జాతీయ రహదారి 10

సిక్కిం నుండి బంగ్లాదేశ్ సరిహద్దు వరకు ఉన్న జాతీయ రహదారి.

జాతీయ రహదారి 10 (ఎన్‌హెచ్10) ఈశాన్య భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది భారత బంగ్లాదేశ్ సరిహద్దును సిలిగురి మీదుగా గాంగ్‌టక్‌కు కలుపుతుంది. ఇది పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల గుండా వెళుతుంది. ఈ రహదారిని సిక్కిం రాష్ట్రంలోని రంగ్‌పో నుండి రాణిపూల్ (28 కి.మీ) వరకు నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) నిర్వహిస్తోంది.[1][2] ఈ రహదారి లోని చాలా భాగం గతంలో ఎన్‌హెచ్31A గా ఉండేది.

Indian National Highway 10
10
National Highway 10
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 10
మార్గ సమాచారం
పొడవు174 కి.మీ. (108 మై.)
NHIDCL కింద 28 కి.మీ.
ముఖ్యమైన కూడళ్ళు
దక్షిణ చివరసిలిగురి, పశ్చిమ బెంగాల్
ఉత్తర చివరగాంగ్‌టక్, సిక్కిం
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుపశ్చిమ బెంగాల్, సిక్కిం
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 9 ఎన్‌హెచ్ 11

మార్గం

మార్చు

NH10 భారత బంగ్లాదేశ్ సరిహద్దు నుండి ఫుల్బరి, సిలిగురి, సేవోక్, కలిజోరా, రాంబి బజార్, తీస్తా బజార్, కాలింపాంగ్, పశ్చిమ బెంగాల్‌లోని మెల్లి, రంగ్‌పో, మజితార్, సింగ్‌టామ్, రాణిపూల్ గుండా వెళ్ళి సిక్కిమ్ రాష్ట్రం లోని గ్యాంగ్‌టక్ వద్ద ముగుస్తుంది. NHIDCL నిర్మించిన అటల్ సేతు వంతెన, జాతీయ రహదారి 10లో భాగం. సిక్కింలో అత్యంత పొడవైన రహదారి వంతెన కూడా. ఇది పశ్చిమ బెంగాల్‌లోని కాలింపాంగ్ జిల్లా, సిక్కింలోని పాక్యోంగ్ జిల్లాల సరిహద్దులో రంగ్‌పో పట్టణంలో ఉంది.[3][4]

జంక్షన్లు

మార్చు
  ఎన్‌హెచ్ 17 సెవోకే వద్ద ముగింపు.
  ఎన్‌హెచ్ 717A రాణిపూల్ వద్ద ముగింపు.
  ఎన్‌హెచ్ 310 గాంగ్‌టక్ వద్ద ముగింపు.
  ఎన్‌హెచ్ 310A గాంగ్‌టక్ వద్ద ముగింపు
  ఎన్‌హెచ్ 510 సింగ్‌టమ్ వద్ద ముగింపు.
  ఎన్‌హెచ్ 710 మెల్లి వద్ద ముగింపు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 18 April 2019.
  2. "State-wise length of National Highways in India" (PDF). Ministry of Road Transport and Highways. 30 November 2018. Archived from the original (PDF) on 29 September 2020. Retrieved 9 May 2019.
  3. "Route substitution (amendment) for national highways 10 and 717" (PDF). The Gazette of India. Retrieved 18 April 2019.
  4. "Route correction notification for NH 717A dated April, 2016" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 11 Aug 2018.