కటికితల రామస్వామి
జస్టిస్ కటికితల రామస్వామి హైకోర్టు,సుప్రీంకోర్టుల నందు న్యాయాధిపతిగా పనిచేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలానికి చెందిన భట్లమగుటూరు లో 1932 జులై 13న మంగమ్మ, చిట్టయ్యలకు జన్మించాడు.మార్టేరులో పదో తరగతి,భీమవరంలో డిగ్రీ,ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ, బ్యాచిలర్ ఆఫ్ లా చదివాడు. రామస్వామి సాహసోపేతమైన తీర్పులు వెలువరించాడు.ఉద్యోగనియామకాలు ఏవైనా ఉద్యోగ ప్రకటన ఇచ్చాకనే చెయ్యాలని,అసైన్ మెంట్ భూములకు భూసేకరణలో ప్రైవేటు యజమానులలాగా నష్టపరిహారం ఇవ్వాలని తీర్పులు వెలువడ్డాయి.ఏళ్ల తరబడి కేసులను సాగదీయకుండా త్వరితగతిన తీర్పులను వెలువరించేవారని ఖ్యాతి పొందాడు.కే.బీ.ఆర్. పార్కు ప్రజలదని తీర్పు వెలువరించి ఆ భూమిని కాపాడాడు.ఎస్.ఆర్. బొమ్మై కేసులో చరిత్రాత్మక తీర్పును వెలువరించాడు.నిక్కచ్చిగా ఉండే తత్వం.1989లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 1997లో పదవీవిరమణ చేశాడు.1997-2003 వరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా వ్యవహరించాడు. భార్య శ్యామలదేవి 1998లో కాలం చేసింది. కుమారుడు శ్రీనివాస్ దిల్లీలో ఐ.ఏ.ఎస్. అధికారి.పెద్దకుమార్తె జ్యోతి, అల్లుడు శ్రీనివాసన్ న్యూయార్క్‌లో, చిన్నకుమార్తె డా.జయ, అల్లుడు శ్రీనివాస్‌రాజు కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉంటున్నారు. జ్యోత్స్న ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెద లాయర్లుకు స్కాలర్‌షిప్‌లు అందించబడ్డాయి.స్వగ్రామంలో ఆధునిక పాఠశాల,గుడి,కమ్యూనిటి లైబ్రరీ,ఆస్పత్రి అతని ద్వారా నిర్మిచబడ్డాయి.2019 మార్చి 6న రామస్వామి కన్నుమూశారు.[1]
మూలాలుసవరించు
- http://www.newstime.in/2019/03/07/former-judge-supreme-court-justice-ramaswamy-passed-away/[permanent dead link]
- ↑ ఆంధ్రజ్వోతి దినపత్రిక మైన్ ఎడిషన్, తేది.2019 మార్చి 7, పేజీ నెం.3