జావేద్ బుర్కీ

పాకిస్తానీ మాజీ క్రికెటర్

జావేద్ బుర్కీ (జననం 1938, మే 8) పాకిస్తానీ మాజీ క్రికెటర్, ప్రభుత్వ అధికారి, వ్యాపారవేత్త.

జావేద్ బుర్కీ
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1938-05-08) 1938 మే 8 (వయసు 86)
మీరట్, యునైటెడ్ ప్రావిన్సెస్, బ్రిటిష్ ఇండియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
బంధువులు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 36)1960 డిసెంబరు 2 - ఇండియా తో
చివరి టెస్టు1969 నవంబరు 8 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 25 177
చేసిన పరుగులు 1,341 9,421
బ్యాటింగు సగటు 30.47 36.37
100లు/50లు 3/4 22/31
అత్యధిక స్కోరు 140 227
వేసిన బంతులు 42 3,394
వికెట్లు 0 35
బౌలింగు సగటు 44.57
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 4/13
క్యాచ్‌లు/స్టంపింగులు 7/– 101/–
మూలం: Cricinfo, 2017 జూన్ 12

ప్రారంభ జీవితం, కుటుంబం

మార్చు

బుర్కీ రావల్పిండిలోని సెయింట్ మేరీస్ అకాడమీ నుండి ప్రాథమిక విద్యను పూర్తిచేశాడు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో (1958-1960) చదువుతున్నప్పుడు క్రికెట్ కూడా ఆడాడు.

ఇతను జనరల్ వాజిద్ అలీ ఖాన్ బుర్కీ (1900–1988) కుమారుడు. జనరల్ బుర్కీ మరదలు షౌకత్ ఖానుమ్ (బుర్కీ). ఈవిడ పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తల్లి.[2] బుర్కీ మరొక బంధువు మజిద్ ఖాన్ కూడా పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్‌గా పనిచేశాడు.

బుర్కీ సోదరులలో షౌకత్ ఖానుమ్ మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపక సభ్యుడు డాక్టర్ నౌషెర్వాన్ ఖాన్ బుర్కీ, కెరీర్ సివిల్ సర్వెంట్ ఇంటీరియర్ సెక్రటరీ అయిన జంషెడ్ బుర్కీ ఉన్నాడు.

క్రికెట్ రంగం

మార్చు

బుర్కీ 1960 నుండి 1969 వరకు 25 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. తరువాత ఐసీసీ మ్యాచ్ రిఫరీగా కూడా పనిచేశాడు.[3]

ప్రభుత్వం

మార్చు

క్రికెట్ నుండి విరమణ పొందిన తర్వాత, బుర్కీ పాకిస్తాన్ సివిల్ సర్వీస్‌లో డిస్ట్రిక్ట్ మేనేజ్‌మెంట్ మలాకాండ్ డివిజన్ - ఎన్.డబ్ల్యూ.ఎఫ్.పిలో భాగంగా చేరాడు.

వ్యాపారం

మార్చు

పాకిస్తాన్ ఆటోమొబైల్ కార్పొరేషన్ సీఈఓగా కూడా పనిచేశాడు. ఇది పాకిస్తాన్ మొట్టమొదటి అసెంబుల్డ్ కారు కంపెనీ పాక్ సుజుకి మోటార్ కంపెనీ[4] ప్రారంభించబడింది.

అరెస్టు

మార్చు

జనరల్ పర్వేజ్ ముషారఫ్ నియంతృత్వ పాలనలో పాకిస్తాన్ సైన్యంలోని సీనియర్ సభ్యులు సైనిక వాహనాల కొనుగోలు ప్రక్రియను ప్రశ్నార్థకం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో బుర్కీ, అతని భాగస్వామి ముజామిల్ నియాజీ ఇద్దరూ 2022 డిసెంబరు 19న వరుసగా ఇస్లామాబాద్, లాహోర్‌లలో అరెస్టు చేయబడ్డారు. తరువాత కరాచీ సెంట్రల్ జైలుకు తరలించబడ్డారు.[5]

ప్రస్తావనలు

మార్చు
  1. "'My greatest regret is that I was not a full-time cricketer'".
  2. Khan, Imran (1993). Warrior Race. London: Butler & Tanner Ltd. ISBN 0-7011-3890-4.
  3. "The finisher". ESPN Cricinfo. Retrieved 11 May 2018.
  4. Pak Suzuki (2009). "Pak Suzuki Motor Company". Pak Suzuki Motor Company. Archived from the original on 16 January 2011.
  5. Osman Riaz. "Free Javed Burki". Chowk. Archived from the original on 9 January 2009.