జాకిర్ హుసేన్ గ్రంధాలయం
డాక్టర్ జాకీర్ హుసేన్ గ్రంథాలయం జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో ఉన్న గ్రంథాలయం. ఇందులో దాదాపు 400,000 గ్రంథాలు, రెఫరెన్సులు ఉన్నాయి.
తరహా | University library |
---|---|
ప్రదేశము | జామియా మిలియా ఇస్లామియా |
గ్రంధ సంగ్రహం / సేకరణ | |
గ్రంధాల సంఖ్య | 400,000 |
నేపధ్యము
మార్చుభారతదేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో ఒకటి 'ద జమియా మిలియా ఇస్లామీయ' ఈ సంస్థ 1920లో అలి గడ్‌లో స్థాపించబడింది. 1925లో ఢిల్లికి మార్చబడింది. 1988లో పార్లమెంట్ ఆక్ట్ ద్వారా కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థాయి నివ్వడం జరిగింది. ప్రస్తుతం జామియా కేంద్ర గ్రంథాల యాన్నే డాక్టర్ జాకిర్ హుస్సెన్ గ్రంథాల యగా 1972లో పేరుమార్చడం జరిగింది. ఈ పేరు మార్పుకు చారిత్రక నేపథ్యం కూడా ఉంది. (1926-48 సమయంలో) పూర్వ ఉపకులపతి గాను, భారతదేశానికి పూర్వ అధ్యక్షుడు గాను (1967 - 69) ఉన్న డాక్టర్ హుస్సెన్ జ్ఞాపకార్థం ఈ గ్రంథాలయా నికి 'జాకిర్ హుస్సెన్ గ్రంథాల యం'గా నామకరణం చేయటం జరిగింది. ఈగ్రంథాలయాన్ని భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన గ్రంథాలయాల్లో ఒక గొప్ప గ్రంథాలయంగా డాక్టర్ రవీంధ్రనాథ్ ఠాగూర్ పేర్కొన్నారు.
విశేశాలు
మార్చు- ఈ గ్రంథాలయంలో అరుదైన రాత ప్రతులు 2000 వరకు ఉన్నాయి. అరబిక్‌లో 457, పర్షియన్‌లో 1107 ఉర్దూలో 397, పషట్‌లో 3, హిందీలో 13 ఉన్నాయి. ఈ రాత ప్రతులు రకరకాల ఆకారాలతో ఉన్నాయి. ఈ రాతప్రతుల్లోని ముఖ్యమైన విషయాలు - ఖురాన్, ఖురాన్ పై వ్యాఖ్యానం, సూఫిజమ్ తర్కశాస్త్రం, మనో విజ్ఞాన శాస్త్రం, గణితం, జ్యోతిష్యం, సంగీతం, చరిత్ర, రసాయన శాస్త్రం, యునానీ వైద్యం, పర్షియన్ భాష, సాహిత్యం, మత-కుల పరమైన విషయాలు మొదలగునవి ఎన్నో ఉన్నాయి.
- ఈ రాతప్రతులతో పాటు అరుదైన 1000 పుస్తకాలను కూడా ముఖ్యంగా చారిత్రక నేపథ్యంతో కూడిన పుస్తకాలను, నాలుగు లక్షల ప్రచురిత పుస్తకాలను, 476 వివిధ విషయాలతో కూడిన పత్రికలను, 250 మైక్రోఫిల్ములను మొదలగువాటిని డాక్టర్ జాకిర్ హుసేన్, డాక్టర్ ఎమ్.ఏ.అన్సారి, మౌలాన మహమ్మద్ ఆరి, ముఫ్తి అనవర్ - ఉల్ -హక్, గులామ్ రబ్బాని తబిన్ మొదలగువారు విరాళంగా ఇవ్వడం జరిగింది.
- వీటితోపాటు ఉర్దూ, ఇంగ్లీషు వార్తా పత్రికలు కూడా ఉన్నాయి. 100సంవత్సరాలపై నుండి చారిత్రక విశేషాలను ఈ పత్రికల్లో ప్రకటించటం కనబడుతుంది. చరిత్రపై పరిశోధన చేసే పరిశోధకులకు ఈ గ్రంథాలయంలో లభించే మెటీరియల్‌కూ విలువ కట్టలేము. హమ్‌దర్ద్, హమ్‌దమ్, కామ్రెడ్, అల్ హిలాల్, పైసా అక్ బిర్, మదీనా, నేషనల్ హెరాల్డ్, కోహినూర్, దావత్, 20 క్విరాల్, సియాసత్ ప్రతాప్, న్యూఏజ్, న్యూవిరా, మిలాప్, మొదలగు పత్రికలు ఉన్నాయి.
- వార్తా పత్రికలన్నింటిలో రాతప్రత విభాగాలలో దుమ్ము దూళి నుండి రక్షింపబడుటకు పెట్టడం జరిగింది. వార్తాపత్రికల్లో రాజకీయ, సాంఘిక, ఆర్థిక పరమైన విషయాలు, సాంస్కృతిక పరమైన విషయాలు ఎన్నో వార్తాపత్రకల్లో ఉంటాయి. వాటిని భావితరాలకు అందచేయాలన్న సంకల్పంతో వార్తాపత్రికలను కూడా రాత ప్రతులమాదిరిగా సంరక్షించడం జరిగింది.
- ఈ గ్రంథాలయంలో రాతప్రతులు ఎంతో అరుదైనవి, రకరకాల రంగులతో, రాతప్రతులతో, బొమ్మలతో ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ దొరకని రాతప్రతులు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. ఎన్నో లిపుల్లో, ఎన్నో మతాలకు సంబంధించిన రాతప్రతులు కూడా ఇక్కడ ఉన్నాయి.
- ఈ గ్రంథాలయంలో అతి పెద్ద ఆకారంతోఉన్నటువంటి హోలీఖురాన్ (వస్త్రాలపైన రాయబడినది) 53.5ృ34 సెం.మీ ఉంది. ఉర్దూ, పర్షియన్ భాషల్లో అనువదింపబడినంది. ఈ ఖురాన్‌లో మొత్తం 1151 పుటలు ఉన్నాయి. ప్రతి పుటకు తొమ్మిది పంక్తులు ఉన్నాయి. ఈ *గ్రంథాలయంలో వైద్యంలో గొప్ప పరిశోధన చేసిన అరుదైన రాతపతి ఉంది. 10వ శతాబ్దంలోనే గొప్పమనోవైజ్ఞానిక వేత్తగా భావింప బడే ఆశిష-ఆ-ఐషశn-శిn-ఆశీషశెెఠ, శిnశ-పశ (ఆు-|పపశ రాసిన ఆఠీశప -ఆ-ఆdశుాశష ఎంతో గొప్ప అరుదైన రాతప్రతి.
- ఈ గ్రంథాలయంలో పర్షియన్ పరిశోధనాకేంద్రంచే 1999 న్యూఢిల్లిd ప్రచురింపబడిన పర్షియన్ రాతప్రతుల వివరణాత్మక సూచికలు ఉన్నాయి. అరబిక్, ఉర్దూ రాతప్రతుల పట్టికలను కూడా చేతితో రాబడినవి పరిశోధకులకు ఉపయోగపడును.
- రాతప్రతుల సంరక్షణ-పరిరక్షణకు సంబంధించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేన్సర్ రేషన్ లాబరెటరీ ఉంది. రాతప్రతులు, పత్రికలు, ప్రచురిత అరుదైన పుస్తకాలు మొదలగు వాటిని అత్యంత శ్రద్ధతో సంరక్షించడం జరుగుతున్నవి.