ (Interstitial Implantation) : పిండము గర్భాశయ కణజాలములో చొచ్చుకొని పోయి, గర్భాశయ కణజాలముతో చుట్టబడి ఉంటుంది.

ఉదా: మానవులు, కోతులు, పందులు, హెడ్జ్ హాగ్.

జరాయువు వర్గీకరణసవరించు

 1. పిండ బాహ్యత్వాచాల తీరు (Nature of Extraembryonic Membrane).
 2. అంకురికల విస్తరణ, జరాయువు ఆకారము (Distribution of Villi and shape of placenta).
 3. భ్రూణ, మాతృ కణజాలల నధ్య ఉండే ఆతి సన్నిహిత సంబంధ విధానము (Degree of intimacy between foetal and maternal tissues).
 • పిండ బాహ్యత్వాచాల తీరు (Nature of Extraembryonic Membrane) :ఇవి 3 రకాలు
 1. సొనసంచి జరాయువు (YolkSac Placenta) :
 2. ఆళింద జరాయువు (Allantoic Placenta)
 3. పరాయువు జరాయువు (Chronic Placenta)

సొనసంచి జరాయువుసవరించు

మెటాథిరియా లేక మర్సుపైలియా (కోష్టక క్షీరదాలు) జీవులైన కంగారు (Macropus), అపోసం (డైడెల్పిస్) వంటి జీవులలో జరాయువు సొనసంచి, పరాయువు వలన ఏర్పదుతుంది.బ్లాస్టోసిస్ట్ అడుగుభాగము నుండి సొనసంచి అభివృద్ధి చెందుతుంది. ఇది పెద్ద పరిమాణములో ఉండి, పిండాన్ని, ఉల్భమును పూర్తిగా చుట్టి ఉంటుంది.ఆళిందము చిన్నదిగా ఉండి, పరాయువుతో కలవదు. సొనసంచి పెద్దదిగా మారి, దానికుడ్యము పరాయువుతో సంబంధాన్ని ఏర్పరచుకొని, వేళ్ళవంటి అంకురికలను గర్భాశయ కుడ్యములోనికి పంపిస్తుంది. సొనసంచి కుడ్యము పరాయువుతో కలిసి తర్వాత, దీనినుండి పీతకరక్త నాళాలు ఏర్పడతాయి. ఈ రక్తనాళాల ద్వారా గర్భాశయము నుండి పోషక పదార్ధాలు పెరుగుచున్న పిండమునకు రవాణా అవుతాయి. ఇటువంటి జరాయువును సొనసంచి జరాయువు లేక పరాయు-పీతకజరాయువు అని అంటారు. సొనసంచి జరాయువు బాగా అభివృఅద్ధి చెందకపోవటము వలన, పిండమునకు సరిగాపోషణ లంభిచక, పిండము పెరగుదల నిర్ణీతంగా ఉంటుంది. అందువలన అపరిపక్వస్ధితిలో ఉన్న పిల్లలను కంటాయి. ఈ లోటును భర్తిచేయటానికి, పిల్లలను మార్సుపియల్ సంచిలో ఉంచుకొని, బాగా పెరిగేవరకు పోషిస్తయి. సొనసంచి జరాయువు రెండు రకాలుగా ఉంటుంది.

 1. ప్రాథమిక సొనసంచి జరాయువు: ఉత్తర అమెరికా అసోసంలో ఏర్పడుతుంది.
 2. పురోగమ సొనసంచి జరాయువు
 • అంకురికల విస్తరణ, జరాయువు ఆకారము (Distribution of Villi and shape of placenta) : ఇవి రెండు రకాలు
 1. అపాతుకీ జరాయువు (Non-deciducate Placenta)
 2. పాతుకీ జరాయువు (Deciducate Placenta)
 • భ్రూణ, మాతృ కణజాలల నధ్య ఉండే ఆతి సన్నిహిత సంబంధ విధానము : ఇవి 5 రకాలు
"https://te.wikipedia.org/w/index.php?title=జరాయువు&oldid=3262576" నుండి వెలికితీశారు