జాహిద్ ఫజల్
జాహిద్ ఫజల్ (జననం 1973, నవంబరు 10) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1] 1990 నుండి 1995 వరకు 9 టెస్టులు, 19 వన్డేలు ఆడాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా రాణించాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | సియాల్‌కోట్, పంజాబ్, పాకిస్తాన్ | 1973 అక్టోబరు 10|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి-చేతి మీడియం కుడి-చేతి ఆఫ్‌బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 118) | 1990 నవంబరు 15 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1995 సెప్టెంబరు 22 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 78) | 1990 నవంబరు 6 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1994 సెప్టెంబరు 11 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2017 జనవరి 24 |
క్రికెట్ రంగం
మార్చు1990 ఫిబ్రవరిలో పాకిస్తాన్ ఆటోమొబైల్స్ కార్పొరేషన్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. ఏకైక ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు.[2] తొమ్మిది నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడవ వన్డేలో ఆడాడు.[3] 1991, ఆక్టోబరు 25న విల్స్ ట్రోఫీ ఫైనల్‌లో షార్జాలో భారత్‌పై తన అత్యధిక వన్డే స్కోరు 98* (రిటైర్డ్ హర్ట్) చేశాడు. 1992 క్రికెట్ ప్రపంచ కప్‌లో కూడా ఆడాడు, అక్కడ పాకిస్తాన్ విజేతగా నిలిచింది.
1995 సెప్టెంబరులో శ్రీలంకతో జరిగిన మూడవ టెస్టు ఇతని చివరి అంతర్జాతీయ మ్యాచ్.[1][4] అందులో 23, 1 స్కోర్ చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్‌ను టెస్ట్ బ్యాటింగ్ సగటు 18.00, వన్డే సగటు 23.20తో పూర్తి చేశాడు. 2004 వరకు దేశవాళీ క్రికెట్‌ను ఆడటం కొనసాగించాడు. ఫస్ట్-క్లాస్, లిస్ట్ ఎ సగటులతో ముప్పైకి మించి రిటైరయ్యాడు.[1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Player Profile: Zahid Fazal". ESPNcricinfo. Retrieved 2023-09-12.
- ↑ "House Building Finance Corporation v Pakistan Automobiles Corporation: Quaid-e-Azam Trophy 1989/90". CricketArchive. Retrieved 2023-09-12.
- ↑ "ODI Matches played by Zahid Fazal (19)". CricketArchive. Retrieved 2023-09-12.
- ↑ "Pakistan v Sri Lanka: Sri Lanka in Pakistan 1995/96 (3rd Test)". CricketArchive. Retrieved 2023-09-12.