జాక్ డన్నింగ్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

జాన్ అంగస్ డన్నింగ్ (1903, ఫిబ్రవరి 6 - 1971, జూన్ 24) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 1933 - 1937 మధ్యకాలంలో నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు, 1923 నుండి 1938 వరకు 60 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశాడు.[1]

జాక్ డన్నింగ్
దస్త్రం:Jack Dunning.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జాన్ అంగస్ డన్నింగ్
పుట్టిన తేదీ(1903-02-06)1903 ఫిబ్రవరి 6
ఒమాహా, న్యూజీలాండ్
మరణించిన తేదీ1971 జూన్ 24(1971-06-24) (వయసు 68)
అడిలైడ్, దక్షిణ ఆస్ట్రేలియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగు
  • Right-arm ఆఫ్ బ్రేక్
  • Right-arm మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 26)1933 మార్చి 31 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1937 ఆగస్టు 14 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 4 60
చేసిన పరుగులు 38 1,057
బ్యాటింగు సగటు 7.59 13.04
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 19 45
వేసిన బంతులు 830 15,379
వికెట్లు 5 228
బౌలింగు సగటు 98.59 27.58
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 15
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 2
అత్యుత్తమ బౌలింగు 2/35 6/42
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 34/–
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 1

అకడమిక్, టీచింగ్ కెరీర్ మార్చు

జాక్ డన్నింగ్ 1903, ఫిబ్రవరి 6న ఒమాహాలో జన్మించాడు. ఆక్లాండ్ గ్రామర్ స్కూల్, ఆక్లాండ్ యూనివర్సిటీ కాలేజీలో చదువుకున్నాడు. తరువాత ఒటాగో విశ్వవిద్యాలయంలో గణితశాస్త్రంలో ఎంఎస్సీ ( ఆనర్స్ ) పట్టభద్రుడయ్యాడు. 1925లో న్యూజీలాండ్ రోడ్స్ స్కాలర్, ఆక్స్‌ఫర్డ్‌లోని న్యూ కళాశాలలో చదువుతూ, గణితశాస్త్రంలో ఎంఏ పట్టా పొందాడు.[2][3]

1923 నుండి 1925 వరకు, 1927 నుండి 1939 వరకు డునెడిన్‌లోని జాన్ మెక్‌గ్లాషన్ కళాశాలలో బోధించాడు. స్పోర్ట్స్ మాస్టర్ గా కూడా ఉన్నాడు. 1939 నుండి 1949 వరకు క్వీన్స్‌ల్యాండ్‌లోని స్కాట్స్ కాలేజ్, వార్విక్, ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ కాలేజ్, అడిలైడ్, 1949 నుండి 1969 వరకు ప్రధానోపాధ్యాయుడిగా నియమితుడయ్యాడు.[2] 1965 న్యూ ఇయర్ ఆనర్స్‌లో ఓబిఈ లభించింది.

మరణం మార్చు

డన్నింగ్ 1971, జూన్ 24న దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో మరణించాడు. సంస్మరణలు 1971లో న్యూజీలాండ్ క్రికెట్ అల్మానాక్‌లో, మరుసటి సంవత్సరం విస్డెన్‌లో ప్రచురించబడ్డాయి.

మూలాలు మార్చు

  1. Jack Dunning, CricketArchive. Retrieved 18 August 2022. (subscription required)
  2. 2.0 2.1 Prentis, Malcolm (2008). "Minister and Dominie: Creating an Australasian Scottish World?". International Review of Scottish Studies. Vol. 33. p. 26.
  3. "Rhodes Scholar: Mr. J. A. Dunning's Career". Star. Vol. LV, no. 266. 8 November 1924. p. 12.

బాహ్య లింకులు మార్చు