జీఎస్‌ఎల్‌వి-F01ఉపగ్రహ వాహకనౌక

జీఎస్ఎల్‌వి-F01 ఉపగ్రహ వాహనం ఇస్రో తయారుచేసిన జీఎస్ఎల్ వి శ్రేణికి చెందిన 3వ ఉపగ్రహ వాహనం, జీఎస్ఎల్‌వి శ్రేణికి సంబంధించిన మొదటి ఆపరేషనల్ ఫ్లైట్. జీఎస్ఎల్‌వి శ్రేణికి చెందిన అభివృద్ధి పరచిన మిగతా రెండు ఉపగ్రహ వాహకనౌకలలో ఒకటి ఏప్రిల్ 2001న జీశాట్-1 ఉపగ్రహాన్ని, మరొకటి మే 2003న జీశాట్-2 ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలో నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టాయి.

జీఎస్‌ఎల్‌వి-F01ఉపగ్రహ వాహకనౌక
10:1 scaled down model of the GSLV at Nehru planetarium in Mumbai

జీఎస్ఎల్‌వి శ్రేణికి చెందిన ఉపగ్రహ వాహక నౌకలు/రాకెట్లు

మార్చు

అభివృద్ధి పరచబడిన మొదటి GSLV-D1 ఉపగ్రహ వాహకనౌక 1530 కిలోగ్రాముల బరువు ఉన్న జీశాట్-1 ఉపగ్రహాన్ని భూస్థిర బదిలీ కక్ష్యలో (GTO) విజయవంతంగా ప్రవేశపెట్టింది. రెండవ GSLV-D2 ఉపగ్రహ వాహకనౌక 1825 కిలోలబరువు ఉన్న జీశాట్-2 ఉపగ్రహాన్నివిజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. అలాగే మొదటి ఆపరేషనల్ ప్రయోగంలో జీఎస్ఎల్‌వి-F01 ఉపగ్రహ వాహనం 1950 కిలోల బరువు ఉన్నజీశాట్-3/ EDUSAT ఉపగ్రహాన్నిఅతరిక్షంలో ప్రవేశపెట్టింది.

జీఎస్ఎల్‌వి-F01 ఉపగ్రహ వాహనం

మార్చు

జీఎస్ఎల్‌వి-F01 ఉపగ్రహ వాహకనౌక పొడవు 49 మీటర్లు. వాహకనౌక బరువు 414 టన్నులు. ఈ ఉపగ్రహ వాహకంలో 3 దశలు ఉన్నాయి.మొదటి దశ/స్టేజి, GS1, ఒక కోర్ మోటరు, 138 టన్నుల ఘన ఇంధనాన్ని (చోదకము) కలిగి, అదనంగా 4 స్ట్రాపాన్ మోటరులను కలిగి ఉండును.ఈ స్ట్రాపాన్ ఒక్కొక్కటి 40 టన్నుల హైపర్‌గోలిక్ ద్రవఇంధన చోదకాన్ని (UH25 and N204) కలిగి ఉంది.ఉపగ్రహ వాహ రెండవదశలో కూడా 39 టన్నుల ద్రవ హైపర్‌గోలిక్ చోదక ఇంధనాన్ని కలిగిఉండును. మూడవ దశ (GS3) క్రయోజనిక్ దశ,12.5 టన్నుల ద్రవఆక్సిజన్, ద్రవహైడ్రోజన్ కలిగిఉంది.[1].

ఉపగ్రహవాహనం మూడవదశ పైన, అల్యూమినియం మిశ్రమథాతు నిర్మితమైన, ఉపగ్రహంపేలోడ్ భద్రంగా ఉంచబడినభాగం (fairing) 3.4 మీవ్యాసం కలిగి 7.8 మీటర్ల పొడవు ఉంటుంది. ఉపగ్రహ వాహక నుండి వివిధదశలలో ఉపయోగించబడిన వాహన భాగాలు /రాకెట్ భాగాలు సయానుకూలంగా వేరు పడునట్లుచేయు, తనకుతాను స్వంతంగా పనిచేయు కంప్యూటరు వ్యవస్థ వాహకంలో అమర్చబడి ఉంది. ఫ్లెక్సిబుల్ లీనియర్ షేప్డ్ చార్జ్ (FLSC) సిస్టంలో మొదటిదశ, పైరో ఎక్యువేటేడ్ కలెక్ట్ రిలీజ్ మెకానిజంతో రెండవదశ, మేర్మన్ బోల్ట్‌కట్టర్ సేపరెసన్ మెకానిజం ద్వారా మూడవదశ రాకెట్‌భాగాలు వేరుపడును.[1]

చివరిదశలో స్ప్రింగ్‌త్రస్టరు విధానంలో ఉపగ్రహం కక్ష్యలొకి నెట్టబడుతుంది. రాకెట్‌లో వివిధదశలలో అమర్చిన ఆటోనమస్ కంట్రోల్ సిస్టం వలన ఉపగ్రహ వాహక భాగాలు ప్రతిదశలో వేరుపడును[1].

