జిజియా
జిజియా లేదా జిౙయా (jizya లేదా jizyah (అరబ్బీ: جزية ǧizyah IPA: [dʒizja]; Ottoman Turkish: cizye;) ఒక తలసరి ఆదాయంపై విధించే/వసూలు చేసే పన్ను. సాధారణంగా ఇది ఇస్లామీయ దేశాలలో ఇది ముస్లిమేతరులపై విధించే పన్ను విధానం, అందులోనూ నిర్దిష్టమైన విధానాలకు లోబడి మాత్రమే. ఈ పన్ను ముస్లిమేతరులైన "పురుషులు", సైన్యంలో పనిచేసే వయస్సు అర్హత గలిగి, అధికారాలకు పొందగలిగినవారికి మాత్రమే వర్తించేది.[1] (కానీ కొన్ని మినహాయింపులకు లోబడి).[2][3] ముస్లిం పాలకులు తమ రాజ్యాలలోని ముస్లిమేతరులపై చట్టపరమైన పన్నుగా జిజియాని అభివర్ణించి విధించేవారు. ముస్లిం పాలకులకు మునుపు, పన్నులు చెల్లించే వారని, అందువలన వీరికి పన్ను విధించవచ్చని భాష్యం ఇచ్చేవారు.[4] ఈ పన్ను చెల్లింపుకు బదులుగా వారు తమ తమ ధర్మములను అవలంబించుకునే విధానం అనుసరించబడేది. సైన్యంలో పాలుపంచుకునేందుకు మినహాయింపు లభించేది. ఇతర దేశాల వారు దండయాత్రలు చేసిన సమయాలలో జిమ్మీలకు (ముస్లిమేతరులకు) రక్షణ కల్పించే బాధ్యత జిజియా వసూలు చేసే ముస్లిం పాలకులపై యుండేది. అదే విధముగా ముస్లిం పాలకులు ముస్లింలపై జకాత్ పన్ను (ధార్మిక పన్ను) విధించేవారు. ఈ జకాత్ ముస్లింలపై చట్టబద్ధమైనది.[5][6]
పద వ్యుత్పత్తి , అర్థం
మార్చుఅరబ్బీ భాషలో 'జిజియా' అర్థం "జిమ్మీ ల నుండి స్వీకరంప/వసూలుచేయ బడినది, ఇది "అంగీకారం ద్వారా ముస్లిమేతరుల నుండి వసూలు చేయబడిన రొక్కం".ఈ ఒప్పందం ప్రకారం ముస్లిమేతరులకు జిమ్మీ స్థితిని కలుగజేస్తారు; ఈ పదజాలము అరబ్బీ పదమైన జిజియాకు దగ్గరి అర్థము "బహుమతి"గా స్వీకరింపబడింది.[7]
జిజియా అనేపదము ఖురాన్ 9:29 యందు కానవస్తుంది, కాని దీనిని పన్ను రూపేనా విశదీకరంపబడలేదు. పాల్ హెక్ ప్రకారం, ఈ జిజియా పన్ను విధానం ససానిద్ కాలంలో ప్రారంభించబడింది.[8]
జిజియా విశదీకరణ గురించి అనేకులు భిన్న అభిప్రాయాలను ప్రకటించి, సాధారణంగా భావిస్తున్న అర్థాన్ని తోసిపుచ్చారు. :
- షాకిర్ , రషద్ ఖలీఫా ల ఆంగ్ల తర్జుమాలో ఖురాన్ పదమైన జిజియాకు "పన్ను"గా తర్జుమా చేశారు, కాని పిక్థాల్ తన తర్జుమాలో నిర్బంధ రుసుము (tribute) గా తర్జుమా చేశారు. కాని యూసుఫ్ అలీ జిజియా పదానికి లిప్యాంతరీకరించి "జిజికా" గానే వాడాడు.
