జరుగుల వెంకట రామ భూపాలరావు

శాస్త్రవేత్త

జరుగుల వెంకట రామ భూపాలరావు ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త. ఈయన "జె.వి.ఆర్.భూపాలరావు"గా సుప్రసిద్ధులు. శాస్త్రవేత్తగా కొత్తరకం చెరకు రకాలను వృద్ధి చేసారు.[1]

జీవిత విశేషాలు మార్చు

జె.వి.ఆర్.భూపాలరావుగా సుపరిచితులైన ఈయన ప్రకాశం జిల్లా లోని నాయుడు పాలెంలో 1944 జూన్ 1 న జన్మించారు. తండ్రిపేరు వెంకటనరసింహారావు. 1962 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పి.యుసి (జీవశాస్త్రం) పూర్తిచేసారు. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బి.ఎస్.సి (అగ్రికల్చర్) డిగ్రీని పొందారు. ఐ.ఎ.ఆర్.ఐ. న్యూఢిల్లీ నుంచి జన్యు శాస్త్రంలో ఎం.ఎస్.సి డిగ్రీని 1968 లోపూర్తిచేసారు. 1972 లో పి.హెచ్.డి. కూడా చేసారు.

ఉద్యోగ పర్వం మార్చు

ఈయన మొదట న్యూఢిల్లీ లోని సి.ఎస్.ఐ.ఆర్ లో 1971 నుండి 73 వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసారు. 1974 నుండి 1981 వరకు జన్యు శాస్త్రవేత్తగా ఐఐహెచ్ ఆర్ (బెంగళూరు) లో పనిచేసారు. అనకాపల్లి వ్యవసాయ విశ్వవిద్యాలయ శాఖలో ఒక దశాబ్దం కాలం పనిచేసారు. ప్లాంట్ బ్లీడింగ్ అంశంలో పరిశోధనలు చేసారు. చక్కెర సమాఖ్యకు అసోసియేట్ ప్రొఫెసర్ గా యుండి చెరకు సలహాదారుగా 1993 నుండి 1996 వరకు విశేష కృషి చేసారు. 1999 నుండి 2004 వరకు ఉయ్యూరు విశ్వవిద్యాలయ శాఖలోపనిచేస్తూ ప్రధాన శాస్త్రవేత్తగా ఉంటూ పదవీవిరమణ చేసారు.

పరిశోధనలు-అవార్డులు మార్చు

ఆయన చెరకు పరిశోధనలో గణనీయమైన ఫలితాలు రాబట్టినందుకుగాను గుర్తింపుగా బంగారు పతకాన్ని అందుకున్నారు. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు వారికి "మెరిటోరియస్ సైంటిస్టు" అవార్డు ప్రదానం చేసారు. చెరకు పైరులో విశేష పరిశోధనలకు గానూ 2002-03 లో "యు.బి.రాఘవేంద్రరావు" బంగారు పతకాన్ని అందుకున్నారు. చెరకు సాగులో భూమి తయారీ నుండి సమగ్ర యాజమాన్య పద్ధతులను, ఎరువుల వినియోగం నుంచి నరికిన చెరకును ఫ్యాక్టరీలకు వెనువెంటనే తోలడం వరకు అనేక నూతన పరిశోధనాంశాలను అమలు చేయించారు. చెరకు నియంత్రణ అధికారులకు శిక్షణా కార్యక్రమాలు, రైతులకు అవగాహనా సదస్సులను నిర్వహించారు.

శాస్త్రవేత్తగా పలు శ్రేష్టమైన చెరకు రకాలుగా వృద్ధి చేసారు.[2] మధు, విశ్వామిత్ర, కనకదుర్గ, కృష్ణ మొదలగు రకాలను వృద్ధి చెయగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా విడుదల చేసాయి. 7706 అనే మరో కొత్త చెరకు రకాన్ని పలు ప్రయోగాలతో పరిశీలించి బెల్లం తయారీకి అత్యుత్తమమైన రకంగా నిర్దారించారు. రైతాంగంలో ఇది కూడా విశేష ప్రచారం పొందింది.

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు