జాతీయ రహదారి 28 (పాత సంఖ్య)
జాతీయ రహదారి 28 ఉత్తర భారతదేశం లోని జాతీయ రహదారి, ఇది ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోను బీహార్‌లోని బరౌనీని కలుపుతుంది. ఇది ఖుషీనగర్ నుండి 20 కి.మీ. (12 మై.) దూరాన బీహార్‌లో ప్రవేశిస్తుంది. ఇది గంగానదికి ఉత్తరాన బరౌని వద్ద జాతీయ రహదారి 31 లో కలుస్తుంది. NH 28 మొత్తం పొడవు 570 కి.మీ. (350 మై.). ఇది బీహార్‌లో 259 కి.మీ. (161 మై.), ఉత్తరప్రదేశ్‌లో 311 కి.మీ. (193 మై.) పొడవు ఉంటుంది.
National Highway 28 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 570 కి.మీ. (350 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | లక్నో, ఉత్తర ప్రదేశ్ | |||
తూర్పు చివర | బరౌని, బీహార్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | ఉత్తర ప్రదేశ్: 311 కి.మీ. (193 మై.) బీహార్: 259 కి.మీ. (161 మై.) | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | లక్నో - అయోధ్య - గోరఖ్‌పూర్ - బరౌని | |||
రహదారి వ్యవస్థ | ||||
|
వ్యవధి
మార్చుజాతీయ రహదారి 28 బీహార్‌లోని పారిశ్రామిక పట్టణమైన బరౌనిని ఉత్తరప్రదేశ్ రాజధాని నగరం లక్నోతో గోరఖ్‌పూర్ మీదుగా కలుపుతుంది. ఇది బీహార్‌లోని బెగుసరాయ్, సమస్తిపూర్, ముజఫర్‌పూర్, తూర్పు చంపారన్, గోపాల్‌గంజ్ లు, ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్, డియోరియా, గోరఖ్‌పూర్, సంత్ కబీర్ నగర్, బస్తీ, అయోధ్య, బారాబంకి, లక్నో జిల్లాల మీదుగా నడుస్తూ, దారిలో కొన్ని ప్రధాన నగరాలు, పట్టణాలను తాకుతుంది.
బయలుదేరు స్థలం
మార్చుజాతీయ రహదారి 28 బరౌని సమీపంలోని జాతీయ రహదారి 31 కూడలి వద్ద బయలుదేరి, దల్సింగ్‌సరాయ్, సమస్తిపూర్, ముజఫర్‌పూర్, మోతీపూర్, మెహసీ, చకియా గుండా వాయువ్యంగా వెళ్ళి, పిప్రకోఠి వద్ద మోతీహరికి 10 కి.మీ. (6.2 మై.) కి ముందు మారుతుంది. పశ్చిమం వైపు మళ్లీ గోపాల్‌గంజ్ సమీపంలో వాయవ్యంగా తిరిగి, కుచాయ్ కోట్ వద్ద రాష్ట్రం దాటుతుంది. జాతీయ రహదారి 28 బీహార్‌లో 259 కి.మీ. (161 మై.) పొడవున ఉంటుంది.
ముగింపు
మార్చుకాసియా, ఉత్తర ప్రదేశ్‌లో జాతీయ రహదారి 28 స్పృశించే మొదటి ఆవాస స్థావరం. ఖుషీనగర్, గోపాల్‌గంజ్‌కు వాయవ్యంగా 58 కి.మీ. దూరాన ఉంటుంది. ఈ హైవే లక్నో వద్ద ముగిసే ముందు గోరఖ్‌పూర్, బస్తీ, ఖలీలాబాద్, అయోధ్య, బారాబంకిల గుండా వెళ్తుంది. జాతీయ రహదారి 28, ఉత్తర ప్రదేశ్‌లో 331 కి.మీ. (206 మై.) - పొడవున ఉంది.
ప్రమాదాలు
మార్చుఇది దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో ఒకటి. దీనిపై ప్రమాదాలు కూడా ఎక్కువే. ఈ ప్రమాదాల వెనుక ప్రధాన కారణం, స్థానిక ప్రజలు రోడ్డును సులభంగా దాటేందుకు వీలుగా, ఊహించని విధంగా రోడ్డు విభాజకాన్ని తీసివెయ్యడం. ఇటీవల లక్నోలోని శ్రీ రాంస్వరూప్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ కు చెందిన విద్యార్థులు, కళాశాల సిబ్బంది తరచూ మరణిస్తున్న కారణంగా హైవేను దాదాపు 5 గంటలపాటు నిరోధించడంతో ఎన్‌హెచ్‌లో 35 కిలోమీటర్ల పొడవైన ట్రాఫిక్‌కు దారితీసింది.[1]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Day after student's death, protest outside college". Timesofindia.indiatimes.com. 2014-10-10. Retrieved 2016-06-14.