జీఎస్‌ఎల్‌వి-F04 ఉపగ్రహ వాహకనౌక

జీఎస్‌ఎల్‌వి–F04 ఉపగ్రహ వాహకనౌక, భూసమస్థితి ఉపగ్రహ వాహకనౌక (GSLV) శ్రేణిలో నిర్మించిన 5వ ఉపగ్రహ ప్రయోగవాహకం. ఈ GSLV) శ్రేణి ఉపగ్రహ వాహకాల ద్వారా 2 టన్నులకు మించి బరువు ఉన్న ఉపగ్రహాలను భూసమస్థితి కక్ష్యల్లో లేదా భుస్థిరకక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టవచ్చును. అంతకు ముందు ఇలాంటి ఉపగ్రహాలను దక్షిణ అమెరికాలోని గయానా అంతరిక్షప్రయోగ కేంద్రంనుండి ఏరియన్ స్పేస్ వారి సహాయంతో ప్రయోగించెవారు. ఇస్రో రూపొందించిన PSLV వాహక నౌకల ద్వారా 2 టన్నుల బరువువరకు ఉపగ్రహాలను కనిష్ఠ భూకక్ష్యలో (LEO) ప్రవేశపెట్టగలిగేవారు. స్వదేశీయంగా ఉపగ్రహాలను భూ సమస్థితి/భూఅనువర్తిత కక్ష్యలో ఉపగ్రహాలను అంతరిక్షములో ప్రవేశపెట్టుటకు PSLV పనికిరావు. అందుచే భూ సమస్థితి/భూఅనువర్తిత కక్ష్యలో ఉపగ్రహాలను అంతరిక్షములో ప్రవేశపెట్టు అంతరిక్షవాహన నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాన్ని సముపార్జించుకొని GSLVశ్రేణి ఉపగ్రహవాహకల నిర్మాణాన్నిచేపట్టారు. ఈ క్రమంలో తయారుచేసిన 5 వ GSLV ఉపగ్రహ వాహకం జీఎస్‌ఎల్‌వి–F04. ఈ ఉపగ్రహ వాహకనౌక, ఇన్శాట్ వరుస శ్రేణికి చెందిన ఇన్శాట్-4CR ఉపగ్రహాన్ని (2130 కిలోలు), భూసమస్థితి బదిలీ కక్ష్యలో (OTC), 21. 7 డిగ్రీల వాలుతో, 170 కిలోమీటర్ల పెరిజీ (భూమికి దగ్గరిబిందువు), 35, 975 అపొజీ (భూమికి దూరపుబిందువు) తో అంతరిక్షములో 2 వతేదీ, సెప్టెంబరు, 2007న కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టినది[1][2]. ఉపగ్రహానికి ఉన్న స్వంత చోదక ఇంజను సంహాయంతో ఉపగ్రహాన్ని నిర్దేశితకక్ష్యలో స్థిరపరచారు.

GSLV-F04
తయారీదారు ఇస్రో
మూలమైన దేశం ఇండియా
పరిమాణం
ఎత్తు 49.13 మీటర్లు (161.2 అ.)
వ్యాసము 2.8 మీటర్లు (9 అ. 2 అం.)
ద్రవ్యరాశి 414,750 కిలోగ్రాములు (914,370 పౌ.)
దశలు 3
సామర్థ్యం
Payload to
GTO భూస్థిర బదిలి కక్ష్య
5,000 కిలోగ్రాములు (11,000 పౌ.)<
Payload to
GTO
2,500 కిలోగ్రాములు (5,500 పౌ.)
ప్రయోగాల చరిత్ర
స్థితి Active
ప్రయోగ ప్రాంతములు Satish Dhawan
మొత్తం ప్రయోగాలు 9 (6 Mk.I, 3 Mk.II)
తర్వాతి 4 (2 Mk.I, 2 Mk.II)
వైఫల్యాలు 4 (3 Mk.I, 1 Mk.II)
పాక్షిక వైఫల్యాలు 1 (Mk.I)
మొదటి ఫ్లైట్ Mk.I: 18 April 2001
Mk.II: 15 April 2010
Boosters (Stage 0)
No boosters Four
Engines 1 L40H Vikas 2
Thrust 763 కిలోnewtons (172,000 lbf)
Total thrust 4,578 కిలోnewtons (1,029,000 lbf)
Specific impulse sec
Burn time 148 seconds
Fuel N2O4/UDMH
First Stage
Engines 1 S139
Thrust 4,768 కిలోnewtons (1,072,000 lbf)
Burn time 106.9  seconds
Fuel HTPB (solid)
Second Stage
Engines 1 GS2 Vikas 4
Thrust 799 కిలోnewtons (180,000 lbf)
Specific impulse 295 s (2.89 kN•s/kg)
Burn time 137  seconds
Fuel N2O4/UDMH
Third Stage (GSLV Mk.II) - CUS12
Engines 1 CE-7.5
Thrust 73.5 కిలోnewtons (16,500 lbf)
Specific impulse 441.0 seconds (4.325 km/s)
Burn time 709 seconds
Fuel LOX/LH2
భూసమస్థితి ఉపగ్రహ వాహకనౌక (GSLV) మాదిరి, నెహ్రూప్లానిటోరియం

