బ్రిటీష్ ఆర్థికవేత్త అయిన జె.ఆర్.హిక్స్ ఏప్రిల్ 8, 1904ఇంగ్లాండు లోని లీమింగ్టన్ స్పాలో జన్మించాడు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఇతని ఉన్నత విద్య కొనసాగింది. అర్థశాస్త్రంలో సాధారణ సమతౌల్య సిద్ధాంతం మరియు సంక్షేమ సిద్ధాంతం కొరకు అమెరికా ఆర్థికవేత్త కెన్నెత్ జోసెఫ్ ఆరోతో కల్సి 1972లో అర్థశాస్త్రపు నోబెల్ బహుమతిని పొందినాడు. ఇతను అర్థశాస్త్రానికి చేసిన ప్రధాన సేవ IS-LMనమూనా. హిక్స్ మే 20, 1989 నాడు మరణించాడు.