మార్టేరు

ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా గ్రామం

మార్టేరు, పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన పెనుమంట్ర నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పాలకొల్లు నుండి 11 కి. మీ. దూరంలోనూ ఉంది. ఈ గ్రామం పాలకొల్లు నుండి పెరవలి మీదుగా నిడదవోలు పోయే ప్రధాన రహదారిపై గల పెద్ద గ్రామం, చుట్టుపక్కల గ్రామాలకు ప్రయాణ సాధనాలకు పెద్ద కూడలి. మారుతీపురం అనే నామం నుండి మారుటేరు, మార్టేరుగా రూపాంతరం చెందింది. ఈ గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో బాస్కెట్ బాల్ క్రీడకు, ఆటో పరిశ్రమకు ప్రసిద్ధిచెందింది. మార్టేరునుండి బయటకు వెళ్ళే మూడు మార్గాలలో మూడు పెట్రోలు పంప్ స్టేషన్లు ఉన్నాయి.

మార్టేరు
శ్రీ వెంకటేశ్వరస్వామివారి దేవస్థానం, మార్టేరు
శ్రీ వెంకటేశ్వరస్వామివారి దేవస్థానం, మార్టేరు
పటం
మార్టేరు is located in ఆంధ్రప్రదేశ్
మార్టేరు
మార్టేరు
అక్షాంశ రేఖాంశాలు: 16°37′34.284″N 81°44′24.504″E / 16.62619000°N 81.74014000°E / 16.62619000; 81.74014000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపశ్చిమ గోదావరి
మండలంపెనుమంట్ర
విస్తీర్ణం2.96 కి.మీ2 (1.14 చ. మై)
జనాభా
 (2011)[1]
7,527
 • జనసాంద్రత2,500/కి.మీ2 (6,600/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,710
 • స్త్రీలు3,817
 • లింగ నిష్పత్తి1,029
 • నివాసాలు2,080
ప్రాంతపు కోడ్+91 ( 08819 Edit this on Wikidata )
పిన్‌కోడ్534122
2011 జనగణన కోడ్588649
మార్టేరు నుండి నర్సాపురం రహదారి

