జిలేబీ

(జిలేబి నుండి దారిమార్పు చెందింది)

జిలేబీలు ఒక రకమైన మిఠాయి. ఇది బంగారపు రంగులో చక్కెర పాకంతో ఉండే తియ్యని మిఠాయి. ఇది భారతదేశంలోనే కాక పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లలో విస్తరించిన పదార్థం,.

Jalebi
Jalebis as served in South Asia
మూలము
ఇతర పేర్లుJal-vallika, kundalika (ancient India); jilebi, jilawii; zoolbia (Middle East); jeri (Nepal)
ప్రదేశం లేదా రాష్ట్రంMiddle East, South Asia & East Africa
తయారీదారులుAncient Indian
వంటకం వివరాలు
వడ్డించే విధానంdessert
ప్రధానపదార్థాలు Maida flour, saffron, ghee, sugar
వైవిధ్యాలుJaangiri or Imarti

చరిత్ర మార్చు

జైన మత బోధకుడు జినసుర సా.శ. 1450 లో రాసిన ప్రియకర్ణపాకత అనే పుస్తకంలో జిలేబీల ప్రస్తావన ఉంది. భారత దేశంలో ఈ మిఠాయి సుమారు 500 ఏళ్ళకు పూర్వమే తయారైనట్లు ఆధారాలున్నాయి.

 
జిలేబీలు

తయారీ, రకాలు మార్చు

జిలేబీల్లో రెండు రకాలు ఉన్నాయి.అవి

మైదా పిండి పలుచని ముద్దను సన్నని గొట్టాల ద్వారా వచ్చినట్టుగా చేసి, గొట్టాన్ని గుండ్రంగా తిప్పుతూ నూనెలో వేపుతారు. తరువాత వానిని లేత పాకంలో ముంచితే జిలేబీలు పీల్చుకొని తియ్యగా రుచికరంగా ఉంటాయి.

బెల్లం జిలేబి తయారి విధానం మార్చు

రుచికరమైన బెల్లం జిలేబిని ఈ క్రింద వివరించిన పద్ధతిలో చెయ్యవచ్చును.

కావలసిన పదార్థాలు
  • మైదా: 600 గ్రాములు
  • సోడాపుడి: అర టీ స్పూన్
  • పెరుగు: ఒకకప్పు
  • బెల్లంపాకం: 1¼కిలోలు
తయారు చేసే విధానం
ఒక రోజు ముందు వంద గ్రాముల మైదాపిండి చిటికెడు సోడాను, పెరుగు కలిపి మెత్తటి ముద్దలా కలియబెట్టాలి. ఎనిమిది గంటల తరువాత-మిగిలిన ఐదువందల గ్రాముల మైదాపిండిలో ముందుగా పులియబెట్టిన పిండి, కొద్దిగా గోరువెచ్చని నీళ్లు కలిపి మళ్ళీ మెత్తటి ముద్దలా, చపాతీల పిండి కంటే జారుడుగా చెయ్యాలి. అలాతయారు చేసిన పిండిని కనీసం పన్నెండు గంటలు నానబెట్టాలి. ఇలాచెయ్యడం వలన మైదా పిండి బాగా పులుస్తుంది.బెల్లాన్ని ముక్కలుగా చేసి రెండు కప్పుల నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి పాకం తయారు చెయ్యాలి. పాకం లేతగా ఉండగానే దించచలెను.

అటుతరువాత ఒక బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టి తగిన విధంగా కాగిన తరువాత -పిండిని ఒక చిన్న రంధ్రం కలిగినగట్టి జిలేబీ వస్త్రం (పద్నాలుగు అంగుళాల చతురస్రాకారంగా ఉన్నా గట్టి వస్త్రానికి మద్యలో చిన్న రంధ్రం ఉండి, బటన్ కాజాకి కుట్టిన రీతిలో కుట్టినది) లో పోసి-అన్ని వైపులనుండి మూసి మూటగా చేయండి. ఈ మూటను చేతితో పిండుతూ నూనెలో మూడు నాలుగు సార్లు జిలేబిల మాదిరి తిప్పవలెను. నూనెలో జిలేబి వలయాల వలె ఏర్పడును. తగినట్టుగా వేగిన పిదప వీటిని సిద్ధంగా ఉంచిన బెల్లం పాకంలో ముంచి కొద్ది సేపు ఉంచి బయటికి తీసిన తీయని రుచికరమైన జిలేబీలు సిద్ధం.

