రేవతి తెలుగు సినిమా నటీమణి. ఆశా (సినిమాలో పేరు రేవతి అని పిలుస్తారు), ఒక భారతీయ చలనచిత్ర నటి, చలనచిత్ర దర్శకురాలు. మలయాళ సినిమా, తమిళ సినిమాల్లో ఎక్కువగా ఆమె నటనలో పేరు ప్రసిద్ధి చెందినది.[5] మూడు వేర్వేరు విభాగాలలో నేషనల్ ఫిల్మ్ అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ (సౌత్) వాటితో ఆమె అనేక ప్రసంశలు గెలుచుకుంది.[6] రేవతి శిక్షణ పొందిన భరతనాట్యం నర్తకురాలు, ఏడు సంవత్సరాల వయస్సు నుండి నాట్యం నేర్చుకుని 1979 సం.లో చెన్నైలో ఆమె ఆరంగేట్రం నాట్యం ప్రదర్శన ఇచ్చింది.[7]

రేవతి
జననం
ఆశ

(1966-07-08) 1966 జూలై 8 (వయసు 57) [1]
కొచ్చి, కేరళ, భారతదేశం
వృత్తినటి,దర్శకురాలు, సామాజిక కార్యకర్త
క్రియాశీల సంవత్సరాలు1983 – ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
రావుగారిల్లు, అంకురం, గాయం
జీవిత భాగస్వామిసురేష్ చంద్ర మేనన్
(m.1986–2002)
(2013లో విడాకులు)[2][3]
బంధువులునిరంజనా అనూప్(మేనకోడలు)[4]
పురస్కారాలుభారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు , ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు(దక్షిణ)

సినిమాలకే కాకుండా, రేవతి అనేక రకాల సామాజిక సంస్థలలో పాల్గొంది. ఇందులో అత్యంత ముఖ్యమైనది బన్యన్, ఎబిలిటీ ఫౌండేషన్, ట్యాంకర్ ఫౌండేషన్, విద్యాసాగర్, చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, భారతదేశ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వంటి అనేక చిత్రోత్సవాలలో సభ్యురాలిగా కూడా పనిచేసింది.[8]

రేవతి కొచ్చిలో ఆశా కేలుని నాయర్ అనే పేరుతో కల్లిక్కాడ్, పాలక్కాడ్ ప్రాంతాలకు చెందిన, భారతీయ సైన్యంలో ఒక ప్రధాన వ్యక్తి అయిన కేలుని నాయర్, లలితే కేలున్ని దంపతులకు జనించింది. మలయాళ నటి గీతా విజయన్ ఈమె బంధువు.[9]

వ్యక్తిగత జీవితం

మార్చు

రేవతి 1986 సం.లో సినిమాటోగ్రాఫర్, దర్శకుడు సురేష్ చంద్ర మీనన్‌ను వివాహం చేసుకున్నది. ఈ జంటకు పిల్లలు లేరు. అయితే వీరి మధ్య వచ్చిన కుటుంబ మానసిక తేడాలు తరువాత, వీరు 2002 సం.నుండి విడిగా జీవిస్తూ,[10] 2013 ఏప్రిల్ 23 సం.న చెన్నై అదనపు కుటుంబ న్యాయస్థానం కోర్టు వీరికి విడాకులు మంజూరు చేశారు.[11]

నట జీవితం

మార్చు

ఆమె చాలా తక్కువ సంఖ్యలో వివిధ భాషా సినిమాలలో నటించింది.

డబ్బింగ్ కళాకారిణి

మార్చు
 • 1995-పాంపన్ (శరణ్య పొన్వన్నన్ కోసం) - తమిళ సినిమా
 • 1995 -అసాయి (సువాల్లక్ష్మి కోసం) - తమిళ సినిమా
 • 1996-దేవరాగం (శ్రీదేవి కోసం) - మలయాళం సినిమా
 • 1997 -మిన్సార కనవు (కజోల్ కోసం) - తమిళ సినిమా
 • 1999-మేఘం (పూజా బత్రా కోసం) - మలయాళం మూవీ
 • 2000 - కందుకొండైన్ కందుకొండైన్ (టబు కోసం) - తమిళ సినిమా

2001 -వేదం (దివ్య యునీ కోసం) - తమిళ సినిమా 2005 -చంద్రోల్సవం (కుష్బూ కోసం) - మలయాళం సినిమా 2018 పుణ్యకోటి (ఆవు కోసం) - సంస్కృతం సినిమా

దర్శకురాలు

మార్చు
 • 2002 మిట్ర్ మై ఫ్రెండ్ : ఆంగ్లంలో ఉత్తమ చలన చిత్రంగా ఆంగ్ల జాతీయ చలన చిత్ర పురస్కారం
 • 2004 ఫిర్ మిలేంగే : హిందీ
 • 2009 కేరళ కేఫ్ : మలయాళం - "మకల్" విభాగం
 • 2010 ముంబై కటింగ్ : హిందీ - "పార్శిల్" విభాగం
 • 2022 సలామ్ వెంకీ: హిందీ

