జాక్ కౌవీ

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

జాన్ కౌవీ (1912, మార్చి 30 - 1994, జూన్ 3) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 1937 నుండి 1949 వరకు తొమ్మిది టెస్టుల్లో ఆడాడు.[1]

జాక్ కౌవీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జాన్ కౌవీ
పుట్టిన తేదీ(1912-03-30)1912 మార్చి 30
ఆక్లాండ్, న్యూజీలాండ్
మరణించిన తేదీ1994 జూన్ 3(1994-06-03) (వయసు 82)
లోయర్ హట్, వెల్లింగ్టన్, న్యూజీలాండ్
మారుపేరుBull
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 27)1937 జూన్ 26 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1949 ఆగస్టు 16 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1932/33–1949/50Auckland
అంపైరుగా
అంపైరింగు చేసిన టెస్టులు3 (1956–1959)
అంపైరింగు చేసిన ఫ.క్లా18 (1955–1961)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 9 86
చేసిన పరుగులు 90 762
బ్యాటింగు సగటు 10.00 10.16
100లు/50లు 0/0 0/1
అత్యధిక స్కోరు 45 54
వేసిన బంతులు 2,028 20,407
వికెట్లు 45 359
బౌలింగు సగటు 21.53 22.28
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 4 20
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 1
అత్యుత్తమ బౌలింగు 6/40 6/3
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 35/–
మూలం: CricketArchive, 2009 జూన్ 19

తొలి క్రికెట్ కెరీర్

మార్చు

లోయర్-ఆర్డర్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, ఫాస్ట్-మీడియం కుడిచేతి బౌలర్ గా రాణించాడు. 1932-33 సీజన్ నుండి ఆక్లాండ్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. 1934-1935 వరకు ప్లంకెట్ షీల్డ్ మ్యాచ్‌లలో క్రమం తప్పకుండా ఆడాడు.[2] 'అతను బ్యాట్స్‌మన్‌గా తన జీవితాన్ని ప్రారంభించాడు, అయితే ఆక్లాండ్ జట్టులో అతనికి చోటు కల్పించడానికి చాలామంది బ్యాట్స్‌మెన్ ఉన్నందున తనను తాను బౌలర్‌గా మార్చుకున్నాడని' 1995లో విజ్డెన్‌లో అతని సంస్మరణలో ప్రచురించబడింది.[3] దేశీయ క్రికెట్‌లో 1936-37 సీజన్ వరకు నాలుగు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 21 వికెట్లు తీసుకున్నాడు. ఆక్లాండ్‌లో వెల్లింగ్‌టన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటిసారి ఒక ఇన్నింగ్స్‌లో 81 పరుగులుకు ఐదు వికెట్లు తీశాడు.[4]

కర్లీ పేజ్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్‌లో పర్యటించడానికి 1937 న్యూజీలాండ్ జట్టులో చోటు సంపాదించాడు.

పదవీ విరమణ తర్వాత

మార్చు

కౌవీ 1955-56 నుండి 1960-61 వరకు ఫస్ట్-క్లాస్ అంపైర్ గా ఉన్నాడు. 1955-56 సీజన్‌లో ఒక టెస్ట్ మ్యాచ్‌లో, 1958-59లో రెండు టెస్ట్ మ్యాచ్‌లకు అధికారిగా పనిచేశాడు.[5]

1930ల నుండి శీతాకాలంలో సాకర్ ఆడాడు. 14 సీజన్లలో ఆక్లాండ్‌కు గోల్‌కీపర్‌గా వ్యవహరించాడు. న్యూజీలాండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్‌లో కోశాధికారిగా, ఛైర్మన్‌గా, ఫిఫాకి ప్రతినిధిగా పనిచేశాడు.[6] 1972 నుండి 1978 వరకు ఓషియానియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు.[7] 1972 క్వీన్స్ బర్త్‌డే ఆనర్స్‌లో, క్రికెట్‌కు విలువైన సేవల కోసం ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అధికారిగా నియమించబడ్డాడు.[3]

మూలాలు

మార్చు
  1. "New Zealanders in England in 1937". Wisden Cricketers' Almanack (1938 ed.). Wisden. pp. 192–196.
  2. "First-class Bowling in each Season by Jack Cowie". cricketarchive.com. Retrieved 2009-05-22.
  3. 3.0 3.1 "Obituary". Wisden Cricketers' Almanack (1995 ed.). Wisden. p. 1382.
  4. "Auckland v Wellington". cricketarchive.com. 5 February 1937. Retrieved 2009-05-22.
  5. "Jack Cowie as umpire in first-class matches". CricketArchive. Retrieved 5 March 2018.
  6. Nigel Smith, Kiwis Declare, p. 185.
  7. "The page cannot be found". www.oceaniafootball.com. Archived from the original on 6 October 2009. Retrieved 12 January 2022.

బాహ్య లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జాక్_కౌవీ&oldid=4081132" నుండి వెలికితీశారు