జల్పైగురి జిల్లా

వెస్ట్ బెంగాల్ లోని జిల్లా

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర 20 జిల్లాలలో జల్పైగురి (బెంగాలి: জলপাইগুড়ি জেলা) ఒకటి. ఇది ఉత్తర అక్ష్క్షంశంలో 26° 16', 27° 0' తూర్పు రేఖాంశంలో 88° 4', 89° 53' ఉపస్తితమై ఉంది. ఈ జిల్లా 1869లో రూపొందించబడింది. జిల్లాకేంద్రంగా జల్పైగురి ఉంది. ఇది నార్త్ బెంగాల్ డివిషనల్ హెడ్‌క్వార్టరుగా కూడా ఉంది. ఇది పర్యాటకం, టీ తోటలు, కొండలు, అరణ్యం, ప్రకృతి సౌందర్యానికి ఇది ప్రసిద్ధిచెందింది.

Jalpiaguri జిల్లా
জলপাইগুড়ি জেলা
West Bengal పటంలో Jalpiaguri జిల్లా స్థానం
West Bengal పటంలో Jalpiaguri జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంWest Bengal
డివిజనుJalpaiguri
ముఖ్య పట్టణంJalpaiguri
Government
 • లోకసభ నియోజకవర్గాలుJalpaiguri
 • శాసనసభ నియోజకవర్గాలుNagrakata, Dhupguri, Maynaguri, Mal, Dabgram-Phulbari, Jalpaiguri, Rajganj
Area
 • మొత్తం2,844 km2 (1,098 sq mi)
Population
 (2011)
 • మొత్తం21,72,846
 • Density760/km2 (2,000/sq mi)
 • Urban
6,03,847
జనాభా వివరాలు
 • అక్షరాస్యత73.79 per cent
 • లింగ నిష్పత్తి954
ప్రధాన రహదార్లుNH 31, NH 31A, NH 31C, NH 31D
సగటు వార్షిక వర్షపాతం3160 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

పేరు వెనుక చరిత్ర మార్చు

బెంగాలీ భాషలో జల్పై అంటే ఆలివ్ అని గురి అంటే ప్రదేశం అని అర్ధం. ఆలివ్ పుష్క్లలంగా పండే ప్రాంతం కనుక ఇది జల్పైగురి అయింది. 1900 నుడి అలివ్ పండించబడుతుంది. మరొక కథనం అనుసతించి ఇక్కడ ఉన్న జల్పేష్ ఆలయం కారణంగా ఈ ప్రాంతానికీ పేరు వచ్చిందని విశ్వసిస్తున్నారు.

చరిత్ర మార్చు

జల్పైగురి జిల్లాలో పశ్చిమ డోయర్లు, మొరాంగ్ తూర్పు ప్రాంతంలో అధిక భాగం ఉన్నాయి. సైలెన్ దేబ్నాథ్ రచనల ఆధారంగా పూర్వం ఈ ప్రాంతం కామరూప్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేదిదని తెలుస్తుంది. 7వ శతాబ్దం సగం నుండి ఈ ప్రాంతం కామతపూర్ సామ్రాజ్యంలో భాగంగా మారింది.[1] దేబ్నాథ్ రచనల ఆధారంగా కామతపూర్ సామ్రాజ్యంలోని 5 రాజధానులలో 3 జల్పైగురి జిల్లాలో ఉన్నాయని భావిస్తున్నారు. అవి వరుసగా చిలపత, మైనాగురి, పంచగర్. జల్పైగురి జిల్లాలో ఉన్న హింగులవాస్ ప్రాంతం కోచ్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేదని తెలుస్తుంది. ప్రస్తుతం హింగులవాస్ ప్రజలు అలిపుదుయర్ లోని మహాకాల్గురి వద్ద ఉన్నారని తెలుస్తుంది.[1]

  
  
 

భౌగోళికం మార్చు

 
Nature in Jalpaiguri district

జల్పైగురి జిల్లా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉత్తర భాగంలో ఉంది. జిల్లా ఉత్తర, దక్షిణ సరిహద్దులలో భూటాన్, బంగ్లాదేశ్ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులను పంచుకుంటుంది. పశ్చిమ సరిహద్దులో డార్జిలింగ్ కొండలు, వాయవ్య సరిహద్దులో అలిపురుదుయర్ జిల్లా, కూచ్ బెహర్ జిల్లా, ఉత్తర సరిహద్దులో ఉన్నాయి.