చక్కెర జిలేబీ తయారి విధానం మార్చు

రుచికరమైన చక్కెర జిలేబిని ఈ క్రింద వివరించిన పద్ధతిలో చెయ్యవచ్చును. కావలసిన పదార్థాలు:రమారమి26-30 జిలేబిలకు సరిపడ పరిమాణం

జిలేబీ చెయ్యుటకు కావలసిన అహార పదార్థాలు
  • మైదా: 2 కప్పులు
  • బియ్యప్పిండి: 6 స్పూన్స్
  • చక్కెర: 5 కప్పులు
  • సోడ: చిటికెడు
తయారు చేయు పద్ధతి
ఒక గిన్నెలోమైదా, బియ్యపుపిండి, సోడ, పెరుగు వేసి కొద్దిగా నీరు వేసి పిండిని ఉండలు లేకుండా జారుగాఉండేలా కలుపుకోవాలి. కలిపినటువంటి జిలేబీ పిండిని కనీసం 20 నుంచి 24 గంటల వరకు బాగా నాననివ్వాలి. జిలేబి తయారు చేయాలనుకున్న ముందు రోజే పిండితయారు చేయాలి. తరువాత నానిన పిండిలో, కేసరి రంగును వేసి పిండిని బాగా కలపాలి. జారుగా ఉంటేనే జిలేబి బాగా వస్తుంది.పిమ్మట తయారు చేసుకున్న పిండిని కవ్వంతో పిండీ నురగలుగా వచ్చువరకు చిలకాలి. ఒక సరిపడ గిన్నెలో తగినంత చక్కెర వేసి, చక్కెర మునిగేలా నీరు నింపి, తీగ పాకం తయారు చెయ్యాలి.

వెడల్పాటి బాణలిలో నెయ్యి (లేదా నూనె) వేసి, వేడి చేయాలి. ఇప్పుడు మధ్యలో చిన్న రంధ్రం ఉన్నగుడ్డలో లేదా, మధ్యలో చిన్న రంద్రంఉన్నప్లాస్టిక్ కవరులో తయారు చేసిన మైదా పిండిని వేయాలి ( జిలేబీలు

చేయడానికి సీసాలాంటివి దొరుకుతాయి సూపర్ మార్కెట్లలో). నెయ్యి కొద్దిగా వేడి అయ్యాక చిన్నగా చుట్లు తిప్పుతూ జిలేబిని బాణలిలో వేయాలి. ఇలా వేసిన జిలేబిలు గోధుమ రంగు వచ్చేలా రెండు వైపులా కాల్చాలి. కాల్చిన జిలేబిలను పక్కన పెట్టుకున్న తీగ పాకంలో వేసి 1 నిముషం పాటు మునిగి ఉండేలా ఉంచాలి. వేడి వేడి జిలేబీ తినటానికి సిద్ధం.[1]

ఇతర విశేషాలు మార్చు

వీటి తయారీలో రాజస్థానీయులు ప్రసిద్ధి చెందారు. వీటిని సమోసా లతో కలిపి తింటారు. గుజరాత్లో జిలేబీలను ఫాపడా (కారం అప్పలము) తో కలిపి తింటారు.

 
జలీబీ పాకిస్తాన్‌లో పాత, సాంప్రదాయ ఆహారం. మత, వివాహ ఉత్సవాల్లో ప్రజలు దీనిని ఆనందిస్తారు.

మూలాలు మార్చు

  1. "జిలేబి". telugu.maavantalu.com. Archived from the original on 2013-09-20. Retrieved 2015-06-11.
"https://te.wikipedia.org/w/index.php?title=జిలేబీ&oldid=3832086" నుండి వెలికితీశారు