కొచ్చి

కేరళ రాష్ట్రంలోని ముఖ్య నగరం
(కొచ్చిన్ నుండి దారిమార్పు చెందింది)

కొచ్చిన్ లేదా కొచ్చి (మలయాళం: കൊച്ചി) కేరళ రాష్ట్రానికి చెందిన ఎర్నాకుళం జిల్లా లోని అతిపెద్ద నగరం., ఒక రేవు పట్టణం. తరచూ కొచ్చిన్ ని ఎర్నాకుళం అనే వ్యవహరిస్తూ ఉంటారు. కొచ్చి జనాభా 6,01, 574. ఇది కేరళ రాష్ట్రంలోనే అత్యంత జనసాంద్రత గల పట్టణం. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం (ట్రివేండ్రం) ఉత్తర దిశగా 220 కి.మీ (137 మై) దూరంలో, రాష్ట్రంలోని పెద్ద నగరాలలో తృతీయ స్థానంలో ఉన్న కోజికోడ్కు దక్షిణ దిశగా 180 కి.మీ (112 మై) దూరంలో ఉంది. అరేబియా సముద్రపు మహారాణిగా పిలువబడే కొచ్చి 14వ శతాబ్దం నుండే సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి అనుకూలంగా నిలచి ప్రాముఖ్యత సంతరించుకుంది.1503 లోనే పోర్చుగీసు సామ్రాజ్యం లో భాగమై, భారతదేశంలో మొట్టమొదటి ఐరోపా దేశస్థుల మజిలీ అయింది.1530 లో పోర్చుగీసు వారు గోవాకి వారి కార్య కలాపాలని తరలించేవరకూ కొచ్చి యే వారి మజిలీ. పిమ్మట డచ్, బ్రిటీష్ రాజ్యాలు కొచ్చిని అభివృద్ధి చేశాయి.

కొచ్చి
Kochi
കൊച്ചി
Skyline of {{{official_name}}}
Nickname(s): Queen of the Arabian Sea[1][2]
Coordinates: 9°58′37″N 76°16′12″E / 9.977°N 76.27°E / 9.977; 76.27
Population (2011)
 • City601,574
 • Metro2,117,990
Websitewww.corporationofcochin.net

చరిత్రసవరించు

కొచ్చిన్ పురాతన కాలం నుండి సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి పేరొందిందిగా గ్రీకులు, రోమనులు, యూదులు, అరబులు, చైనీయులు ఎరుగుదురు. 1341 లో పెరియార్ నదిలో వరదల వలన కోడుంగళ్ళూరు లోని వ్యాపార కేంద్రం నశించడంతో కొచ్చిన్ కి మంచి గుర్తింపుకు వచ్చింది. పలు చరిత్రకారుల ప్రకారం కులశేఖర సామ్రాజ్యం పతనం తర్వాత కొచ్చిన్ రాజ్యం 1102 లో ఏర్పడింది. అప్పట్లో రాజుకు ప్రస్తుతమున్న కొచ్చి పట్టణంతో బాటు చుట్టు ప్రక్కల ప్రదేశాలపై కూడా అధికారం ఉండేది. వంశ పారంపర్యముగా వచ్చెడి రాజవంశం 'పెరుంపడుప్పు స్వరూపం' లేదా 'కురు స్వరూపం' అని స్థానిక భాషలో వ్యవహరించేవారు.

1503 నుండి 1663 వరకు ఫోర్ట్ కొచ్చి పోర్చుగల్ పాలించింది. 1773 లో మైసూరు రాజు హైదర్ ఆలీ మలబారు ప్రాంతాన్ని కైవసం చేసుకొని కొచ్చిని తన రాజ్యంలో కలిపి వేసుకొన్నాడు. 20వ శతాబ్ద ప్రారంభంలో ఇక్కడి వ్యాపారం విస్తరించడంతో దీనిని అభివృద్ధి చేయవలసి వచ్చింది. అప్పటి మద్రాసు గవర్నరు లార్డ్ విల్లింగ్డన్, రాబర్ట్ బ్రిస్టోవ్ అను హార్బరు ఇంజినీరును ఆహ్వానించాడు. 21 ఏళ్ళలో బ్రిస్టోవ్ కొచ్చి పోర్టుని ద్వీపకల్పములోనే ఒక సురక్షితమైన పోర్టుగా మార్చి వేసాడు.

వాతావరణంసవరించు

ఎర్నాకులం సమీపంలో ఉన్న కొచ్చి నేవల్ బేస్ వాతావరణ డేటా క్రింద ఉంది.

శీతోష్ణస్థితి డేటా - కొచ్చి
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 35
(95)
37
(99)
37
(99)
34
(93)
35
(95)
33
(91)
35
(95)
35
(95)
38
(100)
35
(95)
34
(93)
33
(91)
38
(100)
సగటు అధిక °C (°F) 30
(86)
31
(88)
31
(88)
31
(88)
31
(88)
28
(82)
28
(82)
28
(82)
28
(82)
29
(84)
30
(86)
30
(86)
30
(86)
సగటు అల్ప °C (°F) 23
(73)
25
(77)
26
(79)
26
(79)
26
(79)
25
(77)
24
(75)
24
(75)
25
(77)
25
(77)
25
(77)
23
(73)
25
(77)
అత్యల్ప రికార్డు °C (°F) 17
(63)
18
(64)
20
(68)
21
(70)
22
(72)
21
(70)
21
(70)
20
(68)
22
(72)
20
(68)
20
(68)
19
(66)
17
(63)
సగటు అవపాతం mm (inches) 21.9
(0.86)
22.9
(0.90)
35.3
(1.39)
124.0
(4.88)
395.7
(15.58)
720.7
(28.37)
697.2
(27.45)
367.8
(14.48)
289.4
(11.39)
302.3
(11.90)
175.1
(6.89)
48.3
(1.90)
3,228.3
(127.10)
Source 1: [3]
Source 2: [4]

మూలాలుసవరించు

  1. K. C. Sivaramakrishnan (2006). People's Participation in Urban Governance. Concept Publishing Company. p. 156. ISBN 8180693260.
  2. Ganesh Kumar. Modern General Knowledge. Upkar Prakashan. p. 194. ISBN 8174821805.
  3. "Kochi, India". Whetherbase. August 2011. Retrieved 1 July 2010.
  4. "Kochi, India". MSN India. Archived from the original on 14 జూలై 2011. Retrieved 3 August 2010.

వెలుపలి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కొచ్చి&oldid=3910133" నుండి వెలికితీశారు