వెబ్ సిరీస్

మార్చు

రేవతి నటించిన తెలుగు చిత్రాలు

మార్చు
సంవత్సరం చిత్రం పాత్ర వివరాలు
1984 మానసవీణ వీణ
1984 సీతమ్మ పెళ్ళి సీతమ్మ
1986 డాన్స్ మాస్టర్
1988 రావుగారిల్లు చంటి
1989 పగలే వెన్నెల
1989 ప్రేమ మాగీ
1989 లంకేశ్వరుడు స్వప్న
1990 అంజలి చిత్ర తెలుగు డబ్బింగ్ సినిమా.
1991 మృగతృష్ణ
1992 అంకురం సింధూర ఫిలింఫేర్ పురస్కారం
1992 క్షత్రియ పుత్రుడు జాతీయ చలనచిత్ర ఉత్తమ సహాయనటి పురస్కారం
1993 గాయం అనిత
1994 ఆడవాళ్ళకు మాత్రమే
1998 గణేష్ రంగమ్మ
2002 ఈశ్వర్ సుజాత
2003 జానకి వెడ్స్ శ్రీరామ్
2004 ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి
2010 గాయం-2 అనిత
2014 అనుక్షణం శైలజ
2015 లోఫర్ లక్ష్మీ నామినేటెడ్—ఫిలింఫేర్ పురస్కారం ఉత్తమ సహాయనటి పురస్కారం
2016 బ్రహ్మోత్సవం అజయ్ కు తల్లి
2017 యుద్ధం శరణం సీతాలక్ష్మీ
2021 ఇట్లు అమ్మ

కన్నడం

మార్చు

కన్నడంలో ఈ క్రింద సూచించిన రెండు చిత్రాలలో నటించింది. సంవత్సరం : చిత్రం : పాత్ర : వివరాలు

 • 1989 : ఇడు సౌడియా : ఇందూ
 • 1998 : నిశ్శబ్ద : డాక్టర్ వినీత

మళయాళం

మార్చు
 • 1983 కట్టతే కిలికోడు
 • 1985 ఎంటే కానకుక్కాయిల్
 • 1987 ఆంకలియుడ్ తారట్టు
 • 1988 కాక్కోటికవిలే అపోప్పన్ తడిగల్
 • 1988 పురావృతం
 • 1988 మూన్నం ముర
 • 1989 వరవేల్పు
 • 1989 నజాంగాలూడ్ కోచు
 • 1990 ఒట్టాయాడిపాతకల్
 • 1991 కిలుక్కం
 • 1992 అద్వైతం
 • 1993 దేవాసురం
 • 1993 మాయ మయూరం
 • 1994 పాథేయం
 • 1995 అగ్నీ దేవన్
 • 1997 మంగమ్మ
 • 2001 రావణప్రభు
 • 2002 నందనం
 • 2002 కైయంతు దూరత్
 • 2002 కృష్ణ పక్షక్కిలికల్
 • 2003 గ్రామఫోన్
 • 2003 మిజ్హి రండిలిమ్
 • 2005 ఆనందభద్రం
 • 2009 నమ్మాళ్ తమ్మిళ్
 • 2010 పాట్టీంటే పాలజీ
 • 2010 పెన్‌పట్టణం
 • 2011 ఇండియన్ రుపీ
 • 2012 ఫాదర్స్ డే
 • 2012 మోలీ ఆంటీ రాక్స్!
 • 2018 కినార్

