జలరాట్నం
జలరాట్నం అనగా నీటిని పైకి తోడే రాట్నం ఆకారం కలిగిన ఒక యంత్రం, ఇది నీటిపై తిరుగుతూ నీటిపై కృత్రిమంగా నిర్మించబడిన కాలువలోకి నీరును సరఫరా చేస్తుంది, ఈ కాలువను ఆంగ్లంలో ఆక్విడెక్ట్ అంటారు. జలరాట్నంను ఆంగ్లంలో నోరియా అంటారు, దీనిని సాగునీటి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
రకాలు
మార్చుజలరాట్నాలు మూడు రకాలు ఉన్నాయి. ఉదాహరణకు అత్యంత సాధారణ జలరాట్నం బకెట్ల గొలుసు కట్టబడిన నిలువుచక్రం. ఈ బకెట్ల గొలుసు 8 మీటర్ల (26 అడుగులు) లోతు వరకు ఉండవచ్చు, ఈ బకెట్లు బావిలోకి వ్రేలాడి ఉంటాయి. అత్యంత ప్రాచీనమైన ఈ రకపు నోరియాలను నడిపేందుకు గాడిదలను లేదా ఎద్దులను ఉపయోగించారు. జంతువు వలన తిరిగే మరొక చక్రంతో నోరియా అనుసంధానమై ఉన్నందువలన ఆ చక్రంతో పాటు నోరియా కూడా తిరుగుతుంది. తద్వారా ఈ నోరియాకు ఉన్న బకెట్లు కూడా తిరుగుతూ నీటిలోనికి మునిగినప్పుడు నీటిని నింపుకొని పైకి వచ్చినప్పుడు పైన కృత్రిమంగా ఏర్పాటు చేసిన కాలువలో పారబోస్తాయి.
రెండవ రకం కూడా కొద్ది మార్పులతో ఇలానే ఉంటుంది, అయితే ఇది గాలి శక్తి ద్వారా నడుపబడుతుంది.
మూడవ రకపు జలరాట్నం కూడా కొద్ది మార్పులతో ఇలానే ఉంటుంది, అయితే ఇది నీటి ప్రవాహపు శక్తి ద్వారా ముఖ్యంగా నది ప్రవాహపు శక్తి ద్వారా నడుపబడుతుంది.
చిత్రమాలిక
మార్చు