- యూసుఫ్ అలీ ప్రకారం "ఈ పదము ఒక సాంకేతిక పదము, పన్ను కొరకు స్వీకరించారు, ఈ పన్ను ముస్లిమేతరుల నుండి ముస్లిం పాలకులు స్వీకరించేవారు. ఇస్లాంను స్వీకరించకుండా, వారి వారి మతాల పట్ల విధేయత కలిగి జీవించడానికి ఇష్టపడే వారినుండి స్వీకరించేవారు. ముస్లిం పాలకుల పాలనలో సురక్షితమైన జీవనం సాగించడానికి ప్రతిఫలంగా జిజియాను చట్టప్రకారం ముస్లిం పాలకులకు చెల్లించేవారు."[9]
- ముంఖిజ్ అస్-సక్ఖర్ ప్రకారం జిజియా అనే పదము "జజా" అనగా "పరిహారం", రక్షణకు బదులుగా ఇవ్వబడే పరిహారం.[10]
- ఇబ్న్ అల్-ముతారజ్ ప్రకారం జిజియా పదం "ఇద్జజా" నుండి స్వీకరింపబడింది. అర్థం "ప్రత్యామ్నాయం" లేదా "సమృద్ధి", స్వీయమతావలంబన కొరకు ప్రత్యామ్నాయంగా చెల్లించే పన్ను. "[10]
- యూసుఫ్ అల్-కరాదవి ఇలా అంటాడు, జిజియా పదం "జజా" నుండి ఉద్భవించినది, అర్థం "బహుమానం" లేదా "బదులు" లేదా "పరిహారం". ముస్లిమేతరులు ఒప్పందం ప్రకారం పన్ను రూపేణా ముస్లిం ప్రభుత్వాలకు చెల్లించే మొత్తం.[11]
- ఎడ్వర్డ్ విలియం లేన్, ఇలా సూచిస్తాడు; అరబిక్-ఇంగ్లీష్ నిఘంటువు ప్రకారం జిజియా ముస్లిమేతరులు ముస్లిం పాలకులకు రక్షణార్థము చెల్లించే పన్ను.[12]
- ఇబ్న్ రుషద్ ఇలా విశదీకరిస్తాడు; "జిజియా" ఒక విశాలతత్వము, పన్ను అనే శబ్దం కంటే విశాలమైనది. యుద్ధాల సమయంలో ప్రాణాలొడ్డి సంరంక్షించే పాలకులకు ఇవ్వబడే రుసుము.[13]
కాని వ్యవహారంలో, ఇదొక ప్రత్యేకమైన పన్ను, ముస్లిమేతరులపై, ముస్లిం రాజ్యాలలో ముస్లిం పాలకులు విధించే పన్ను.
సిసిలీ పై నార్మన్ విజయం తరువాత, ముస్లిం మైనారిటీలపై విధించిన పన్నును కూడా "జిజియా" అనేవారు.[4]
హేతువు
మార్చుజిజియా పదానికి శాస్త్రీయ హేతువులు రెండు కానవస్తాయి: ఛాందసవాద , సార్వత్రిక. మొదటిది జిమ్మీ (ముస్లిమేతరు)ల నుండి వారి ధార్మిక, మాన ప్రాణ రక్షణ కొరకు బయటి దండయాత్రల నుండి కాపాడుట కొరకు ప్రతిఫలంగా ఇవ్వబడే రుసుము లేదా పన్ను.[5]). రెండవది, ఎలాగూ, ప్రతి వ్యక్తి ప్రథమ కర్తవ్యం , జన్మహక్కు కూడానూ. ముస్లిమైనా, ముస్లిమేతరుడైనా చెల్లించవలసిన పన్ను. అది జిజియా రూపం గావచ్చు లేదా జకాత్ రూపం గావచ్చు.[14] వీటి మధ్యగల సంబంధాన్ని, తారతమ్యాన్ని, క్రింది పట్టికలో వీక్షించండి.refer to this section.
