జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి
జలాంతర్గాముల నుండి ప్రయోగించడానికి వీలయ్యే బాలిస్టిక్ క్షిపణిని జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి అంటారు. ఈ క్షిపణుల ఆధునిక రూపాలు మిర్వ్ సామర్థ్యం, అణు సామర్థ్యమూ కలిగి ఉంటాయి. మిర్వ్ సామర్థ్యంతో ఒకే ఒక్క క్షిపణి ప్రయోగంతో అనేక లక్ష్యాలను ఏక కాలంలో ఛేదించగలిగే అవకాశం ఉంటుంది. జలాంతర్గామి నుండి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణుల కంటే ఇవి విభిన్నంగా ఉంటాయి.
ఇవి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల (5,500 కి.మీ. పైబడిన పరిధి) లాగానే పనిచేస్తాయి. చాలా సందర్భాల్లో ఈ రెండు రకాల క్షిపణులు కూడా ఒకే క్షిపణి కుటుంబానికి చెంది ఉంటాయి.
చరిత్ర
మార్చుబాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు అణుపాటవం గల దేశాలకు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనవి. ఇవి నిఘా ఉపగ్రహాల కంటబడకుండా ఉంటూ, తమ అణ్వాయుధాలను ప్రయోగించగలవు. శత్రుదేశాల అణుదాడిలో నేలపై ఉండే అణ్వాయుధాలన్నీ నాశనమైనా, ఈ తొలిదాడిని తప్పించుకుని, విధ్వంసకమైన ప్రతిదాడి చేసే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉంటాయి. దీంతో, ఏమాత్రం సందేహం వచ్చినా అణ్వాయుధాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం, తత్కారణంగా ప్రమాదవశాత్తూ అణుయుద్ధం మొదలయ్యే అవకాశం తొలగి పోయింది. ఎంతో నిశ్శబ్దంగా ఉండే ఈ జలాంతర్గాములపై, ఎంతో కచ్చితత్వం గల క్షిపణులను మోహరించడం ద్వారా, శత్రుదేశ తీరానికి దగ్గరగా వెళ్ళి, తక్కువ ఎత్తు గల బాలిస్టిక్ పథంలో క్షిపణిని ప్రయోగించి, తొలిదాడి జరిగిన తరువాత అతి తక్కువ సమయంలో, అత్యంత కచ్చితత్వంతో ప్రతిదాడిని చెయ్యవచ్చు. అలాగే ఈ ప్రతిదాడి ద్వారా శత్రుదేశపు రాజకీయ, సైనిక నాయకత్వాన్ని పూర్తిగా నిర్మూలించగలిగే సామర్థ్యమూ వీటికి ఉంది.
రకాలు
మార్చుజలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు (గత, ఇప్పటి, అభివృద్ధిలో ఉన్న) ఇవి:
రకం | నాటో పిలిచే పేరు | కనిష్ట పరిధి (కి.మీ.) | గరిష్ఠ పరిధి (కి.మీ.) | దేశం | స్థితి |
---|---|---|---|---|---|
UGM-27 పోలారిస్ (A-1 నుండి A-3 దాకా) | 4,600 | అమెరికా | మోహరింపు నుండి తొలగించారు | ||
UGM-73 పోసీడాన్ (C-3) | 4,600 | అమెరికా | మోహరింపు నుండి తొలగించారు | ||
UGM-96 ట్రైడెంట్ I (C-4) | 7,400 | అమెరికా | మోహరింపు నుండి తొలగించారు | ||
UGM-133 Trident II (D5LE) | 12,000 | అమెరికా | మోహరించారు | ||
R-13 | SS-N-4 | 600 | సోవియట్ యూనియన్/రష్యా | మోహరింపు నుండి తొలగించారు | |
R-21 | SS-N-5 | 1,650 | సోవియట్ యూనియన్/రష్యా | మోహరింపు నుండి తొలగించారు | |
R-27 | SS-N-6 | 2,400 | 3,000 | సోవియట్ యూనియన్/రష్యా | మోహరింపు నుండి తొలగించారు |
RSM-40[1] R-29 "వైసోటా" | SS-N-8 "Sawfly" | 7,700 | 9,000 | సోవియట్ యూనియన్/రష్యా | మోహరింపు నుండి తొలగించారు |
R-27K | SS-NX-13 | 3,600 | సోవియట్ యూనియన్/రష్యా | Never మోహరించారు[2] | |
RSM-45 R-31 | SS-N-17 "Snipe" | 4,500 | సోవియట్ యూనియన్/రష్యా | మోహరింపు నుండి తొలగించారు | |
RSM-50 R-29R "వైసోటా" | SS-N-18 "Stingray" | 6,500 | సోవియట్ యూనియన్/రష్యా | మోహరింపు నుండి తొలగించారు | |
RSM-52 R-39 "Rif" | SS-N-20 "Sturgeon" | 8,300 | సోవియట్ యూనియన్/రష్యా | మోహరింపు నుండి తొలగించారు | |
RSM-54 R-29RM "ష్టిల్" | SS-N-23 "Skiff" | 8,300 | సోవియట్ యూనియన్/రష్యా | మోహరింపు నుండి తొలగించారు (Under rebuild to R-29RMU "Sineva")[3] | |
RSM-54 R-29RMU "సినేవా" | SS-N-23 "Skiff" | 8,300 | సోవియట్ యూనియన్/రష్యా | మోహరించారు | |