దేవాలయాలు

మార్చు
 
ప్రధాన కూడలిలో అయ్యప్ప దేవాలయం
 • శ్రీ వెంకటేశ్వరస్వామివారి దేవస్థానం: దీనిని దక్షిణ తిరుమల, ఆంబోతు తిరుమల అంటారు. విశాలమైన ప్రాంగణం, పెళ్ళిళ్ళకోసం రెండు అంతస్తులలో పైన ఒకటి, క్రింద ఒకటి రెండు విశాలమైన కల్యాణ మండపాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం శ్రీ రామ నవమి తరువాత వచ్చే మత త్రయ (వైష్ణవ) ఏకాదశి రోజున వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణంతోడను, ఇక్కడకూడా వైఖానస ఆగమన పధ్దతిన అభిషేకం, అంకురార్పణ, ద్వజారోహణం, పెళ్ళికుమారుని చేయుట, కల్యాణం, చక్రస్నానె, గర్బాధానె అనే వరుసలో ఐదు రోజుల పాటు యజ్ఞ హోమాలతో సంపూర్ణ కళ్యాణమహోత్సవాలు జరుపుతారు. ఈ క్షేత్రంలో శ్రీనివాసుని కళ్యాణం జరిపించు దంపతులు అలోకిక మైన ఆధ్యాత్మికానుభూతిని పోందుతారు. కళ్యాణంరోజు ఉదయం ఆంబోతును ఉరేగించి అతి వైభవంగా ఉత్సవంలు నిర్వహిస్తారు. మూడు రోజులు ఇక్కడ జరిగే తీర్ధం లేదా తిరునాళ్ళు చూసేందుకు, దాదాపు నాలుగు గంటలపాటు కాల్చబడు చిత్రవిత్రమైన బాణాసంచా ప్రదర్శన కొరకు వేలాదిగా జనం తరలివస్తారు.
 • శ్రీ వరాహస్వామివారి దేవస్థానం : ఇది ఊరిలో గల పురాతన దేవస్థానం. వెంకటేశ్వరస్వామివారి దేవాలయం ప్రక్కనే దాదాపు అంతే విస్తీర్ణం కలిగిన దేవాలయం. ఇందులో కూడా ఒక కల్యాణ మండపం ఉంది. ఈ దేవాలయంలోని ప్రతి గోడపై రంగులతో చిత్రించిన వెంకటేశ్వర కల్యాణ ఘట్టాలు సుందరంగా ఉంటాయి.
 • శ్రీ సోమేశ్వరస్వామివారి దేవస్థానం : మార్టేరుకు చివరలో నెగ్గిపూడికి దగ్గరలో గల పురాతన శివాలయం.
 • శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయం : మార్టేరు ప్రధాన కూడలిలో వంతెన ప్రక్కగా ఉంది. ఈ దేవాలయమునకు 2006 జనవరి లో ప్రతిష్ఠా మహోత్సవ జరిగింది.
 • శ్రీ మావుళ్ళమ్మ దేవాలయం : ఇది మార్టేరు, అత్తిలి మార్గంలో వెలగలేరుకు సమీపాన ఉంది. ఇటువైపుగా పోయే ప్రతివారూ తప్పక ఆగి దర్శించుకొనే ఆలయం. వాహనదారులు మొదటి ట్రిప్పు ఇక్కడ పూజతో ప్రారంబిస్తే లాభిస్తుందని నమ్ముతారు. ఈ దేవాలయ సమీపానే సంతోషిమాత ఆలయం, గ్రామదేవత పోలేరమ్మ దేవాలయాలు ఉన్నాయి.

వినోద సాదనాలు

మార్చు

మార్టేరులో మహదేవ్, జయా, ఎస్.ఆర్.ఎ. అను మూడు సినిమా టాకీసులు ఉన్నాయి. వీటిలో ఎస్, ఆర్, ఎ అను దియేటరు జిల్లాలో గల బాగాపురాతనమైన సినిమా దియేటర్లలో ఒకటి. దాదాపు ఆ ప్రాంతములలో పాలకొల్లుతో సహా ఎక్కడా దియేటర్ లేని రోజులలో కట్టబడినదని అంటారు. ప్రస్తుతం నష్టాలవలన దీనిని మూసివేసారు, చరిత్రగా మిగిలినది.

పరిశ్రమలు

మార్చు

మార్టేరును పరిసర ప్రాంతములవారు ఆటోనగర్ అంటుంటారు. ఇక్కడ కోడేరు మార్గములో దాదాపు అరకిలోమీటరు పరిధి వరకూ కేవలం వాహన సామగ్రి అమ్మకపు దుకాణాలు, బాగు[రిపేర్]చేయు షెడ్డులతో నిండి ఉంటుంది. సమీప గ్రామ వాహనదారులకు మార్టేరే పెద్ద దిక్కు. ఈ గ్రామం నాలుగు రొద్ల కూదలి సముదాయము.

 
మారుటేరు పాఠశాల
 
మారుటేరు పాఠశాల

ఊరి ప్రముఖులు

మార్చు

ఊరిలో గల ప్రముఖులలో పేరెన్నిక గన్నవారు 1. ద్వారంపూడి బసివి రెడ్డి, ఇతను ఎఎల్ఎ గా చేసాడు. 2.కోనాల పేర్రెడ్డి. ఇతని స్వస్థలం మార్టేరు అయినా వ్యాపారాన్ని తూర్పు, పశ్చిమగోదావరి రెండు జిల్లాలలో విస్తరించి వేలమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. పేర్రెడ్డి ఇతని వ్యాపారాలలో ముఖ్యమైనవి చక్కెర పరిశ్రమ రైసు మిల్లులు. 3. ద్వారంపూడి నర్సిరెడ్డి (అబ్బులు), ఆటోనగర్ ప్రారంభకుడు.4. పడాల ప్రహ్లాదరెడ్డి, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత - ఆటలలో.

