జాతీయ క్రీడా దినోత్సవం

ప్రజా సెలవు

జాతీయ క్రీడా దినోత్సవం, భారత హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ గౌరవ సూచకంగా అతని పుట్టిన రోజైన ఆగష్టు 29 న జరుపుకుంటారు. ఈ దినోత్సవమును భారతీయ క్రీడాకారులు ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటారు. ఈ రోజున ఉత్తమ క్రీడాకారులకు, శిక్షకులకు అవార్డులు ఇచ్చి గౌరవిస్తారు.

జాతీయ క్రీడా దినోత్సవం భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ గైరవ సూచకంగా జరుపుతారు

నేపథ్యం

మార్చు

భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ (1905 ఆగష్టు 29, - 1979) డిసెంబరు 3, తన గోల్ స్కోరింగ్ విన్యాసాలతో, మొదట ఆటగానిగా , తర్వాత కెప్టెన్ గా గుర్తించబడ్డాడు. ధ్యాన్ చంద్ తన జట్టుతో మూడు ఒలింపిక్ బంగారు పతకాలు (1928 ఆమ్‌స్టర్‌డ్యామ్, 1932 లాస్ ఏంజెల్స్, 1936 బెర్లిన్) సాధించాడు. ఇతను భారత ప్రభుత్వం చే 1956లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించబడ్డాడు. దీంతో గొప్ప క్రీడాకారుడుగా పేరు తెచ్చుకున్న ధ్యాన్‌చంద్ గౌరవ సూచకంగా భారతీయ క్రీడాకారులు ప్రతి సంవత్సరం అతని జయంతి రోజున ఆగస్టు 29 న జాతీయ క్రీడా దినోత్సవమును జరుపుకుంటారు.

మూలాలు

మార్చు
  • ఈనాడు దినపత్రిక - 29-08-2014 - (భారతంలో తెలుగు వెలుగులు - జాతీయ క్రీడా దినోత్సవం నేడు)

వెలుపలి లంకెలు

మార్చు