  • జిల్లాలో " గొరుమారా నేషనల్ పార్క్ ", చప్రామరి వన్యప్రాణి అభయారణ్యం " జాతీయ అభయారణ్యాలు ఉన్నాయి.

వాతావరణం మార్చు

జల్పైగురి ఆగ్నేయ ఆసియాలోని వర్షపాత వాతావరణ జోన్ ప్రాంతం. ఈప్రాంతం మే అత్యంత ఉష్ణంగా ఉంటుంది. వేసవి గరిష్ఠ ఉష్ణం 32 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. అతిచల్లని మాసం జనవరి ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్షియస్. ఇప్పటి వరకు నమోదైన అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్షియస్, అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్షియస్. సారాసరి వార్షిక తేమశాతం 82%. వార్షిక సరాసరి వర్షపాతం 3160 మి.మీ. అత్యంత పొడివాతావరణం కలిగిన మాసం డిసెంబరు (వర్షపాతం 2 మి.మీ). జూలై అత్యధికంగా 809 మి.మీ వర్షపాతం ఉంటుంది. మే మాసంలో ఉరుములతో కూడిన వర్షపాతం సాధారణం.

భూవర్ణన మార్చు

జిల్లా భూభాగంలో ఉపనదులు, నదులు, కొండలు ఉన్నాయి. సిక్కిం, డార్జిలింగ్ కొండలు లోయలు గంగానదీ ప్రవాహిత ప్రాంతంతో ఈ ప్రాంతం సౌందర్యవంతంగా ఉంటుంది. ఇక్కడ తీస్తా, టొర్స, రైడక్, డైన, నెయొర, సంకోష్ మొదలైన నదులు ప్రవహిస్తున్నాయి. ఈ ప్రశాంత వాతావరణం టీ, టింబర్, పర్యాటకం ప్రదిద్ధిచెందింది. భూటాన్ సమీపంలోని ప్రాంతానికి డోయర్ అనే పేరు వచ్చింది. డోయర్ అంటే భూటాన్కు ద్వారం అని అర్ధం.

ఆర్ధికం మార్చు

జల్పైగురి జిల్లాలో 2530.63 చ.కి.మీ వ్యవసాయభూములు ఉన్నాయి. జిల్లాలో జనుము, పొగాకు పంటలు అధికంగా పండుతున్నాయి. వర్షాకాలానికి ముందు, వెనుక వరి పంట పండుతూ ఉంది. జిల్లాలో వక్క, కొబ్బరి, మిరియాల తోటలు సాగుచేయబడుతున్నాయి. కురగాయలు, ఆవాలు, ఉర్లగడ్డలు పంటలు అధికరిస్తున్నాయి. వ్యవసాయానికి సహకారంగా పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, వేరుచనగ పంటలు పండినబడుతున్నాయి. వరి, ఉర్లగడ్డ పంటలలో అధునిక పద్ధతులు అనుసరిస్తున్నారు. అయినప్పటికీ ఆధునికతను అంగీకరించని రైతులు ఇంక సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తున్నారు. వ్యవసాయ భూములలో 33% నికి నీటిపారుదల లభిస్తుంది. కరీఫ్ కాకంలో ఈ ప్రాంతంలో కూరగాయలు, ఇతర పంటలను తగ్గిస్తారు.

