జాతక సమ్మేళనము మార్చు

హిందూ ధర్మ శాస్త్రముల ప్రకారము పూర్వకాలములో వివాహము కావలసిన వధూవరుల ఇరువురు తరపున తల్లిదండ్రులు, పెద్దవారు, దగ్గరివారు, స్నేహితులు, సన్నిహితులు, హితులు లేదా బంధువులు ముందుగా వధూవరుల జాతక సమ్మేళనము లోని ముఖ్యమైన 17 జాతక వివరణ విభాగములు లేక మరికొన్ని విధములుతో పాటు, 20 వింశతి (కూట) వర్గములు అనే వివాహ పొంతనములు చూసిన పిదప సంబంధము నిశ్చయించుకునేవారు.

  1. వధూవరుల జాతకములలో భాగ్యాధిపతులు పరస్పర కేంద్ర కోణములలో ఉన్నయడల భాగ్యప్రథము.
  2. వరుని యొక్క లగ్నానికి ఎనిమిదవ ఇంట వధువు యొక్క జాతకములో రవియున్న శుభము.
  3. శుక్రుడున్న స్థానాధిపతులు పరస్పర కేంద్ర కోణములలో వధూవరుల జాతకములలో వున్న మంచిది.
  4. వరుని యొక్క చంద్రరాశి వధువు లగ్నమయిననూ లేదా వధువు యొక్క చంద్రరాశి వరుని లగ్నమయిననూ శుభము.
  5. వధూవరుల ఒకరి జాతకములలో రవి వున్న రాశికి మరొకరి జాతకములో 1,3,4,8,10,11 స్థానములలో రవి వున్న శుభప్రథము.
  6. వధూవరుల రాశ్యాధిపతులు, లగ్నాధిపతులు పరస్పరము మిత్రులు అయినామంచిది.
  7. వధూవరుల జాతకములలో కుజుడు, శుక్రుడు, కుజశుక్రులు, కుజశనులు, శుక్రశనులు, శుకచంద్రులు యెవరైననూ ఒకే స్థానములో ఉన్ననూ సమ సప్తకములో వున్ననూ యోగ్యము.
  8. వధూవరుల చంద్రరాశులకు ఒకే గ్రహము అధిపతి అయిన శుభము.
  9. ఒకరి జాతకములో సప్తమాధిపతి మరొకరి జాతకములో చంద్రుడు పరస్పరము కేంద్ర కోణములలో ఉన్న మంచిది.
  10. వధువు లేక వరుడు యొక్క జన్మలగ్నము నుండికాని, చంద్ర లగ్నము నందుండికాని; రెండవ వారి జాతకములో 5-9, 1-9, 1-5 లగ్నములలో కుజుడుశుక్రుడు మంచిది.
  11. వధూవరులది ఒకే లగ్నమయిననూ మంచిది.
  12. వధూవరుల ఏ ఒక్కరి జాతకములలో అయిననూ సప్తమ స్థానములో గురుడు కాని పూర్ణచంద్రుడు వున్నయడల మంచిది.
  13. వధూవరుల ఏ ఒకరి జాతకములలో నయినా 2,7 అధిపతులు కాని, 1-7 అధిపతులు కాని కలసి ఉన్న మంచిది.
  14. వధూవరుల జాతకములలో ఒకరి లగ్నము మరొకరికి ఎనిమిదవ స్థానము అయిననూ, శుక్రుడు వున్న రాశి అయిననూ, సప్తమాధిపతి యున్న రాశి అయిననూ అనుకూలము.
  15. వరుని యొక్క లగ్నానికి ఎనిమిదవ ఇంట వధువు యొక్క జాతకములో రవియున్న శుభము.
  16. లగ్నాధిపతి 7 స్థానాధిపతిని కాని, శుక్రుడిని కాని చూచిన అయినా మంచిది.
  17. ద్వితీయ సప్తమాధిపతులు, లగ్నసప్తమాధిపతులు అయిననూ కలసి వున్న మంచిది.