జాతీయవాద ప్రజాస్వామ్య ప్రగతిశీల పార్టీ
జాతీయవాద ప్రజాస్వామ్య ప్రగతిశీల పార్టీ (ఆంగ్లం:Nationalist Democratic Progressive Party NDPP) భారతదేశానికి చెందిన నాగాలాండ్‌లోని ప్రాంతీయ రాజకీయ పార్టీ. చింగ్వాంగ్ కొన్యాక్ ఈ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాడు.[1]
జాతీయవాద ప్రజాస్వామ్య ప్రగతిశీల పార్టీ | |
---|---|
ప్రధాన కార్యదర్శి | అబూ మెహతా |
వ్యవస్థాపన | నెయిఫియు రియో |
స్థాపన | 2017 మే 17 |
ప్రధాన కార్యాలయం | H/No:155 (1),4వ వార్డు, దిమాపూర్ నాగాలాండ్, భారతదేశం - 797103 |
సిద్ధాంతం | ప్రాంతీయత |
రంగు | తెలుపు,ఎరుపు, నలుపు |
ECI Status | State Party |
కూటమి | NDA (2018-present) |
లోక్‌సభ స్థానాలు | 1 / 543 |
రాజ్యసభ స్థానాలు | 0 / 245 |
శాసన సభలో స్థానాలు | 21 / 60 |
వెబ్ సిటు | |
http://ndpp.co.in/ | |
Political parties Elections |
నెయిఫియు రియో మద్దతు దారులు నాగ పీపుల్స్ ఫ్రంట్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడి ప్రజాస్వామ్య ప్రగతిశీల పార్టీని స్థాపించారు. 2017 అక్టోబరులో ఈ పార్టీ పేరు జాతీయవాద ప్రజాస్వామ్య ప్రగతిశీల పార్టీగా మార్చబడింది.
2018 నాగాలాండ్ శాసనసభ ఎన్నికలకు నాగ పీపుల్స్ ఫ్రంట్ భారతీయ జనతా పార్టీతో సంబంధాలు తెంచుకున్న తరువాత జనవరి 2018 లో మాజీ ముఖ్యమంత్రి నీఫియు రియో పార్టీలో చేరారు. అదే నెలలోనే 10 మంది ఎన్‌పిఎఫ్ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వైదొలిగి ఎన్‌డిపిపితో చర్చలు ప్రారంభించారు.
మూలాలుసవరించు
- ↑ "India News, Nagaland News, Breaking News |". MorungExpress. Retrieved 2021-07-11.