జానకి అమ్మ
జస్టిస్ జానకి అమ్మ (1920–2005), కేరళ ఉన్నత న్యాయస్థానానికి మాజీ న్యాయమూర్తి. ఆమె కేరళలోని త్రిస్సూర్ జిల్లలో ఒక గ్రామంలో జన్మించింది. జానకీ జీవితంలో ఎక్కువ భాగం మాత్రం ఎర్నాకుళంలో జీవించింది. 1974 మే 30న కేరళ ఉన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించింది. భారతదేశంలోనే రెండో మహిళా హైకోర్టు న్యాయమూర్తి జానకీ అమ్మ కావడం విశేషం. 1982 ఏప్రిల్ 22 వరకు జడ్జిగా పనిచేసింది ఆమె.
జస్టిస్ పి. జానకి అమ్మ | |
---|---|
జననం | జానకి 1920 త్రిస్సూర్ |
మరణం | 2005 (aged 84–85) |
జాతీయత | భారతీయులు |
వృత్తి | న్యాయమూర్తి |
ఉద్యోగం | కేరళ హైకోర్టు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | Second woman to be a Judge of High Court in India |
బిరుదు | Hon. Justice |
పదవీ కాలం | 30 May 1974 to 22 April 1982 |
రాజకీయ జీవితం
మార్చుఆమె 1940-44 మధ్య కాలంలో భారత స్వాతంత్ర్య సంగ్రామంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఆమె తాన్ విద్యాభ్యాసం అనంతరం కొచ్చిన్ ప్రజా మండలంలో చేరారు. తరుగాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలోనికి చేరారు.
ఆమె ట్రావెన్స్‌కోర్-కొచ్చిన్ లో మొదటి మహిళా మ్యునిసిపల్ చైర్‌పర్సన్ గా పనిచేసారు. ఆమె ఏప్రిల్ 1953 నుండి మార్చి 1956 వరకు ఎర్నాకుళం మ్యునిసిపల్ కౌన్సిల్ కు చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిమారు. ఆమె న్యాయ విభాగంలో చేరిన తరువాత తన రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పారు.
న్యాయ వ్యవస్థ
మార్చుఆమె తన న్యాయవాద వృత్తిని న్యాయవాది పనంపల్లి గోవింద మీనన్ వద్ద జూనియర్ గా ప్రారంభించారు. తరువాత ఆమె కొజికోడ్, టెలిచెర్రి, మంజేరి ప్రాంతాలలో జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా, సెషన్స్ జడ్జిగా బాధ్యతలు నిర్వహించారు. ఆమె మే 30 1974లో కేరళ హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. భారతదేశంలో న్యాయవాద వృత్తిని అలంకరించిన మహిళలలో ఆమె రెండవవారు. ఆమె 1982 ఏప్రిల్ 22 న కేరళ హికోర్టు నుండి పదవీ విరమణ చేశారు.
దర్యాప్తులు / విచారణ కమీషన్లు
మార్చుఆమె కేరళ హైకోర్టు నుండి న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తదుపరి న్యాయ రంగంలో వివిధ సేవలనందించారు. 1983లో ఆమె అనేక మంది కారణమైన కల్తీ సారా ఉదంతాన్ని దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంచే నియమింపబడ్డారు. ఆమె చేసిన సిఫార్సులకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అబ్కారీ విధానంలో 57 (A) సెక్షనును ప్రవేశపెట్టింది. ఆమె కేరళ ప్రభుత్వానికి సంబంధించిన అనేక దర్యాప్తులు, విచారణ కమిషన్లలో తన సేవలనందించారు.
ఇతర పదవులు
మార్చుఆమె ఎర్నాకుళం కారయోగం అధ్యక్షురాలిగా కూడా తన సేవలనందించారు.[1]