జస్వంత్‌సిన్హ్ సుమన్‌భాయ్ భాభోర్
జస్వంత్‌సిన్హ్ సుమన్‌భాయ్ భాభోర్ (జననం 22 ఆగస్టు 1966) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన దాహొద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]
జస్వంత్‌సిన్హ్ సుమన్‌భాయ్ భాభోర్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 16 మే 2014 | |||
ముందు | ప్రభా కిషోర్ తవియాడ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | దాహొద్ | ||
కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 12 జూలై 2016 – 24 మే 2019 | |||
తరువాత | రేణుకా సింగ్ | ||
రాష్ట్ర మంత్రి
| |||
పదవీ కాలం 2005 – 2014 | |||
నియోజకవర్గం | రంధిక్‌పూర్ | ||
రాష్ట్ర మంత్రి
| |||
పదవీ కాలం 1999 – 2002 | |||
నియోజకవర్గం | రంధిక్‌పూర్ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1995 – 2014 | |||
నియోజకవర్గం | రంధిక్‌పూర్ | ||
గుజరాత్ స్టేట్ ట్రైబల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్
| |||
పదవీ కాలం 1998 – 1999 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | దాసా, దాహోద్ , గుజరాత్ | 1966 ఆగస్టు 22||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | కంచన్ భాభోర్ | ||
సంతానం | 4 | ||
నివాసం | Dasa, Dahod, Gujarat | ||
పూర్వ విద్యార్థి | బర్కతుల్లా విశ్వవిద్యాలయం (1991),[1]సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయం (1985) [1] | ||
మూలం | [1] |
ఆయన 2007 నుండి 2010 వరకు సబర్‌కాంత, డాంగ్ జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రిగా 2010 నుండి 2014 పార్లమెంటు ఎన్నికలలో నర్మదా జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
మార్చుజస్వంత్సిన్హ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 1995లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలలో తొమ్మిదవ గుజరాత్ శాసనసభకు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 1998 నుండి 1999 వరకు గుజరాత్ స్టేట్ ట్రైబల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన ఆ తరువాత 1998లో రెండోసారి పదవ గుజరాత్ శాసనసభకు ఎన్నికై 1999 నుండి 2001 వరకు ఆహార & పౌర సరఫరాల శాఖకు ఉప మంత్రిగా 2001 నుండి 2002 వరకు ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.
జస్వంత్‌సిన్హ్ 2002లో మూడోసారి పదకొండవ గుజరాత్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై 1 ఆగస్టు 2005 నుండి 24 డిసెంబర్ 2007 వరకు అటవీ & పర్యావరణ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు. ఆయన 2007లో పన్నెండవ గుజరాత్ శాసనసభకు నాలుగవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2007 నుండి 2010 వరకు గిరిజన అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, కార్మిక & ఉపాధి శాఖ మంత్రిగా, 2010 నుండి 2014 వరకు గిరిజన అభివృద్ధి, పంచాయతీ & గ్రామీణ గృహాల శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.
జస్వంత్‌సిన్హ్ 2007 నుండి 2010 వరకు సబర్‌కాంత, డాంగ్ జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రిగా 2010 నుండి 2014 వరకు నర్మదా జిల్లాకు ఇన్‌చార్జ్ మంత్రిగా పని చేశాడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దాహొద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి డా. ప్రభాబెన్ కిషోర్‌సిన్హ్ తవియాద్ పై 2,30,354 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 12 జూలై 2016 నుండి 24 మే 2019 వరకు నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.
జస్వంత్‌సిన్హ్ 2019లో దాహొద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బాబూభాయ్ ఖిమాభాయ్ కటారాపై 1,27,596 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి,[4] 2024లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ప్రభా కిషోర్ తవియాడ్ పై 3,33,677 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Jasvantsinh Sumanbhai Bhabhor (Bharatiya Janata Party (BJP) profile". Retrieved 17 April 2024.
- ↑ TimelineDaily (5 June 2024). "Gujarat: Jasvantsinh Bhabhor, BJP Candidate From Dahod Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 19 July 2024. Retrieved 19 July 2024.
- ↑ "Cabinet reshuffle: How PM Modi's govt has expanded since 2014". 2 September 2017. Archived from the original on 8 July 2021. Retrieved 19 July 2024.
- ↑ News18 (23 May 2019). "Dahod Election Results 2019 Live Updates (Dohad): Jashvantsinh Sumanbhai Bhabhor of BJP Wins" (in ఇంగ్లీష్). Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Dahod". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.