జాక్ న్యూమాన్
సర్ జాక్ న్యూమాన్ (1902, జూలై 3 - 1996, సెప్టెంబరు 23) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్.
దస్త్రం:Jack Newman of New Zealand in 1933.png | ||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | బ్రైట్ వాటర్, న్యూజీలాండ్ | 1902 జూలై 3|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1996 సెప్టెంబరు 23 నెల్సన్, న్యూజీలాండ్ | (వయసు 94)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి మాధ్యమం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 22) | 1932 మార్చి 1 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1933 మార్చి 31 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 1 |
జీవిత విశేషాలు
మార్చున్యూమాన్ 1902, జూలై 3న నెల్సన్ సమీపంలోని బ్రైట్‌వాటర్‌లో జన్మించాడు. 1917 నుండి 1920 వరకు నెల్సన్ కాలేజీలో చదివాడు.[1]
క్రికెట్ కెరీర్
మార్చుఒక క్రికెటర్‌గా 1932, 1933లో ఎడమచేతి మీడియం-పేస్ బౌలర్‌గా మూడు టెస్ట్ క్యాప్‌లను సంపాదించాడు. 1923లో కాంటర్‌బరీ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఒక మ్యాచ్‌ను, 1930 - 1935 మధ్యకాలంలో వెల్లింగ్టన్ తరపున 13 మ్యాచ్‌లు ఆడాడు. మొదటి టెస్ట్ మ్యాచ్‌కు ఎంపికైన వెంటనే 1931-32లో ఒటాగోపై వెల్లింగ్టన్ తరఫున 51 పరుగులకు 5 వికెట్లు, 45 పరుగులకు 5 వికెట్లు తీయడం అత్యుత్తమ ఫస్ట్-క్లాస్ బౌలింగ్ గణాంకాలుగా నమోదయ్యాయి. [2]
1922 నుండి 1948 వరకు నెల్సన్ కొరకు హాక్ కప్ క్రికెట్ ఆడాడు.[3] 53 సంవత్సరాల వయస్సులో నెల్సన్ కోసం తన చివరి ఆట ఆడాడు. 1958 నుండి 1963 వరకు టెస్ట్ సెలెక్టర్‌గా, 1964 నుండి 1967 వరకు న్యూజీలాండ్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పనిచేశాడు..[4]
ఇతర క్రీడలు
మార్చున్యూమాన్ రగ్బీ ఆటగాడిగా కూడా రాణించాడు.
ఇతర వివరాలు
మార్చుక్రీడలకు దూరంగా, న్యూమాన్ తన కుటుంబానికి చెందిన రవాణా వ్యాపారంలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి, 1980లో చైర్మన్‌గా పదవీ విరమణ చేశాడు. పదవీ విరమణ సమయంలో అతను న్యూమాన్స్ ఎయిర్ అనే ఎయిర్ చార్టర్ కంపెనీని స్థాపించాడు, అది 1986లో ఎంసెట్ న్యూజీలాండ్‌తో విలీనమైంది.
1963 క్వీన్స్ బర్త్‌డే ఆనర్స్‌లో, న్యూమాన్ న్యూజీలాండ్‌లో పర్యాటకానికి సేవలందించినందుకు ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ కమాండర్‌గా నియమించబడ్డాడు. 1977 క్వీన్స్ సిల్వర్ జూబ్లీ, బర్త్‌డే ఆనర్స్‌లో ట్రావెల్ ఇండస్ట్రీ, కామర్స్, కమ్యూనిటీకి సేవల కోసం నైట్ బ్యాచిలర్‌గా నియమించబడ్డాడు. 1994లో, న్యూమాన్ న్యూజీలాండ్ బిజినెస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించాడు.[5]
మరణం
మార్చున్యూమాన్ 1996, సెప్టెంబరు 23న నెల్సన్‌లో మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ Nelson College Old Boys' Register, 1856–2006, 6th edition
- ↑ "Otago v Wellington 1931-32". Cricinfo. Retrieved 19 October 2021.
- ↑ "Hawke Cup Matches played by Jack Newman". CricketArchive. Retrieved 19 October 2021.
- ↑ జాక్ న్యూమాన్ at ESPNcricinfo
- ↑ "Past laureates". Business Hall of Fame. Retrieved 16 February 2023.