జాగర్లమూడివారిపాలెంజాగర్లమూడివారిపాలెం ప్రకాశం జిల్లా జే.పంగులూరు మండలంలోని గ్రామం. [1] ఎస్.టి.డి కోడ్:08593.

జాగర్లమూడివారిపాలెం
గ్రామం
జాగర్లమూడివారిపాలెం is located in Andhra Pradesh
జాగర్లమూడివారిపాలెం
జాగర్లమూడివారిపాలెం
నిర్దేశాంకాలు: 15°49′16″N 80°02′28″E / 15.821°N 80.041°E / 15.821; 80.041Coordinates: 15°49′16″N 80°02′28″E / 15.821°N 80.041°E / 15.821; 80.041 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాజే.పంగులూరు మండలం
మండలంజే.పంగులూరు Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08593 Edit this at Wikidata )
పిన్(PIN)523212 Edit this at Wikidata

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

పేరెలా వచ్చిందిసవరించు

1802 ప్రాంతంలో బల్లికురవ మండలం గుంటుపల్లి గ్రామం నుండి జాగర్లమూడి రామయ్య, వెంకయ్య, సుబ్బన్న సోదరులు ఈ ప్రాంతానికి తరలి వచ్చారు. అప్పటి జమీందారుల ఆసరాతో ఇక్కడ నివాసాలు ఏర్పాటుచేసుకొని వ్యవసాయం చేసేవారు. వీరి తరువాత మరికొన్ని కుటుంబలు ఇక్కడకు తరలి వచ్చినవి. 1840 ప్రాంతంలో రామయ్య చెరువును తవ్వించి భవిష్యత్తులో దాని అభివృద్ధికి కొంత మాన్యం ఏర్పాటు చేశారు. దాంతో ఈ గ్రామాన్ని అప్పట్లో 'జాగర్లమూడి వారి వూరు" గానూ, చెరువును "జాగర్లమూడి రామన్న కుంట గానూ పిలిచేవారు. కాలక్రమేణా ఈ గ్రామం జాగర్లమూడివారిపాలెంగా నామాంతరం చెందినది. [2]

గ్రామ భౌగోళికంసవరించు

ఈ ఊరు NH-5 ప్రక్కనే ఉంది.

సమీప మండలాలుసవరించు

దక్షణాన కొరిసపాడు మండలం, తూర్పున ఇంకొల్లు మండలం, పశ్చిమాన అద్దంకి మండలం, ఉత్తరాన మార్టూరు మండలం.

రవాణా సౌకర్యాలు:సవరించు

ఈ గ్రామానికి అన్ని రవాణా మార్గములు బాగానే ఉన్నాయి.

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

ఈ వూరిలో 1 నుండి 5 వరకు మాత్రమే స్కూలు ఉంది. తరువాత చదువులకు ప్రక్క ఊరిపై ఆధారపడవలసి ఉంది.

గ్రామ పంచాయతీసవరించు

  1. 1995 లో ముప్పవరం పంచాయతీలో అంతర్భాగంగా ఉన్న ఈ గ్రామం, 1996లో ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. మొదటి సర్పంచిగా శ్రీ ధూళిపాళ్ళ సీతారాములు విజయం సాధించారు. [2]
  2. కీ.శే.ధూళిపాళ్ళ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్.
  3. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి జాగర్లమూడి వెంకయమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ తెలగతోటి రాధాకృష్ణమూర్తి ఎన్నికైనారు. [3]&[4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ మహా గణపతిస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయాన్ని 8 లక్షల రూపాయల గ్రామస్తుల విరాళాలతో సుందరంగా నిర్మించారు. 2016, నవంబరు-13వతేదీ ఆదివారం ఉదయం 9-10 గంటల మధ్య వైభవంగా నిర్వహించెదరు. అనంతరం అన్నప్రసాద వితరణ చేసెదరు. [6]

ఈ గ్రామ సమీపములో, దాతల విరాళాలతో, 2015, మార్చి-25వ తేదీ బుధవారం నాడు, శ్రీవారి నామాల ప్రతిష్ఠా కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. అనంతరం, విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేసారు. స్థానికులు శ్రీ జాగర్లమూడి మల్లిఖార్జునరావు, సూర్యప్రకాశరావు, తమ తల్లిదండ్రులు శ్రీమతి సుబ్బమ్మ, శ్రీ నారయ్యల ఙాపకార్ధం, ఒకటిన్నర లక్షల రూపాయలతో ఈ నిర్మాణం చేపట్టినారు. [5]

గ్రామంలో ప్రధానమైన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

గామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లంకెలుసవరించు

[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2013, జూలై-13; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2013, జూలై-25; 3వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, అక్టోబరు-29; 4వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, మార్చి-26; 2వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016, నవంబరు-12; 2వపేజీ.