విశేషాలు

మార్చు

ఈ గ్రామంనుండి విదేశాలకు తరలి వెళ్ళిన వారు ఎక్కువ. గల్ప్ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కతార్, బెహరెయిన్, ఒమన్ లలో అధికంగా ఉన్నారు.ఒమన్ రాజధాని మస్కట్‌లో "ఒమన్ షాపుర్జీ కంపెనీ" అనే కంపెనీవారి కార్మికుల క్యాంపు "ఘాలా" ప్రదేశంలో ఉంది. అందులో ఒక చిన్న గుడి ఉంది. దీనిని అమ్మవారి గుడి అంటారు. వినాయకుని విగ్రహం, అమ్మవారి పటం ఉన్నాయి. ఈ అమ్మవారి పటాన్ని చిత్రించిన వ్యక్తి "ముసలయ్య". పటంలో "కె. ముసలయ్య, ఆర్టిస్ట్. మార్టేరు, తణుకు తాలూకా, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశే, భారతదేశం" అని ఆంగ్లలో వ్రాసి ఉంటుంది. చాలామంది ఇక్కడ భక్తి, శ్రద్ధలతో పూజలు చేస్తారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రత్యేకంగా భజనలు చేసి, నైవేద్యం పెట్టి, తరువాత ప్రసాదం (భోజనం) పంచుతారు. ముసలయ్య ఇక్కడ పనిచేస్తున్నపుడు ఈ పటాన్ని చిత్రించాడు.మార్టేరు ప్రధాన మండలం కాక పోయిననూ మండల కేంద్రమైన పెనుమంట్ర కంటే అభివృద్ధిలో చాలా ముందంజ వేస్తోంది.

 
మస్కట్‌లో ముసలయ్య చిత్రించిన అమ్మవారి పటం

గణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2080 ఇళ్లతో, 7527 జనాభాతో 296 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3710, ఆడవారి సంఖ్య 3817. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1226 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 20. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588649.[2]

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల 2 ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు, ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. సమీప ఇంజనీరింగ్ కళాశాల పాలకొల్లు లో ఉంది. మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు తణుకు లోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం పెనుమంట్ర లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల, , ఏలూరు లోనూ ఉన్నాయి.

విద్యాసౌకర్యాలు

ఆంగ్ల అక్షరం 'యు' ఆకారంలో మధ్య శ్రీ సరస్వతీమాత విగ్రహం తలిగి ఉండి, జస్టిస్ రామస్వామి లాంటి ప్రముఖులు, క్రీడాకారులు, విద్యావేత్తలనెందరినో అందించిన ఉత్తమ పాఠశాల. 1950 లో స్థాపించిన ఈపాఠశాల ఆవరణలో జిల్లాలోనే ఉత్తమమైన బాస్కెట్ బాల్ కోర్టులు ఉన్నాయి. ఒలింపిక్సులో పాల్గొన్న సత్తిగీత కూడా ఈ పాఠశాల విద్యార్థినే.ఇవి కాక మరొక మూడు సెకండరీ {బోర్డు} పాఠశాలలు ఉన్నాయి.

పూర్ణోదయ జూనియర్ కళాశాల శ్రీ వేణుగోపాల ఉన్నత పాఠశాల

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

మార్టేరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

ఐదు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉంది. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

మార్టేరులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

మార్టేరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 72 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 224 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 224 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

మార్టేరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 224 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

మార్టేరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

వరి

మూలాలు

మార్చు
 1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
 2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
"https://te.wikipedia.org/w/index.php?title=మార్టేరు&oldid=4261273" నుండి వెలికితీశారు