జాతీయ సాంకేతిక దినోత్సవం
జాతీయ సాంకేతిక దినోత్సవం (జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం) ప్రతి సంవత్సరం మే 11న నిర్వహించబడుతుంది. భారతదేశ సాంకేతిక పురోగతికి గుర్తుగా ఈ జాతీయ వైజ్ఞానిక దినోత్సవం జరుపబడుతుంది.[1]
జాతీయ సాంకేతిక దినోత్సవం | |
---|---|
అధికారిక పేరు | జాతీయ వైజ్ఞానిక దినోత్సవం |
జరుపుకొనే రోజు | మే 11 |
ఉత్సవాలు | మే 11 |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి సంవత్సరం ఇదే రోజు |
చరిత్ర
మార్చుభారత సైన్యం 1998 మే 11న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో రెండవ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించారు. దీన్నే పోఖ్రాన్-II (ఐదు న్యూక్లియర్ బాంబుల విస్ఫోటనాల పరీక్షల వరుస) అంటారు.[2] భారతదేశాన్ని అణు దేశంగా ప్రకటించడమేకాకుండా మే 11వ తేదీని జాతీయ సాంకేతిక దినోత్సవంగా ప్రకటించి అధికారికంగా సంతకం చేశారు.[3]
ఇదేరోజు ఏరోస్పేస్ ఇంజనీరుగా ఉన్న డా. అబ్దుల్ కలాం నిర్వహించిన మొదటి దేశీయ విమానం హంస-3 పరీక్షలు, త్రిశూల్ క్షిపణులు, ఆపరేషన్లు కూడా విజయవంతంగా పరీక్షించబడ్డాయి.[4]
కార్యక్రమాలు
మార్చు- సైన్స్ ప్రాముఖ్యతను తెలియజేయడానికి దేశంలోని వివిధ సాంకేతిక సంస్థలలో, ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- శాస్త్ర, సాంకేతికరంగంలో కృషిచేసిన వ్యక్తులకు, పరిశ్రమలకు ఈ దినోత్సవం రోజున అవార్డులు అందజేస్తారు.
- నూతన ఆవిష్కరణల గురించి తెలియజేయడంతో పాటూ ఆ ఫలాలను అందరికీ అందేలా చూడడం.
మూలాలు
మార్చు- ↑ హెచ్.ఎం.టీవీ.లైవ్, స్పెషల్స్ (11 May 2020). "నేడే జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం". HMTV (in ఇంగ్లీష్). Sumitra. Archived from the original on 11 మే 2020. Retrieved 11 May 2020.
- ↑ India Bureau (17 May 1998). "India releases pictures of nuclear tests". CNN India Bureau,1998. CNN India Bureau. Retrieved 11 May 2020.
- ↑ Press Information Bureau (11 మే 2008). "National technology day celebrated". Department of Science and Technology. Archived from the original on 15 డిసెంబరు 2010. Retrieved 11 మే 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (8 May 2020). "మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం". www.sakshieducation.com. Archived from the original on 11 మే 2020. Retrieved 11 May 2020.