జాక్ పాట్
జాక్ పాట్ 2019లో విడుదలైన తెలుగు సినిమా. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య నిర్మించిన ఈ సినిమాకు కళ్యాణ్ దర్శకత్వం వహించాడు. జ్యోతిక, రేవతి, రాజేంద్రన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 27న విడుదల చేసి సినిమాను నవంబర్ 21న విడుదల చేశారు.[1]
జాక్ పాట్ | |
---|---|
దర్శకత్వం | కళ్యాణ్ |
రచన | యశ్వంత్ మహిల్వార్ |
నిర్మాత | సూర్య |
తారాగణం | జ్యోతిక రేవతి యోగిబాబు ఆనందరాజ్ |
ఛాయాగ్రహణం | ఆర్ఎస్ ఆనంద కుమార్ |
సంగీతం | విశాల్ చంద్రశేఖర్ |
నిర్మాణ సంస్థ | 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ |
పంపిణీదార్లు | గీతా ఫిలిం డిష్టిబ్యూషన్స్ |
విడుదల తేదీ | 21 నవంబరు 2019 |
సినిమా నిడివి | 128 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఅక్షయ (జ్యోతిక)కు ఎవరూ లేకపోవడంతో మాషా (రేవతి) అక్షయను చేరదీసి పెంచుతుంది. అక్షయ, మాషా ఇద్దరు ప్రజలను మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటారు. ఈ క్రమంలో అక్షయ పాత్ర గురించి తెలుసుకుంటారు. ఆ అక్షయ పాత్ర ఆనంద్ రాజ్ ఇంట్లో ఉన్న సంగతి తెలుసుకొని దాన్ని సంపాదించటానికి వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ? చివరికి అక్షయపాత్రను దక్కించుకున్నారా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
మార్చు- జ్యోతిక
- రేవతి
- రాజేంద్రన్
- యోగిబాబు
- ఆనంద్ రాజ్
- మన్సూర్ అలీ ఖాన్
- జగన్
- రెడిన్ కింగ్స్లీ
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: సూర్య
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కళ్యాణ్
- సంగీతం: విశాల్ చంద్రశేఖర్
- సినిమాటోగ్రఫీ: ఆర్ఎస్ ఆనంద కుమార్
- ఎడిటర్: విజయ్ వేలుకుట్టి
మూలాలు
మార్చు- ↑ Zee Cinemalu (11 November 2019). ""జాక్ పాట్" కొట్టడానికి జ్యోతిక రెడీ" (in ఇంగ్లీష్). Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
- ↑ The Times of India (2019). "Jackpot Movie Review {3/5}: The film manages to entertain". Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.