ఉపగ్రహ వాహకనౌక ఎత్తు 49.1మీటర్లు
ప్రయోగ ముందు సమయంలో రెకెట్ బరువు 414టన్నులు
ఉపగ్రహ వాహకంలోని దశలు మూడు
మొదటి దశ (GS1) S139+4L40H
రెండవదశ (GS2) L37.5H
మూడవ దశ (GS3) C12

ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం

మార్చు

జీఎస్ఎల్‌వి-F01 ఉపగ్రహ వాహక నౌక 20 తేది, సెప్టెంబరు, 2004 న సాయంత్రం 4:01 కు నిప్పులు చిమ్ముకుంటూ ఆకాశంవైపు చొచ్చుకు వెళ్ళినది.వాహక నౌక బయలు దేరిన 17 నిమిషాల తరువాత ఉపగ్రహాన్ని విజయవంతంగా GTOలో ప్రవేశ పెట్టారు[2].

ఉపగ్రహ వాహకనౌక ప్రయోగవివరాలు

మార్చు

సున్నాకొంట్‌డౌన్‌కు 4.8 నిమిషాల ముందు L40 స్ట్రాపన్ మోటార్లను మండించారు.కౌంట్‌డౌన్ జీరో వద్ద మొదటిదశ S139 మోటరును మండించగా వాహనం నింగివైపుకు తనప్రయాణాన్ని ప్రారంభించింది.మొదటిదశలో 146.9 సెకన్ల తరువాత, 69 కిలోమీటర్ల ఎత్తులో మొదటిదశ దహనఇంజన్/మోటరూ ఆగిపోగా, 69.4 కిలోమీటర్లఎత్తులో 147.5 సెకన్లకు రెండవ మోటరు/ఇంజను మండటం మొదలైంది.అప్పుడు ఉపగ్రహ వాహన త్వరణం 2.8కి.మీ/సెకండు. 149.1 సెకన్లకు, 70.6 కి.మీ ఎత్తులో మొదటిదశ రాకెట్‌భాగాలు వాహనంనుండి విడిపోయినవి, 154.9 సెకన్లకు,75 కి.మీ ఎత్తులో IS1/2 M భాగం వేరుపడినది. పేలోడ్ (ఉపగ్రహం) వెలుపల ఉన్న ఉష్ణకవచం 226.5 సెకన్లకు, 115 కి.మీ ఎత్తులో వేరుపడింది, ఆసమయంలో వాహకత్వరణం 3.88కి.మీ/సెకండు.288.1 సెకన్లకు,130 .7 కి.మీ ఎత్తులో రెండవదశ భాగాలు రాకెట్నుండి విడిపోయాయి. ఆ సమయంలో ఉపగ్రహ వాహకంత్వరణం 5.40 కి.మీ/సెకండు.మూడవదశ క్రయోజనిక్ ఇంజన్‌ను 200 కి.మీ ఎత్తులో, 998.0 సెకన్లకు ఆపివేసారు. ఈదశలో రాకెట్త్వరణం 10.23కి.మీ/సెకండు. 1013 సెకన్లకు, 208.6 కిలోమీటర్ల ఎత్తులో EDUSAT/జీశాట్-3 ఉపగ్రహం కక్ష్యలో ప్రవేశపెట్టబడింది.కక్ష్య ప్రవేశసమయంలో ఉపగ్రహం త్వరణం 10.23కి.మీ/సెకండు.

ఉపగ్రహ వాహక నౌక గమన వివరణ పట్టిక[3]

సంఘటన సమయం (సెకన్లు ఎత్తు (కి.మీ) త్వరణం (కి.మీ/సెకండుకు)
L40 జ్వలనం -4.8 0.0 0.45
పైకెగరడం (S139) జ్వలనం 0.0 0.0 0.45
GS1 ఆపివేయడం 146.9 69.0 2.81
GS2 జ్వలనం 147.5 69.4 2.81
GS1 వేరుపడటం 149.1 70.6 2.81
IS 1/2M వేరుపడటం 154.9 75.0 2.87
ఉపగ్రహం రక్షక కవచం
వేరుపడటం
226.5 115.0 3.88
GS2 వేరుపడటం 289.1 130.7 5.40
GS3 ఆపివేయడం 998.0 200 10.23
ఉపగ్రహం వేరుపడటం 1013.0 208.6 10.23

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "GSLV-F01". isro.gov.in. Archived from the original on 2015-08-21. Retrieved 2015-09-07.
  2. "India`s first education satellite launched". business-standard.com. Archived from the original on 2015-09-07. Retrieved 2015-09-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "GSLV-F01" (PDF). isro.gov.in. Archived from the original (PDF) on 2015-04-12. Retrieved 2015-09-07.