పెంపుడు జంతువులు మార్చు

పశ్చిమ బెంగాల్ మైదానాలకు టిబెట్ వ్యాపారుల ద్వారా గొర్రెల పెంపకం మొదలైంది. టిబెట్ వ్యాపారులు, పశ్చిమ బెంగాల్ వ్యాపారులతో ఈ ప్రాంతంతంలో వాణిజ్యం ఆరంభం అయింది. మైనగురి సమీపంలో ఉన్న భోట్ పట్టి వద్ద గొర్రెలతో మరికొన్ని వస్తువులు పరస్పరం మార్చుకొనబడ్డాయి.ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న రంగ్పూర్ ప్రధాన వ్యాపారకూడలిగా ఉండేది. రైతుల నుండి వస్తువులను తీసుకుని బదులుగా రైతులకు గొర్రెలు ఇవ్వబడ్డాయి. కాలనీ ప్రభుత్వకాలంలో గొర్రెలను మాంసం కొరకు వాడుకునే వారు. 18వ శతాబ్దంలో ఆస్ట్రేలియా కాలనీ వాదులు స్థిరపడిన తరువాత ఇక్కడి నుండి గొర్రెలు ఆస్ట్రేలియాకు బదిలీచేయబడుతూ ఉండేవి.

విభాగాలు మార్చు

ఉపవిభాగాలు మార్చు

జల్పైగురి జిల్లాలో 4 ఉపవిభాగాలున్నాయి.


  • జల్పైగురి సదర్ ఉప
  • మాల్బజార్ ఉపవిభాగం
  • ధూప్గురి ఉపవిభాగం
  • మెఖిల్గంజ్ ఉపవిభాగం

అసెంబ్లీ నియోజక వర్గాలు మార్చు

జల్పైగురి జిల్లాలో 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి :[2]

అసెంబ్లీ నియోజకవర్గాలు మార్చు

  1. ధూప్గురి (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 15),
  2. నగరకత (విధాన సభ నియోజకవర్గం) (ఎస్టీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 16),
  3. మాయనగురి (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (శాసనసభ నియోజకవర్గం No 17.),
  4. మల్ (విధాన సభ నియోజకవర్గం) మల్ (ఎస్టీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 18),
  5. మెక్లిగంజ్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 1),
  6. క్రాంతి (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం No 19) (రద్దుచేయబడింది),
  7. జల్పైగురి (విధాన సభ నియోజకవర్గం) (శాసనసభ నియోజకవర్గం ఏ 20.),
  8. రైగని (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ)]] (శాసనసభ నియోజకవర్గం ఏ 21.).

షెడ్యూల్డ్ కులాలకు , షెడ్యూల్డ్ జాతులకు రిజర్వ్ చేయబడిన నియోజకవర్గాలు మార్చు

  • షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ జాతులకు రిజర్వ్ చేయబడిన నియోజకవర్గాలు :- నాగ్రకత, మలిబజార్ నియీజకవర్గాలు
  • షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ జాతులకు రిజర్వ్ చేయబడిన నియోజకవర్గాలు :- ధూప్గురి, మైనాగురి, రాజ్గంజ్
  • జల్పైగురి పార్లమెంటు నియోజకవర్గం :- ధూప్గురి, మైనాగురి, మాల్బజార్, క్రాంతి, జల్పైగురి, రాజ్గంజ్ నియోజక వర్గాలు కూచ్‌బెహర్ జిల్లాలోని 1 శాసనసభ నియోజక వర్గం.

పునవిభజన తరువాత నియోజకవర్గం మార్చు

పశిమబెంగాల్ డిలిమినేషన్ ఆఫ్ కంసిస్టెన్సీస్ సిఫారుసుతో డిలిమినేషన్ కమిషన్ " ఆదేశానుసారం జల్పైగురి జిల్లాలోని నియోజకవర్గాల పునర్విభజన తరువాత జిల్లా 7 అసెంబ్లీ నియోజకవర్గాలుగా విభజించబడింది. [3]

  1. ధూప్గురి (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 15),
  2. మాయంగురి (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (అసెంబ్లీ నియోజకవర్గం ఏ 16.),
  3. జల్పైగురి (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 17),
  4. రాజ్గంజ్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 18),
  5. దాబ్గ్రాం -ఫుల్బరి (విధాన సభ నియోజకవర్గం)-ఫుల్బరి (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 19),
  6. మల్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్టీ) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 20) ,
  7. నాగరకత (విధాన సభ నియోజకవర్గం) (ఎస్టీ) (అసెంబ్లీ నియోజకవర్గం ఏ 21.).

షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు మార్చు

  • షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు :- మలిబజార్ , నాగరకత నియోజకవర్గాలు.
  • షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు :- ధూప్గురి, మైనాగురి, జల్పైగురి , రాజ్గంజ్ నియోజకవర్గాలు. కూచ్ బెహర్ జిల్లా నుండి ఒక అసెంబ్లీ నియోజకవర్గంతో చేర్చి. అసెంబ్లీ నియోజక వర్గాలు.
  • జల్పైగురి పార్లమెంటరీ నియోజకవర్గం :- ధూప్గురి, మైనాగురి, జల్పైగురి, రాజ్గంజ్ , దబ్‌గ్రాం- ఫూల్బరి , మాల్బజార్.

పోలీస్ స్టేషన్లు మార్చు

జిల్లాలో 12 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి:-

[4]

  1. బనరాత్
  2. న్యూ జల్పైగురి (భక్తినగర్ )
  3. బిన్నగర్
  4. ధూప్గురి
  5. హల్దీపూర్
  6. జల్పైగురి (కోత్వాలి)
  7. మాల్బజార్
  8. మాతెల్లి
  9. మైనాగురి
  10. మెఖిల్గంజ్
  11. నాగరకత
  12. రైగంజ్

టెలిఫోన్ జిల్లాలు మార్చు

జల్పైగురి జిల్లాలో 6 టెలిఫోన్ ప్రాంతాలున్నాయి. అవి: 03561, 03562, 03563, 03564, 03565, 03566.

ప్రయాణసౌకర్యాలు మార్చు

జిల్లా రహదారి , రైలుమార్గాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది. జల్పైగురికి 50 కి.మీ దూరంలో ఉన్న " బాగ్డోగ్రా విమానాశ్రయం " వద్దకు రహదారి మార్గం ద్వారా విమానప్రయాణ సౌకర్యం లభిస్తుంది.

2001 లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,869,675,[5]
ఇది దాదాపు. లిబెరియా దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 66 వ స్థానంలో ఉంది.[5]
1చ.కి.మీ జనసాంద్రత. 621 [5]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.77%.[5]
స్త్రీ పురుష నిష్పత్తి. 954:1000 [5]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 73.79%.[5]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు మార్చు

జల్పైగురి జిల్లాలో బెంగాలి,ంహింది, బిజోరీ-ఏ, ప్రత్యేకంగా ఖ్మర్‌కు సంధించిన మండా, వియత్నామీస్ భాధలను 2,500 మంది మాట్లాడుతున్నారు. [7]

వృక్షజాలం , జంతుజాలం మార్చు

1954లో జల్పైగురి జిల్లాలో 79 చ.కి.మీ వైశాల్యంలో " గురుమరా నేషనల్ పార్క్ " ఏర్పాటుచేయబడింది. [8] గురుమరా నేషనల్ పార్క్ తో జిల్లాలో " చప్రామరి విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఉంది.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Sailen Debnath, The Dooars in Historical Transition, ISBN 9788186860441, N.L. Publishers
  2. "General election to the Legislative Assembly, 2001 – List of Parliamentary and Assembly Constituencies" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 2008-11-16.
  3. "Press Note, Delimitation Commission" (PDF). Assembly Constituencies in West Bengal. Delimitation Commission. Archived from the original (PDF) on 2013-05-29. Retrieved 2008-11-16.
  4. "Administrative setup". Official website of the Jalpaiguri district. Archived from the original on 2009-04-10. Retrieved 2008-11-07.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2019-01-07. Retrieved 2011-10-01. Liberia 3,786,764 July 2011 est.
  7. M. Paul Lewis, ed. (2009). "Bijori: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.
  8. Indian Ministry of Forests and Environment. "Protected areas: Sikkim". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.

వెలుపలి లింకులు మార్చు