జాతీయ రహదారి 1డి (పాత సంఖ్య)
నేషనల్ హైవే 1డి ( ఎన్‌హెచ్ 1డి ), జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని జాతీయ రహదారి. ఇది శ్రీనగర్‌ను లడఖ్‌లోని లేహ్‌కు కలుపుతుంది. దీన్ని శ్రీనగర్-లేహ్ హైవే అని కూడా అంటారు. 2006 లో శ్రీనగర్-లేహ్ హైవేను జాతీయ రహదారిగా ప్రకటించారు.[1] [2] ఇది ఇప్పుడు జాతీయ రహదారి 1 లో భాగం. ఇది పశ్చిమాన ఉరి వరకు విస్తరించింది.
National Highway 1డి | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 422 కి.మీ. (262 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ | |||
శ్రీనగర్‌లో ఎన్‌హెచ్ 1ఎ | ||||
తూర్పు చివర | లేహ్, లడఖ్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | జమ్మూ కాశ్మీర్: 422 కి.మీ. (262 మై.) | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | శ్రీనగర్ - జోజి లా - కార్గిల్ - లేహ్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
మహారాజా రణబీర్ సింగ్, థామస్ డగ్లస్ ఫోర్సిత్ ల మధ్య 1870లో [3] కుదిరిన వాణిజ్య ఒప్పందం తర్వాత, పాత మధ్య ఆసియా వాణిజ్య మార్గమైన శ్రీనగర్-లేహ్-యార్కండ్‌ను ట్రీటీ రోడ్ అని కూడా పిలుస్తారు. [4]
కొత్త సంఖ్య
మార్చు2010 లో, పాత ఎన్‌హెచ్1ఎ (ఉరి-శ్రీనగర్), పాత ఎన్‌హెచ్1డి (శ్రీనగర్-లేహ్) లను కలిపి కొత్తగా జాతీయ రహదారి 1ని రూపొందించారు. [5]
భౌగోళికం
మార్చుఎన్హెచ్ 1డి చాలా వరకు, ప్రమాదకరమైన భూభాగం గుండా వెళ్తుంది. సింధు నది వెంబడి ఉన్న చారిత్రిక వాణిజ్య మార్గాన్ని ఇది అనుసరించింది. తద్వారా ఆధునిక ప్రయాణికులకు చారిత్రికంగా, సాంస్కృతికంగా ముఖ్యమైన గ్రామాల సంగ్రహావలోకనం ఇస్తుంది. [6] ఈ రహదారి సాధారణంగా జూన్ ప్రారంభం నుండి నవంబరు మధ్య వరకు ట్రాఫిక్ కోసం తెరిచి ఉంటుంది. ఎన్‌హెచ్ 1 మొత్తం పొడవు 422 కి.మీ. (262 మై.) . [7]
చరిత్ర
మార్చు17, 18 శతాబ్దాలలో, ఈ రహదారి ఒక చిన్న బండ్ల బాట లాగానే ఉండేది. గుర్రాలపై పోయేందుకు కూడా కష్టంగా ఉండేది. ప్రధానంగా కాశ్మీర్ శాలువ పరిశ్రమకు అవసరమైన పాష్మినా ఉన్ని వంటి వస్తువులను, యార్కండ్, టిబెట్ ల నుండి పోర్టర్లు తీసుకువెళ్ళేవారు. [8]
19వ శతాబ్దంలో, జోరావర్ సింగ్ లడఖ్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత డోగ్రా పాలనలో, గుర్రాలపై వెళ్ళేలా మార్గాన్ని మెరుగుపరచారు. [8] 1870లో, జమ్మూ కాశ్మీర్ మహారాజా రణబీర్ సింగ్, బ్రిటిష్ రాజ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీని ద్వారా జమ్మూ కాశ్మీర్ రాజ్యం, మధ్య ఆసియా సరిహద్దు (బహుశా కారకోరం పాస్ ) వరకు రహదారి నిర్వహణ చేపట్టింది. దీని కోసం వార్షిక నిధులను కేటాయించింది. ఈ రహదారికి "ట్రీటీ రోడ్" అని పేరు వచ్చింది. [8]
1950లలో లడఖ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. చైనా రహస్యంగా జిన్జియాంగ్ నుండి పశ్చిమ టిబెట్ వరకు, దాదాపు 1,200 కి.మీ. (750 మై.) దూరం సైనిక రహదారిని నిర్మించింది. దీన్ని 1957 లో భారతీయులు కనిపెట్టారు. 1958లో ఈ రహదారిని చూపుతున్న చైనీస్ మ్యాపులతో ఇది నిర్థారణైంది. రాజకీయ పరిస్థితులు క్షీణించాయి, 1962లో చైనా-ఇండియన్ యుద్ధంతో ఇది పరాకాష్ఠకు చేరుకుంది.