ఫకృద్దీన్ అల్-రాజి ప్రకారం ఖురాన్ సూరా 9 లోని 29 వ ఆయత్ యందు జిజియా క్రింది విధంగా వర్ణించబడినది:
జిజియాను స్వీకరించడం ఇస్లాం పట్ల ముస్లిమేతరుల అవిశ్వాసాన్ని అంగీకరించడం అన్ కాదు. ముస్లిమేతరుల మానప్రాణాలను రక్షణ స్వీకార విషయం. అలాగే ఈ పన్ను పద్దతి వారికి ఇస్లాం పట్ల తమ ధోరణిని మార్చుకొనుటకు తగిన సమయం ప్రసాదిస్తుంది, జిజియా పన్ను విధించడానికి మూల హేతువిదే.[15]
అనేక ముస్లిం పాలకులు, ఈ జిజియా పన్ను విధానం ద్వారా ముస్లిమేతరులు ఇస్లామీయ రాజ్యాన్ని గుర్తించడానికి దోహదపడే హేతువని అభిప్రాయపడేవారు.[4]
జిజియా పన్నుకు యొక్క మూలాలు
మార్చుజిజియా పన్ను ఎవరికి విధింపబడేది : ముస్లిమేతరులైన పురుషులు. ఎవరు మినహాయింపబడ్డారు : బానిసలు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు , వ్యాధి గ్రస్తులు,[2] సాధువులు, సంతులు, పర్ణశాలలు , పేదలు,[3] మున్నగు వారు జిజియా పన్నునుండి మినహాయింపబడిన వారు. స్వతంత్రులు, ధనికులు మాత్రం జిజియా చెల్లించేవారు.
మాలికి ఫిఖహ్ పాఠశాల ప్రకారం జిజియా పన్ను "గ్రంథ పజలు" అయిన యూదులు, క్రైస్తవులు , సబియన్ల పై విధించేవారు. ఆతరువాత ముస్లిమేతరులందరిపై విధించేవారు.[16] కొందరు పాలకులు హిందువులపైనా, సిక్కులపైనా విధించారు.[17]
జిజియా పన్ను ప్రతి ముస్లిమేతర పురుషుడు, ధనబలం, ఆస్తి, పన్ను చెల్లించే స్తోమత కలిగి, ముస్లిం రాజ్యంలో స్వతంత్రంగా జీవించే హక్కును పొందుటకు, సైన్యం పాల్గొనే నిబంధన నుండి విముక్తి లేదా మినహాయింపు పొందుటకు ధన, మాన, ప్రాణ రక్షణ పొంది స్వతంత్రంగా జీవించుటకు చెల్లించే పన్ను.[18][19]
జిజియా పన్ను
మార్చుఅబూ యూసుఫ్ గ్రంథం "కితాబ్ అల్ అఖ్రజ్" ప్రకారం జిజియా శాశ్వత పన్ను గాదు, నిర్దేశింపబడిన మొత్తము కూడా లేదు. ఈ పన్ను ధనము , ఆస్తులపై విధింపబడేది. ధనిక వర్గానికి 48 దిర్హమ్ లు, మధ్య ధనిక వర్గానికి 24 దిర్హం లు, వృత్తి కళాకారులకు, సేవకులకు 12 దిర్హాలు పన్ను విధింపబడేది.[14][20]
ౙకాత్ , జిౙయా
మార్చుజకాత్ | జిజియా |
---|---|
ముస్లింలపై ధర్మబద్ధం | జిమ్మీలపై ధర్మబద్ధం |
ముస్లింలు నిసాబ్ (తమ ఖర్చులు పోను మిగతా ఆదాయం, ఆస్తి పై) ప్రకారం చెల్లించాలి. ఇది ధర్మబద్ధం, కావున జకాత్ అందరు ముస్లింలూ చెల్లించాలి. | ధనిక వర్గపు ముస్లిమేతరులు నిసాబ్ తో ప్రమేయం లేకుండా చెల్లించాలి. |
ప్రతి చాంద్రమాన సంవత్సరం యందు నిరంతరంగా కలిగిన ఆస్తులపై నిసాబ్ (జకాత్ లెక్కల) ప్రకారం చెల్లింపవలసిన పన్ను. | ఒప్పందం ప్రకారం, సాధారణంగా నిసాబ్ లెక్క లేకుండా చెల్లింపవలసిన పన్ను. |
జకాత్ పన్ను చెల్లించవలసిన మొత్తం షరియాలో నిర్ధారింపబడింది. | ఈ పన్ను మొత్తం నిర్ధారింపబడలేదు. ముస్లిమేతర ధనికులు కనీసం ఒక బంగారు దీనార్, అధిక మొత్తం నిర్ధారింపబడలేదు. ఆదాయము , ఆస్తుల లెక్కల పరిగణణ తరువాత నిర్ధారింపబడేది.[14][20] |
ఆస్తిని కలిగిన పురుషుడు/స్త్రీ స్వయంగా చెల్లించే పన్ను. | సైన్యపు వయస్సు కలిగిన అధికారం కలిగివున్న స్థితిమంత ముస్లిమేతరుడు చెల్లించవలసిన పన్ను.[1] |
