జిలిక్ భట్టాచార్జీ
జిలిక్ భట్టాచార్జీ, ఒడియా, బెంగాలీ సినిమా నటి.[3] భరతనాట్యం, కథక్‌లలో శిక్షణ పొందిన నృత్యకారిణి.
జిలిక్ భట్టాచార్జీ | |
---|---|
జననం | 1 జూన్[1] |
ఇతర పేర్లు | తులియా |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2013 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ప్రీతిరంజన్ ఘరాయ్ (2020)[2] |
తల్లిదండ్రులు | మృత్యుంజయ్ భట్టాచార్జీ (తండ్రి) సుమనా భట్టాచార్జీ (తల్లి) |
తొలి జీవితం
మార్చుజిలిక్, జూన్ 1న మృత్యుంజయ్ భట్టాచార్జీ - సుమనా భట్టాచార్జీ దంపతులకు పశ్చిమ బెంగాల్‌లో జన్మించింది. షియామాక్ దావర్ డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్ నుండి డ్యాన్స్ కూడా నేర్చుకుంది. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పనిచేసింది. [4]
వ్యక్తిగత జీవితం
మార్చు2020, మార్చి 11న చిలికాలో జిలిక్ కు ఎమ్మెల్యే ప్రీతిరంజన్ ఘడాయ్‌తో వివాహం జరిగింది. జిలిక్ మామ మాజీ ఆర్థిక మంత్రి, బిజెడి ఉపాధ్యక్షుడు శ్రీ ప్రఫుల్ల చంద్ర ఘడాయ్.[5]
సినిమారంగం
మార్చుజిలిక్ 2013లో వచ్చిన తోమాయే భలో బాషి అనే బెంగాలీ సినిమాలో తొలిసారిగా నటించింది. ఆ తరువాత క్లాస్‌మేట్, ఐడెంటిటీ, నీల్ లోహిత్, ఎన్‌కౌంటర్ వంటి అనేక బెంగాలీ సినిమాలలో కూడా నటించింది. 2013లో టార్గెట్ సినిమాతో ఒడియా సినిమారంగంలోకి ప్రవేశించింది. ఆ తరువాత అఖిరే అఖీరే, లేఖ లెఖు లేఖి దేలి, సూపర్ మిచువా, జబర్దస్త్ ప్రేమిక, లవ్ యు హమేషా వంటి అనేక ఒడియా సినిమాలను నటించింది.[6]
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | భాష | మూలాలు |
---|---|---|---|
2013 | తోమయ్ భలో బాషి | బంగ్లా | |
2013 | టార్గెట్ | ఒడియా | |
2013 | ఐడెంటిటీ | బంగ్లా | |
2014 | అమర్ అమీ | బంగ్లా | |
2014 | క్లాస్‌మేట్ | బంగ్లా | |
2014 | అఖిరే అఖిరే | ఒడియా | |
2014 | లేఖ లెఖు లేఖి దేలీ | ఒడియా | |
2015 | సూపర్ మిచువా | ఒడియా | |
2015 | జబర్దస్త్ ప్రేమిక | ఒడియా | [7] |
2015 | లవ్ యూ హమేషా | ఒడియా | |
2015 | జగ హతరే పాఘా | ఒడియా | |
2015 | నీల్ లోహిత్ | బంగ్లా | [8] |
2015 | ఎన్‌కౌంటర్ | బంగ్లా | [9] |
2016 | అగస్త్య | ఒడియా | |
2016 | బేబీ | ఒడియా | |
2017 | తు మో హీరో | ఒడియా | |
2017 | తమకు దేఖిల పారే | ఒడియా | |
2018 | ఓలే ఓలే దిల్ బోలే | ఒడియా | |
2018 | ప్యార్ అలగ్ ప్రకర్ | ఒడియా | |
2019 | ఇది మాయ రే బయ | ఒడియా | |
2019 | అమీ షుడు తోర్ హోలం | బంగ్లా |
అవార్డులు
మార్చుసంవత్సరం | అవార్డు | విభాగం | ఫలితం |
---|---|---|---|
2015 | తరంగ్ సినీ అవార్డు | అఖీరే అఖిరేకి ఉత్తమ నటి [10] | గెలుపు |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Jhilik Bhattacharjee Biography". OdiaLive. Retrieved 2022-03-01.
- ↑ Odisha News (12 March 2020). "Sukinda MLA Pritiranjan ties knot with Odia film actress Jhilik". Archived from the original on 9 July 2022. Retrieved 9 July 2022.
- ↑ "Actress Jhilik looked beautiful in traditional dress". News Track (in English). 2020-05-30. Retrieved 2022-03-01.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Singha, Minati (June 17, 2016). "Looking forward to a long innings, says Odia actress Jhilik Bhattacharjee". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-03-01.
- ↑ "Actress Jhilik tied knot with BJD MLA - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-03-01.
- ↑ "Bong beauty rocking in Odia film industry". The New Indian Express. Retrieved 2021-07-27.
- ↑ "Jhilik Bhattacharjee Biography". entdairy.com. Archived from the original on 2016-08-11. Retrieved 2022-03-01.
- ↑ "Neellohit Movie Review". Retrieved 2022-03-01.
- ↑ "Jhilik Bhattacharjee movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2021-04-19. Retrieved 2022-03-01.
- ↑ "6th Tarang Cine Awards 2015 winners". Incredible Orissa. 2015-03-22. Retrieved 2022-03-01.