చైనా వైపు ఉన్న రహదారి చైనా సైన్యానికి నమ్మకమైన సరఫరా మార్గంగా మారింది. భారత సైన్యం కూడా తమ దళాలకు సరఫరా, సమీకరణల కోసం రహదారిని నిర్మించడానికి ఇది ప్రేరణనిచ్చింది. 1962లో శ్రీనగర్‌లో ప్రారంభమైన ఈ నిర్మాణం రెండేళ్లలో కార్గిల్‌కు చేరుకుంది. ఆధునిక శ్రీనగర్-లే హైవేకి ఇది ఆధారం. భౌగోళిక సవాళ్ళ కారణంగా ఈ రహదారిని నిర్మించడం ప్రమాదకరమైన పని. ఈ రహదారి నిర్వహణ ఇప్పటికీ సవాలే.[9]
1974లో పౌరుల రాకపోకలపై ఆంక్షలను ఎత్తివేసారు.
1999 లో కార్గిల్‌పై పాకిస్తాన్ దురాక్రమణ చేసిన సమయంలో భారత సైన్యం ఈ రహదారిని సమీకరణ మార్గంగా ఉపయోగించింది.
చిత్రమాలిక
మార్చు-
అయస్కాంత కొండ
-
ఖల్ట్సే స్మారక స్థూపం
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Government of Jammu and Kashmir, Ladakh Autonomous Hill Development Council Kargil (April 2006). "Monthly News Letter". Archived from the original on 17 July 2011. Retrieved 2009-06-30.
- ↑ ExpressIndia.com (23 April 2006). "Srinagar-Leh road gets National Highway status". ExpressIndia.com. Archived from the original on 9 అక్టోబరు 2012. Retrieved 23 జూన్ 2024.
- ↑ Jyoteeshwar Pathik (1997). Glimpses of History of Jammu & Kashmir. New Delhi, India: Anmol Publications. p. 117. ISBN 81-7488-480-7. Retrieved 2009-06-30.
- ↑ Henry Osmaston (Editor), Philip Denwood (Editor) (1993). Recent Research on Ladakh 4 & 5: Proceedings of the Fourth and Fifth International Colloquia on Ladakh. Delhi, India: Motilal Banarsidass. p. 236. ISBN 978-81-208-1404-2. Retrieved 2009-06-30.
{{cite book}}
:|last=
has generic name (help) - ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 28 Apr 2018.
- ↑ [1] Ladakh, the Road journey
- ↑ "Archived copy". Archived from the original on 10 April 2009. Retrieved 2011-07-20.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) Details of National Highways in India-Source-Govt. of India - ↑ 8.0 8.1 8.2 Warikoo, K. (1995), "Gateway to Central Asia: The transhimalayan trade of Ladakh, 1846–1947", in H. Osmaston; P. Denwood (eds.), Recent Research on Ladakh, 4 and 5, Motilal Banarsidass, p. 236, ISBN 978-81-208-1404-2
- ↑ Thaindian.com (28 March 2008). "Srinagar-Leh highway to reopen after remaining closed for six months". Archived from the original on 2008-04-17. Retrieved 2009-06-30.