జకాత్ చెల్లించని వారికి ప్రభుత్వ న్యాయ పరిపాలనా పరంగానూ, షరియా పరంగానూ శిక్షార్హులు (మొదటి ఖలీఫా అబూబకర్ కాలంనుండి), ఆ తరువాత పరలోకంలోనూ శిక్షార్హుడే. | జిజియాను చెల్లింప నిరాకరించేవారికి, జిమ్మీ ఒడంబడికను వ్యతిరేకించడమే, ప్రభుత్వపరంగా శిక్ష.[21] |
అల్లాహ్ కృప కొరకు చెల్లించవలసిన ధార్మిక పన్ను.[Qur'an 30:39] | అయిష్టంగానైననూ ఒడంబడిక , చట్టం ప్రకారం చెల్లించవలసిన మొత్తం.[22] |
విమర్శ
మార్చుఇస్లామీయ న్యాయవిధానంలో ఈ పన్ను విధానం ఇతర మతస్తులపై మోపే భారమని, ఒక విధమైన వత్తిడి విధానమని విమర్శకులు విమర్శిస్తారు.
ఇతరులు ఇలా వాదిస్తారు; సున్నీలు జకాత్ చెల్లిస్తారు,[23] షియాలు "ఖుమ్" పన్ను ఆదాయంలో 1/5 వంతు చెల్లిస్తారు.[24] ఇందుకు అదనంగా, ముస్లింలు సైన్యంలో పాల్గొని దేశ రక్షణ కొరకు పాటుపడతారు, కాని ముస్లిమేతరులకు ఇది మినహాయింపని వాదిస్తారు.[25]
ఇవీ చూడండి
మార్చునోట్స్
మార్చు- ↑ 1.0 1.1 Kennedy, Hugh (2004). The Prophet and the Age of the Caliphates. Longman. p. 68.
- ↑ 2.0 2.1 Shahid Alam, Articulating Group Differences: A Variety of Autocentrisms, Journal of Science and Society, 2003
- ↑ 3.0 3.1 Ali (1990), pg. 507
- ↑ 4.0 4.1 4.2 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Cahen
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 5.0 5.1 John Louis Esposito, Islam the Straight Path, Oxford University Press, Jan 15, 1998, p. 34.
- ↑ Ali, Abdullah Yusuf (1991). The Holy Quran. Medina: King Fahd Holy Qur-an Printing Complex, pg. 507
- ↑ لسان العرب، الجزية - Lisan al-Arab (Dictionary)[permanent dead link]
- ↑ Paul L. Heck, "Poll Tax", Encyclopedia of the Qur'an
- ↑ Ali (1991), p. 507
- ↑ 10.0 10.1 jizya in Islam Archived 2011-10-17 at the Wayback Machine, Load-Islam
- ↑ "jizyah, Jihad… or Islam? - Reading Islam.com - Ask About Islam". Archived from the original on 2005-04-05. Retrieved 2013-09-29.
- ↑ An Arabic-English Lexicon, E.W. Lane Book 1, p.422, citing al-Nihaya fi Gharib al-Hadith by Majd al-Din ibn Athir (d. 1210), and others.
- ↑ Ibn Rushd (2002). Vol. 2, p.464.
- ↑ 14.0 14.1 14.2 Hunter, Malik and Senturk, p. 77
- ↑ al-Razi, Fakhr al-Din (1981). "(9:29)". Tafsir al-Kabir. Dar Al-fiker.
- ↑ Seed, Patricia. Ceremonies of Possession in Europe's Conquest of the New World, 1492–1640, Cambridge University Press, Oct 27, 1995, pp. 79–80.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;markovits
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Ennaji, M. (2013). Slavery, the state, and Islam. Cambridge University Press; pages 60–64; ISBN 978-0521119627
- ↑ Mark Durie, The Third Choice: Islam, Dhimmitude and Freedom; see Chapter 6; ISBN 978-0980722307
- ↑ 20.0 20.1 Abu Yusuf, Kitab al-Kharaj, quoted in Stillman (1979), pp. 159–160
- ↑ الشرح الكبير على متن المقنع vol.10 - p:625[permanent dead link]
- ↑ "Surat #9, verse #29". Tafsir al-Kabir. 2004.
