జాన్ గై
జాన్ విలియం గై (జననం 1934, ఆగస్టు 29) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 1955 -1961 మధ్యకాలంలో న్యూజీలాండ్ జాతీయ జట్టు తరపున 12 టెస్టులు ఆడాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో నివసిస్తున్నాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | జాన్ విలియం గై | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | నెల్సన్, న్యూజీలాండ్ | 1934 ఆగస్టు 29|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి స్లో-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 76) | 1955 నవంబరు 7 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1961 డిసెంబరు 26 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 1 |
జననం, విద్య
మార్చుగై 1934, ఆగస్టు 29న నెల్సన్‌లో జన్మించాడు.[1] 1950 - 1953 మధ్యకాలంలో నెల్సన్ కళాశాలలో చదువుకున్నాడు.[2]
క్రికెట్ రంగం
మార్చు1953–54లో సెంట్రల్ డిస్ట్రిక్ట్‌ల తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు.[3] తన ఉద్యోగ జీవితంలో న్యూజీలాండ్ చుట్టూ తిరుగుతూ తరువాత కాంటర్బరీ, ఒటాగో, వెల్లింగ్టన్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 1972-73లో నార్తర్న్ డిస్ట్రిక్ట్‌లతో తన ఫస్ట్-క్లాస్ కెరీర్‌ను ముగించాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఐదు న్యూజీలాండ్ ప్రావిన్షియల్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.[4] 1958 ఇంగ్లీష్ క్రికెట్ సీజన్‌లో నార్తాంప్టన్‌షైర్ తరపున కూడా రెండుసార్లు ఆడాడు.[3]
1955-56లో పాకిస్తాన్ పర్యటనలో తన మొదటి టెస్టులు ఆడాడు. ఆ తర్వాత భారత్‌తో జరిగిన సిరీస్‌లో 34.77 సగటుతో 313 పరుగులు చేశాడు.[5] మొదటి టెస్టులో ఒక సెంచరీ (102), మూడవ టెస్టులో 52, నాలుగో టెస్టు 91 పరుగులు చేశాడు.[6]
1960ల ప్రారంభంలో షెల్ కోసం పనిచేశాడు.[7] క్రికెట్ కెరీర్ ముగిసిన తరువాత, జాతీయ సెలెక్టర్ అయ్యాడు. న్యూబరీ క్రికెట్ బ్యాట్‌లకు ప్రతినిధిగా ఉన్నాడు. తోటి న్యూజీలాండ్ క్రికెటర్ లాన్స్ కెయిర్న్స్ ఉపయోగించే భుజం లేని ఎక్స్‌కాలిబర్ బ్యాట్‌ను గై అభివృద్ధి చేశాడు.[8][9]
మూలాలు
మార్చు- ↑ జాన్ గై at ESPNcricinfo
- ↑ "Full school list of Nelson College, 1856–2005". Nelson College Old Boys' Register, 1856–2006 (CD-ROM) (6th ed.). 2006.
- ↑ 3.0 3.1 "John Guy". CricketArchive. Retrieved 7 August 2022.
- ↑ Francis Payne & Ian Smith, eds, 2021 New Zealand Cricket Almanack, Upstart Press, Takapuna, 2021, p. 274.
- ↑ "Test Batting and Fielding in Each Season by John Guy". CricketArchive. Retrieved 7 August 2022.
- ↑ Don Neely & Richard Payne, Men in White: The History of New Zealand International Cricket, 1894–1985, Moa, Auckland, 1986, pp. 238–52.
- ↑ NZ Cricketer Comes to Gisborne
- ↑ Coverdale, Brydon. "The man behind Excalibur". ESPNcricinfo. Retrieved 7 May 2019.
- ↑ Eva, B., "Kiwi Cairns' six sixes in 1983", The Sunday Age, 3 February 2013, Sport section, p. 20.
బాహ్య లింకులు
మార్చు- న్యూజీలాండ్ క్రికెట్ మ్యూజియంలో జాన్ గై ఇంటర్వ్యూ