జలాల్‌పురం అష్టలింగేశ్వరాలయం

జలాల్‌పురం అష్టలింగేశ్వరాలయం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలంలోని జలాల్‌పురం గ్రామంలో ఉన్న శివాలయం. రెండు సముదాయాలుగా నిర్మితమైన ఈ అష్టలింగేశ్వరాలయాన్ని కాకతీయుల కాలంలో రెడ్డి రాజులు నిర్మించినట్లు చరిత్రకారుల అభిప్రాయం. దీనిని మల్లికార్జున దేవాలయంగా కూడా పిలుచుకుంటున్నారు.[1]

జలాల్‌పురం అష్టలింగేశ్వరాలయం
జలాల్‌పురం అష్టలింగేశ్వరాలయం
జలాల్‌పురం అష్టలింగేశ్వరాలయం
జలాల్‌పురం అష్టలింగేశ్వరాలయం is located in Telangana
జలాల్‌పురం అష్టలింగేశ్వరాలయం
తెలంగాణలో దేవాలయ స్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలు17°29′04″N 79°33′32″E / 17.484402°N 79.559000°E / 17.484402; 79.559000
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాసూర్యాపేట
స్థలంజలాల్‌పురం, తిరుమలగిరి మండలం
సంస్కృతి
దైవంమల్లికార్జున స్వామి
వాస్తుశైలి
నిర్మాణ శైలులుకాకతీయ నిర్మాణ శైలి
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీ12వ శతాబ్దం

చరిత్ర మార్చు

గ్రామ శివారులో ఎత్తైన పరుపుబండపై 20 ఎకరాల్లో 12 లింగాలతో ఈ అష్టలింగేశ్వరాలయం (మూడు చతుర్కూట ఆలయాలు) నిర్మించబడింది. కాంతి పరిక్షేపణ ఆధారంగా నిర్మించిన ఛాయ చతురుకోట దేవాలయాలుగా వీటిని చెబుతుంటారు. కాకతీయుల చరిత్రపైనా అనేక పుస్తకాలు రచించిన చరిత్రకారులు 12వ శతాబ్దంలో కాకతీయుల సామంతులైన రెడ్డి రాజుల్లో చెరుకురెడ్డి వంశీయులు దీన్ని నిర్మించినట్లుగా పేర్కొన్నారు.

రెడ్డి రాజుల్లో ఒకడైన బొల్లారెడ్డి తన రాజ్య పరిధిలో ఉన్న జలాల్‌పురం గ్రామంలోని రాతి గుట్టపై 8 మండపాలతో పెద్ద ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి శాసనాల్లో స్పష్టంగా రాయబడివుంది. అంతేకాకుండా ఇమ్మడి విశ్వనాథం అనే వ్యక్తి దేవాలయానికి నాలుగు వైపులా శాసనాలు వేయించినట్లు, సామాన్యశకం 1124లో రాజు బొల్లారెడ్డి మరో శాసనం వేయించినట్లు తెలుస్తోంది.

నిర్మాణ శైలి మార్చు

రెండు సముదాయాలుగా అష్ట గోపురాలతో నిర్మితమై అందమైన గోపురాలతో తీర్చిదిద్దిబడిన ఆలయ గోపుర నిర్మాణం పానగల్లులోని ఛాయా సోమేశ్వరాలయం గోపుర నమూనాలను పోలివుంది.[2] ఈ నిర్మాణాన్ని శ్రీకాటేశ్వర, మారేశ్వర, సూర్యదేవరల ఆలయంగా స్థానికులు పిలుస్తారు. గర్భగుడిలో నిశ్చల ఛాయ పడేలా శిల్పులు ఆలయాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు. ఇక్కడున్న మూడు ఛాయా చతుర్కూట దేవాలయాలలో ఒక్కో దేవాలయంలో నాలుగు శివ లింగాలు ఉన్నాయి. మూడు దేవాలయాల్లోనూ కేవలం పడమటివైపున్న ఆలయ గర్భగుడిలో మాత్రమే నీడ పడేలా చేశారు. ఈ గుడులు నిర్మించిన అనుభవంతోనే ఆ ఛాయా సోమేశ్వరాలయాన్ని నిర్మించి, ఈ ఆలయాల నిర్మాణంలో లోపాలను ఛాయా సోమేశ్వరాలయ నిర్మాణంలో అధిగమించారు.[3]

ఇతర వివరాలు మార్చు

  1. దేవాలయంలో గుప్తనిధులకోసం తవ్వకాలలు జరపడంతో సూక్మ శిల్పకళతో కూడిన నందులు, శివలింగాలు కనుమరుగయ్యాయి.
  2. ఇక్కడ రాకాసి గుండ్లు, ఆది మానవుల ఆనవాళ్లు కూడా ఉన్నాయి.
  3. గ్రామస్తులంతా కలిసి ఆలయ కమిటీ ఆధ్వర్యంతో ప్రతిఏటా మహాశివరాత్రి సందర్భంగా వారం రోజులపాటు పూజలు నిర్వహిస్తారు.

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ, టూరిజం (27 August 2021). "అహో..! అనిపించే అష్టలింగేశ్వరాలయాలు". Namasthe Telangana. Archived from the original on 17 September 2021. Retrieved 18 October 2021.
  2. "సోమేశ్వరాలయ రహస్యమిదీ! - Andhrajyothy". Dailyhunt (in ఇంగ్లీష్). 2017-10-30. Archived from the original on 2021-10-18. Retrieved 2021-10-18.
  3. "జలాల్‌పుర క్షేత్రం..వెలుగునీడల అద్భుతం - Andhrajyothy | DailyHunt Lite". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 2021-10-18. Retrieved 2021-10-18.