మధ్యంతర పరిధి బాలిస్టిక్ క్షిపణి

మధ్యంతర పరిధి బాలిస్టిక్ క్షిపణి (IRBM), 3,000–5,500 కిమీ పరిధి కలిగిన బాలిస్టిక్ క్షిపణి. పరిధిని బట్టి బాలిస్టిక్ క్షిపణులను  వర్గీకరించడం కేవలం సౌకర్యార్థమే. ఈ వర్గీకరణ కూడా వివిధ దేశాలు వివిధ రకాలుగా చేస్తారు. కొన్ని దేశాల నిర్వచనాల్లో దూర పరిధి క్షిపణి ఉండగా, కొన్ని దేశాల్లో ఈ తరగతిని నిర్వచించలేదు. మరింత ఆధునికమైన పేరు థియేటర్ బాలిస్టిక్ క్షిపణి. 3,500 కిమీ పరిధి లోపు ఉండే క్షిపణులన్నీ ఈ వర్గంలోకి వస్తాయి.

మధ్యంతర, మధ్య పరిధి క్షిపణులు.

మధ్యంతర క్షిపణులను ప్రస్తుతం చైనా, భారత్, ఇజ్రాయిల్,[1] [2] బహుశా ఉత్తర కొరియా ఆపరేట్ చేస్తున్నాయి.[3] అమెరికాసోవియట్ యూనియన్, ఇంగ్లాండు, ఫ్రాన్సు గతంలో ఆపరేట్ చేసిన దేశాలు.

కొన్ని మధ్యంతర క్షిపణుల జాబితాసవరించు

మధ్యంతర పరిధి బాలిస్టిక్ క్షిపణులు
తేదీ *D మోడల్ పరిధి కిమీ గరిష్ఠ కిమీ దేశం
1959 R-14 చుసోవయా 4,500   సోవియట్ యూనియన్
1959 PGM-17 Thor 1,850 3,700   అమెరికా,   ఇంగ్లాండ్
1970 DF-3A 3,300 4,000   చైనా
1976 RSD-10 Pioneer (SS-20) 5,500   సోవియట్ యూనియన్
1980 S3 IRBM 3,500   ఫ్రాన్స్
2004 DF-25 3,200 4,000   చైనా
2006 అగ్ని-3[4] 3,500 5,000   భారత్[5]
2007 DF-26 3,500 5,000   చైనా
2010 RD-B ముసుడాన్ 2,500 4,000 (రుజువు కాలేదు)   ఉత్తర కొరియా[5]
2011 అగ్ని-4 3,000 4,000   భారత్ [6]
2011 జెరికో 3 4,800 6,500   ఇజ్రాయిల్[7][8]
2012 KN-08   ఉత్తర కొరియా
2014 KN-11   ఉత్తర కొరియా

చరిత్రసవరించు

మధ్యంతర క్షిపణికి మాతృక A4b రాకెట్. ఇది వి-2 రాకెట్‌పై ఆధారపడి అభివృద్ధి చేసినది. A4b, A9/A10 రాకెట్ యొక్క పై దశకు ప్రొటో టైపు. ఈ ప్రాజెక్టు  యొక్క లక్ష్యం, ఫ్రాన్స్, లేదా స్పెయిన్ నుండి ప్రయోగించి న్యూయార్కును కొట్టగలిగే సామర్థ్యాన్ని సాధించడం. 1944 డిసెంబరు, 1945 జనవరి ఫిబ్రవరిల్లో  A4b రాకెట్లను కొన్నిసార్లు పరీక్షించారు.[9] ఈ రాకెట్లన్నీ ద్రవ ఇంధనాన్ని వాడాయి. A4b ఇనర్షియల్ గైడెన్స్ వ్యవస్థను వాడగా, A9 ను ఒక పైలట్ నియంత్రిస్తాడు. రెంటినీ కూడా స్థిర ప్లాట్‌ఫారము నుండి ప్రయోగించారు.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత వాన్ బ్రాన్‌తో సహా ఇతర నాజీ శాస్త్రవేత్తలను రహస్యంగా అమెరికా తరలించి, వి-2 ను ఆయుధంగా మలచే ప్రాజెక్టులో నియమించారు. ఈ ఆపరేషన్‌ను ఆపరేషన్ పేపర్‌క్లిప్ అంటారు.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలు వనరులుసవరించు

  1. "Indian Army Successfully Test Fires Nuke-Capable Agni-IV Missile". The New Indian Express. Retrieved 2016-03-25.
  2. "Ballistic missile Agni-IV test-fired as part of user trial - Times of India". The Times of India. Retrieved 2016-03-25.
  3. "North Korea's Ballistic Missile Program" (PDF). National Committee on North Korea. Retrieved 2016-04-01.
  4. DRDO plans early entry of Agni-4 into arsenal.
  5. 5.0 5.1 "Ballistic Missiles of the World". MissileThreat. Retrieved 2011-07-15.[permanent dead link]
  6. "Sci-Tech / Science : India to test fire Agni-V by year-end". The Hindu. Chennai, India. 2011-06-03. Retrieved 2011-07-15.
  7. "Jericho 3". Missile Threat. 2012-03-26. Archived from the original on 2013-01-21. Retrieved 2012-09-12.
  8. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-21. Retrieved 2016-07-28.
  9. "Die geflügelte Rakete ( A7, A9, A4b ) (in German)". V2werk-oberraderach.de. Retrieved 2011-07-15.