RSM-54 R-29RMU2 "లేనర్" | 8,300 | 12,000 | సోవియట్ యూనియన్/రష్యా | మోహరించారు | |
RSM-56 R-30 "బులావా" | SS-NX-32[4] | 8,000 | 8,300 | సోవియట్ యూనియన్/రష్యా | మోహరించారు |
UGM-27 Polaris (A-3) and Chevaline | 4,600 | United Kingdom | మోహరింపు నుండి తొలగించారు | ||
UGM-133 Trident II (D5) | 12,000 | United Kingdom | మోహరించారు | ||
M1 | 3,000 | ఫ్రాన్సు | మోహరింపు నుండి తొలగించారు | ||
M2 | 3,200 | ఫ్రాన్సు | మోహరింపు నుండి తొలగించారు | ||
M20 | 3,000 | ఫ్రాన్సు | మోహరింపు నుండి తొలగించారు | ||
M4 | 5,000 | ఫ్రాన్సు | మోహరింపు నుండి తొలగించారు | ||
M45 | 6,000 | ఫ్రాన్సు | మోహరించారు | ||
M51 | 8,000 | 10,000 | ఫ్రాన్సు | మోహరించారు | |
JL-1[5] | 2,500 | చైనా | మోహరింపు నుండి తొలగించారు (never fully మోహరించారు) | ||
JL-2 | 7,400 | 8,000 | చైనా | మోహరించారు | |
JL-3 | 11,000 | చైనా | పరీక్షిస్తున్నారు [6] | ||
K-15 సాగరిక | 750 | 1,900 | భారత్ | మోహరించారు | |
K-4 | 3,500 | భారత్ | అరిహంత్ తరగతి జలాంతర్గామి నుండి పరీక్షించారు.[7] | ||
K-5 | 6,000 | భారత్ | అభివృద్ధి జరుగుతోంది[8][9] | ||
పుక్కుక్‌సాంగ్-1/KN-11 | 500 | 2,500 | ఉత్తర కొరియా | అభివృద్ధి జరుగుతోంది[10] |
సైనికేతర వినియోగం
మార్చుకొన్ని రష్యా జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను ఉపగ్రహ వాహకనౌకలుగా మార్చారు.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Korabli VMF SSSR, Vol. 1, Part 1, Yu. Apalkov, Sankt Peterburg, 2003, ISBN 5-8172-0069-4
- ↑ SS-NX-13 SLBM System (U), Defense Intelligence Agency, D5T-1020S-4l7-75, 1 October 1975
- ↑ "SSBN K-51 Verkhoturye arrived to Zvezdochka for repairs today". Rusnavy.com. 23 August 2010. Retrieved 8 October 2010.
- ↑ NASIC-1031-0985-09
- ↑ "JL-1 [CSS-N-3] – China Nuclear Forces". Fas.org. Retrieved 10 February 2012.
- ↑ "詹氏:大陸將試驗巨浪3飛彈 採用東風41技術". 联合早报网. Retrieved 2017-08-08.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-08. Retrieved 2018-07-02.
- ↑ "Going nuclear at sea". The Indian Express. 19 March 2015. Retrieved 11 January 2017.
- ↑ "India's First Ballistic Missile Sub to Begin Sea Trials". The Diplomat. 30 July 2013. Retrieved 11 January 2017.
- ↑ (2nd LD) N.K. leader calls SLBM launch success, boasts of nuke attack capacity – Yonhap, 25 August 2016 08:17 am
- Friedman, Norman (1994). U.S. Submarines Since 1945: An Illustrated Design History. Annapolis, Maryland: United States Naval Institute. ISBN 1-55750-260-9.
- Gardiner, Robert; Chumbley, Stephen (1995). Conway's All the World's Fighting Ships 1947–1995. London: Conway Maritime Press. ISBN 1-55750-132-7.
- Polmar, Norman (1981). The American Submarine. Annapolis, Maryland: Nautical and Aviation Publishing. pp. 123–136. ISBN 0-933852-14-2.
బయటి లింకులు
మార్చు- Navweaps.com US naval missiles index page
- Navweaps.com Soviet and Russian naval missiles index page
- Navweaps.com UK naval missiles index page
- Video[permanent dead link] showing the launch of a Trident SLBM.
- Estimated Strategic Nuclear Weapons Inventories (September 2004)
- R-11 SLBM
- Trident Submarines Are Killing Machines Unparalleled In Human History.
- NavSource.org SSBN photo gallery index