జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం

నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ(ఎన్ఎఫ్ఎస్యు) (గతంలో గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం (జిఎఫ్ఎస్యు)) , గుజరాత్ రాజధాని గాంధీనగర్లో వున్నటువంటి ఒక అంతర్జాతీయ విశ్వవిద్యాలయం. ఇది భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఎ) ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ. ఇది పూర్తిగా ఫోరెన్సిక్ , ఇన్వెస్టిగేటివ్ సైన్స్ కు అంకితం చేయబడింది. [1]

జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం
నినాదంజ్ఞానం, వివేకం, పరిపూర్ణత
రకంఅంతర్జాతీయ విశ్వవిద్యాలయం
స్థాపితం
  • 2008 గుజరాత్ ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయం
  • 2020 జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం
వైస్ ఛాన్సలర్జె.యం. వ్యాస్
స్థానంగాంధీనగర్,గుజరాత్, భారతదేశం
23°12′38″N 72°39′43″E / 23.210472°N 72.662011°E / 23.210472; 72.662011
కాంపస్పట్టణ
అనుబంధాలుయూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (భారతదేశం), హోం మంత్రిత్వ శాఖ

చరిత్ర

మార్చు

గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీని గుజరాత్ ప్రభుత్వం 2008లో ఏర్పాటు చేసింది. 2008 సెప్టెంబరు 30 న గుజరాత్ శాసనసభ ఆమోదించిన చట్టం 17 ద్వారా ఇది రూపొందించబడింది. [2] ఇది 2020 అక్టోబరులో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్ చేయబడింది. ఇది పార్లమెంటు చట్టం ద్వారా ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా గుర్తించబడింది. [3][4] భారతదేశం వెలుపల మొదటి క్యాంపస్ ఉగాండాలో స్థాపించబడింది, తర్వాత ఏప్రిల్ 2023లో ఇది అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా మారింది. ఇది ఆఫ్రికా మొట్టమొదటి ఫోరెన్సిక్స్ సైన్స్ విశ్వవిద్యాలయంగా కూడా మారింది, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ చేత ప్రారంభించబడింది. [5]

క్యాంపస్‌లు

మార్చు

ఏప్రిల్ 2023 నాటికి, ఇది భారతదేశం అంతటా 4 క్యాంపస్‌లను, ఉగాండాలో 1 క్యాంపస్‌ను కలిగి ఉంది.

భారతదేశం

మార్చు
సంఖ్య పేరు స్థాపించబడింది నగరం రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
1 ఎన్ఎఫ్ఎస్యూ మెయిన్ క్యాంపస్ 2008 గాంధీనగర్ గుజరాత్
2 LNJN-NICFS 1972 ఢిల్లీ ఢిల్లీ
3 NFSU గోవా క్యాంపస్ 2021 పోండా, గోవా గోవా
4 NFSU త్రిపుర క్యాంపస్ 2021 అగర్తలా త్రిపుర

ఉగాండా

మార్చు
సంఖ్య పేరు స్థాపించబడింది నగరం ప్రాంతం
1 NFSU ఉగాండా 2023 జింజా తూర్పు ప్రాంతం (ఉగాండా)

మూలాలు

మార్చు
  1. "Narendra Modi says world`s first forensic science university is in Gujarat". Zee News (in ఇంగ్లీష్). 2014-03-01. Retrieved 2023-04-19.
  2. "Gujarat to have forensic science university: Modi - Hindustan Times (New Delhi, India) | HighBeam Research". web.archive.org. 2015-03-28. Archived from the original on 2015-03-28. Retrieved 2023-04-19.
  3. "NFSU Gandhinagar to set up 10 campuses in different states". The Indian Express (in ఇంగ్లీష్). 2021-09-19. Retrieved 2023-04-19.
  4. Saxena, Akshita (2020-09-22). "Parliament Clears 3 Bill To Declare 5 IIITs, National Forensic Sciences University & Rashtriya Raksha University As Institutions Of National Importance [Read Bills]". www.livelaw.in (in ఇంగ్లీష్). Retrieved 2023-04-19.
  5. "First forensics science university in Africa to be built in Uganda". Monitor (in ఇంగ్లీష్). 2022-09-27. Retrieved 2023-04-19.