గురిజాల రాధారాణి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 2021 అక్టోబరు 13న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితురాలైంది.[1][2]ఆమె అక్టోబరు 15న హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసింది.[3]

జి.రాధారాణి
జి.రాధారాణి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
13 అక్టోబర్ 2021 - ప్రస్తుతం
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం (1963-10-13) 1963 అక్టోబరు 13 (వయసు 61)
తెనాలి, గుంటూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్, భారతదేశం
తల్లిదండ్రులు గురిజాల సీతారామయ్య, రాజేశ్వరి
జీవిత భాగస్వామి సి.ఎల్.ఎన్. గాంధీ
సంతానం చేతన, మానవి
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ

జననం, విద్యాభాస్యం

మార్చు

జి.రాధారాణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం, గుంటూరు జిల్లా , తెనాలిలో 29 జూన్‌ 1963లో జన్మించింది. ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీలో లా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి, అనంతరం ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ పూర్తి చేసింది. జి.రాధారాణి తరువాత నేషనల్‌ లా బోర్డులో మానవహక్కుల మీద, ఉస్మానియాలో ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌పై డిప్లొమా చేసింది.[4]

వృత్తి జీవితం

మార్చు

జి.రాధారాణి 1989లో న్యాయవాద వృత్తిలో ప్రవేశించి హైదరాబాద్‌లో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా, అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేసి 2008లో జిల్లా జడ్జిగా ఎంపికైంది. ఆమె సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టు, నాంపల్లి కోర్టు, ఒంగోలు, హైదరాబాద్‌, సంగారెడ్డి జిల్లా జడ్జిగా వివిధ హోదాల్లో పనిచేసి పదోన్నతిలో భాగంగా నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది.

జి.రాధారాణి హైదరాబాద్‌లో మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జిగా, తెలంగాణ వ్యాట్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు చైర్మన్‌గా పనిచేసి రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2021 సెప్టెంబరు 16న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సభ్యులు ఉదయ్‌ యూ లలిత్‌, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు వారి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడంతో దానికి రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో అక్టోబరు 13న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితురాలైంది.[5][6][7]

మూలాలు

మార్చు
  1. Sakshi (13 October 2021). "తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు". Sakshi. Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
  2. Namasthe Telangana (13 October 2021). "ఏడుగురు కొత్త జడ్జీలకు రాష్ట్రపతి ఆమోదం". Archived from the original on 14 October 2021. Retrieved 15 October 2021.
  3. ETV Bharat News (15 October 2021). "హైకోర్టు నూతన న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం". Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
  4. Eenadu (14 October 2021). "తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిల నియామకం". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
  5. V6 Velugu (13 October 2021). "తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు" (in ఇంగ్లీష్). Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Andrajyothy (19 August 2021). "సైన్యంలో..న్యాయంలో మహిళలకు జస్టిస్‌". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
  7. Andrajyothy (10 November 2021). "వివక్ష న్యాయ వ్యవస్థలోనూ ఉంది". Archived from the original on 10 నవంబరు 2021. Retrieved 10 November 2021.