- ↑ http://www.missionislam.com/knowledge/zakat.htm
- ↑ http://www.al-islam.org/beliefs/practices/khums.html
- ↑ http://www.readingislam.com/servlet/Satellite?pagename=IslamOnline-English-AAbout_Islam/AskAboutIslamE/AskAboutIslamE&cid=1123996016702
పాద పీఠికలు
మార్చు- Abou Al-Fadl, Khaled. The Place of Tolerance in Islam, Beacon Press, 2002. ISBN 0-8070-0229-1
- Ali, Abdullah Yusuf (1991). The Holy Quran. Medina: King Fahd Holy Qur-an Printing Complex.
- en:Bat Ye'or. The Decline of Eastern Christianity under Islam. From Jihad to Dhimmitude. Seventh-Twentieth Century (Madison/Teaneck, NJ: Fairleigh Dickinson University Press/Associated University Presses, 1996)
- en:Bat Yeor. Islam and Dhimmitude: Where Civilizations Collide, Fairleigh Dickinson University Press, 2002. ISBN 0-8386-3943-7
- Cahen, Cl.; İnalcık, Halil; Hardy, P. "Ḏj̲izzya." Encyclopaedia of Islam. Edited by: P. Bearman, Th. Bianquis, C.E. Bosworth, E. van Donzel and W.P. Heinrichs. Brill, 2008. Brill Online. 10 April 2008
- Cleveland, William L. A History of the Modern Middle East, Westview Press, Nov 1, 1999. ISBN 0-8133-3489-6
- Choudhury, Masudul Alam; Abdul Malik, Uzir (1992). The Foundations of Islamic Political Economy. Hampshire: The Macmillan Press.
- Donner, Fred McGraw. The Early Islamic Conquests Archived 2013-12-24 at the Wayback Machine, Princeton University Press, 1981.
- en:Encyclopædia Britannica. 2007. Britannica Concise Encyclopedia. 29 May 2007.
- Hunter, Shireen; Malik, Huma; Senturk, Recep (2005). Islam and Human Rights: Advancing a U.S.-Muslim Dialogue. en:Center for Strategic and International Studies, 2005.
- John Louis Esposito. Islam the Straight Path, Oxford University Press, Jan 15, 1998. ISBN 0-19-511233-4
- Gil, Moshe. A History of Palestine: 634–1099, Cambridge University Press, 1997. ISBN 0-521-59984-9
- Goiten, S.D. "Evidence on the Muslim en:Poll Tax from Non-Muslim Sources", Journal of the Economic and Social History of the Orient 1963, Vol. 6.
- en:Ibn Rushd, Abu al-Walid Muhammad ibn Ahmad. The Distinguished Primer (Bidayat al-Mujtahid wa Nihayat al-Muqtsid). 2 vol. work. Trans. Imran Ahsan Khan Nyazee. (Reading, UK: Garnet Publishing, 2002).
- Laskier, Michael M. North African Jewry in the Twentieth Century: Jews of Morocco, Tunisia and Algeria, NYU Press, 1994. ISBN 0-8147-5129-6
- Maududi, Sayyid Abul Ala. The Meaning of the Qur'an, A. A. Kamal (Editor). ISBN 1-56744-134-3
- Musa, Aisha Y. "jizya: Towards a Qur’ānically-based understanding of a Historically Problematic Term," in Transcendental Thought, November 2011
- Seed, Patricia. Ceremonies of Possession in Europe's Conquest of the New World, 1492–1640, Cambridge University Press, Oct 27, 1995, ISBN 0-521-49757-4
- Stillman, Norman: The Jews of Arab Lands: A History and Source Book (Philadelphia, Jewish Publication Society of America, 1979).
- Watt, William Montgomery, Islamic Political Thought: The Basic Concepts (Edinburgh: Edinburgh University Press, 1980).
- Stillman, Norman. The Jews of Arab Lands: A History and Source Book. Philadelphia: Jewish Publication Society of America, 1979. ISBN 0-8276-0198-0