పురస్కారాలు

మార్చు
విజయాలు
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్
 • 1992 - తేవార్ మగన్‌కు ఉత్తమ సహాయ నటి
 • 2002 - మిథర్ మై ఫ్రెండ్ కొరకు ఇంగ్లీష్‌లో ఉత్తమ చలన చిత్రం
 • 2011 - కుటుంబ సంక్షేమంపై ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్‌ - రెడ్ బిల్డింగ్ వేర్ ది సన్ సెట్స్‌
తమిళనాడు రాష్ట్ర ఫిలిం అవార్డులు
 • 1990 - కిజ్హక్కు వాసల్ సినిమాకు ఉత్తమ నటి
 • 1998 - తలైజురై సినిమాకు ఉత్తమ నటిగా ప్రత్యేక బహుమతి
2 వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్
 • 2012 - ప్రతిపాదన - మోలీ ఆంటీ రాక్స్! సినిమా కొరకు ఉత్తమ నటి
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు
 • 1983 - మాన్ వాసనై సినిమాకి ప్రత్యేక అవార్డు
 • 1988 - కాక్కోత్తిక్కవిలే అపోప్పన్ తాడికల్ సినిమాకు ఉత్తమ మలయాళ నటి
 • 1992 - అంకురం సినిమాకు ఉత్తమ తెలుగు నటి
 • 1992 - తేవార్ మగన్ సినిమాకు ఉత్తమ తమిళ నటి
 • 1993 - మారుప్పాడియం సినిమా కొరకు ఉత్తమ తమిళ నటి
 • 1994 - ప్రియాంక సినిమా కోసం ఉత్తమ తమిళ నటి
సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డులు
 • 1984 - సీతమ్మ పెళ్ళి సినిమాకి ఉత్తమ తెలుగు నటి
 • 1990 - కిజ్హక్కు వాసల్ సినిమాకి బెస్ట్ తమిళ నటి
 • 1991 - కిలుక్కం సినిమా కోసం ఉత్తమ మలయాళ నటి
 • 1991 - తేవార్ మగన్ సినిమాకు ఉత్తమ తమిళ నటి
 • 1994 - ఎన్ ఆసాయ్ మచన్ సినిమాకు స్పెషల్ బెస్ట్ తమిళ నటి
ఫిల్మ్ ఫాన్స్ (అభిమానుల) అసోసియేట్ అవార్డులు
 • 1983 - కట్టాతే కిలిక్కూడు సినిమాకు ఉత్తమ మలయాళ నటి
 • 1984 - పుధుమ పెన్న్ సినిమాకి బెస్ట్ తమిళ నటి
 • 1984 - మానస వీణా సినిమా కోసం ఉత్తమ తెలుగు నటి
 • 1986 - ప్రత్యేక ప్రశంసలు
 • 1990 - అంజలి సినిమాకి ఉత్తమ తమిళ నటి
 • 1991 - కిలుక్కం సినిమా కోసం ఉత్తమ మలయాళ నటి
 • 1992 - తేవార్ మగన్ సినిమాకి ఉత్తమ తమిళ నటి
 • 1994 - ప్రియాంక సినిమా కోసం ఉత్తమ తమిళ నటి
మైలపూర్ అకాడమీ బెర్క్లీ డ్రామా అవార్డు
 • 1989 - ఇరవిల్ ఒరు పాగల్ సినిమా కోసం టెలివిజన్‌లో ఉత్తమ నటి
 • 1984 - పెన్న్ సినిమా కోసం టెలివిజన్‌లో ఉత్తమ నటి
33 వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా
 • 2002 - మిట్ర్ మై ఫ్రెండ్ సినిమాకి కేరళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సిల్వర్ పీకాక్ జ్యూరీ అవార్డు
 • 2009 - కేరళ కేఫ్ సినిమా కోసం ఉత్తమ మలయాళ చిత్రం - నెట్‌ప్యాక్ (NETPAC) అవార్డు
ఇతర అవార్డులు
 • 1993 - తమిళనాడు ఇయాల్ ఇయిల్ నాటక మాన్రం: కలైమామణి
 • 2007 - కర్మవీర్ పురస్కార్: సిఎంఎస్ (CMS) మీడియా సిటిజెన్
నామినేషన్లు
స్క్రీన్ అవార్డులు
 • 2004 - ధూప్ సినిమా కొరకు ఉత్తమ సహాయ నటి
జీ సినీ అవార్డులు
 • 2004 - ధూప్ సినిమాకి ఉత్తమ సహాయ నటి

ఇవి కూడ చూడండి

మార్చు

కమల్ (దర్శకుడు)

మూలాలు

మార్చు
 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-27. Retrieved 2018-04-16.
 2. "Court grants divorce to actor Revathi". The Times of India . 23 April 2013. Retrieved 6 September 2015.
 3. "Revathy, Suresh Chandra Menon granted divorce – Oneindia Entertainment". Archived from the original on 2013-12-24. Retrieved 2018-04-16.
 4. "Films, a family affair!". Deccan Chronicle. 29 April 2017.
 5. "49th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 29 అక్టోబరు 2013. Retrieved 14 March 2012.
 6. "40th National Film Awards – 1993" (PDF). Directorate of Film Festivals – 1993. Archived from the original (PDF) on 9 మార్చి 2016. Retrieved 5 July 2013.
 7. Harsha Koda (www.jalakara.com). "www.revathy.com". www.revathy.com. Archived from the original on 18 April 2012. Retrieved 12 July 2012.
 8. "59th National Film Awards for the Year 2011 Announced". Press Information Bureau (PIB), India. Retrieved 7 March 2012.
 9. "ഏകാന്തചന്ദ്രിക ഇവിടെയുണ്ട് !". manoramaonline. Archived from the original on 4 August 2015. Retrieved 2 August 2015.
 10. "Actress Revathi Divorced – Find what you like – tikkview". Archived from the original on 2018-03-13. Retrieved 2018-04-16.
 11. Deccan Chronicle http://www.deccanchronicle.com/130423/entertainment-mollywood/article/revathi-suresh-granted-divorce Archived 2013-05-27 at the Wayback Machine

బయటి లింకులు

మార్చు