గుమ్మడి వి. వెన్నెల (జననం 1979) తెలంగాణ రాష్ట్రం, సికింద్రాబాద్‌కు చెందిన రాజకీయ నాయకురాలు. వెన్నెల గద్దర్‌గా ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత గాయకుడు కవి గుమ్మడి విట్టల్ రావు కుమార్తె. [1] [2] [3]

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

వెన్నెల గద్దర్, విమల దంపతులకు జన్మించారు. వెన్నెలకు సూర్యం అనే సోదరుడు ఉన్నాడు. [4] వెన్నెలకు ఇద్దరు పిల్లలు సంతానం. వెన్నెల ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసింది. వెన్నెల సికింద్రాబాద్‌లోని అల్వాల్ పరిసరాల్లో తన తండ్రి ప్రారంభించిన మహాబోధి విద్యాలయ అనే పాఠశాలను నడుపుతోంది. [5] ఆమె 18 సంవత్సరాలుగా విద్యార్థులకు బోధిస్తూ, గత 10 సంవత్సరాలుగా [6] పేద పిల్లలకు ఉచిత విద్యను అందించడంలో పేరుగాంచిన ఈ పాఠశాలను వెన్నెల నడుపుతుంది. [7] [8] వెన్నెల దళిత నాయకురాలు. [9]

రాజకీయ జీవితం

మార్చు

వెన్నెల తన తండ్రి గద్దర్ మరణం తర్వాత 2023లో రాజకీయాల్లోకి వచ్చారు.[10] రాజకీయాల్లోకి వచ్చిన వెన్నెల తర్వాత కాంగ్రెస్ అగ్రనేతల ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. [11] వెన్నెల [12] 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా [5] పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓటమి చవిచూసిన దగ్గరనుంచి ఆమే ప్రత్యేక్ష రాజకీయల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం ఆమె, తన స్కూల్ బాధ్యతలను చూసుకుంటుంది. [13] [14] [4]

డాక్టర్‌ గుమ్మడి.వి.వెన్నెలను 2024 నవంబర్ 16న తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా నియమిస్తూ యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.[15]

మూలాలు

మార్చు
  1. Kirmani, Syeda Faiza (2023-09-30). "Will carry Gaddar's legacy forward: Daughter Vennela on 'Congress ticket'". The Siasat Daily (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-11-10.
  2. PTI (2023-10-27). "Former cricketer Azharuddin, Gaddar's daughter Vennela, 3 ex-MPs figure in Cong. party's 2nd list for T'gana polls". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-12-24.
  3. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సెంటిమెంట్ రాజకీయం | Vennela Vs Lasya | TS Politics | Meta News Telugu (in ఇంగ్లీష్), retrieved 2024-01-15
  4. 4.0 4.1 "Daughter of revolutionary balladeer enters Telangana gana poll fray with a focus on civic issues". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-11-01. Retrieved 2023-11-10.
  5. 5.0 5.1 "Newsmaker | Balladeer Gaddar's daughter in Telangana poll fray for Congress: Who is G V Vennela?". The Indian Express (in ఇంగ్లీష్). 2023-11-03. Retrieved 2023-11-10.
  6. "Telangana Cong Candidate Vennela: 'Will Continue My Father Gaddar's Fight against Inequality'". News18 (in ఇంగ్లీష్). 2023-10-31. Retrieved 2024-01-16.
  7. Desk, HT Kannada. "Telangana Election: ತೆಲಂಗಾಣ ಚುನಾವಣೆ ಕಣದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭವಿಷ್ಯ ಪರೀಕ್ಷೆಗೆ ಒಡ್ಡಿರುವ ಕ್ರಾಂತಿಕವಿ ಗದ್ದರ್ ಪುತ್ರಿ ಜಿವಿ ವೆನ್ನೆಲಾ". Kannada Hindustan Times (in కన్నడ). Retrieved 2024-01-02.
  8. "gaddar school: గద్దర్ మంచి మనసు.. పేద విద్యార్థుల కోసం మహాబోధి స్కూల్". Samayam Telugu. Retrieved 2024-01-16.
  9. telugu, NT News (2023-08-29). "ప్రశ్నించే తత్వమే నాన్న ఇచ్చిన ఆస్తి". www.ntnews.com. Retrieved 2024-01-16.
  10. Gaddar Daughter Vennela Exclusive Interview | Revolutionary Folk Singer | Gaddar Songs @SumanTVNews (in ఇంగ్లీష్), retrieved 2023-12-25
  11. Can GV Vennela win on Gaddar's 'Jai Bhim' and Development Promises of Congress | NewsClick (in ఇంగ్లీష్), 2023-11-28, retrieved 2023-12-24
  12. "Secunderabad Cantt. Assembly Election 2023 Result Live Updates: Check Latest Trends From Telangana Election Results". TimesNow (in ఇంగ్లీష్). 2023-12-03. Retrieved 2023-12-04.
  13. "TS Assembly Elections: ఎన్నికల బరిలో గద్దర్ కూతురు వెన్నెల.. ఆ నియోజకవర్గం నుంచే పోటీ..!". Samayam Telugu. Retrieved 2023-11-10.
  14. "Congress springs a surprise, offers ticket to Gaddar's kin". The New Indian Express. 29 September 2023. Retrieved 2023-11-10.
  15. Eenadu (17 November 2024). "తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్‌పర్సన్‌గా గద్దర్‌ కుమార్తె". Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.