ఉపగ్రహ ప్రయోగ వాహక నిర్మాణం

మార్చు

జీఎస్‌ఎల్‌వి–F04 ఉపగ్రహ వాహకనౌక మొత్తం పొడవు 49మీటర్లు. ప్రయోగ సమయానికి వాహనం మొత్తంబరువు 415 టన్నులు. ఉపగ్రహ వాహకం మొత్తం మూడు దశలను కలిగి ఉంది. అవి ఘన, ద్రవ, క్రయోజనిక్ ఇంధన దశలు. మొదటి దశ ఘనఇంధనం కలిగిన వాహకభాగం. ఇది ప్రపంచంలోని ఉపగ్రహా వాహకాలకన్నఎక్కువ పొడవున్న భాగం. ఇందులో హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలిబుటడైన్ (HTPB) ఆధారిత చోదకం ఉంది. ఈ మొదటి దశను ఆవరించిఉండు L40 స్ట్రాపన్ మోటరులలో, రెండవ దశలో ఉపయోగించు ద్రవచోదక ఇంజను, వికాస్‌ను అమర్చారు. L40 స్ట్రాపన్ మోటరులలో వాడు ద్రవఇంధనం UH25మరియు నైట్రోజన్ టెట్రాక్సైడ్. మూడవ దశ క్రయోజనిక్ దశ. ఇందులో అత్యల్పఉష్ణోగ్రత వద్ద ద్రవహైడ్రోజన్, ద్రవఆక్సిజనులు ఉండును. ద్రవ హైడ్రోజన్ను ఇంధనంగా ఆక్సిజన్ను ఆక్సీకరణిగా ఉపయోగిస్తారు. వాహక నౌకలో S- band టెలిమెట్రి, C-band ట్రాన్స్‌పాండరులను అమర్చారు. ఇవి వాహలనౌక పనితీరు మోనిటరింగ్, ట్రాకింగ్, రేంజి సేఫ్టి/ఫ్లైట్ సెప్టి, ప్రాథమిక కక్ష్య ఆవర్తన నిర్ణయం వంటి పనులను ఆటోమాటిక్ గా చే స్థాయి.[2]

ఉపగ్రహ వాహకనౌక మూడవ దశ చివరిభాగంలోని ఉపగ్రహం చుట్టూ ఉన్న రక్షణభాగం (payload fairing)7. 8 మీటర్లపొడవు, 3. 4 మీటర్ల వ్యాసం కలిగిఉండును. ఇది ఉపగ్రహ వాహక ప్రయాణసమయంలో ఏర్పడు వాతావరణవత్తిడి నుండి ఉపగ్రహాన్ని రక్షిస్తుంది. వాహకనౌక 115 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నప్పుడు, ఆటోమాటిక్‌గా రక్షణ కవచభాగం ఉపగ్రహంనుండి విడిపోతుంది. GSLV రాకెట్‌లోని పరికరాలబే (equipment bay) లో అమర్చిన రెడంట్ స్ట్రాప్ డౌన్ ఇనేర్టియల్ నావిగేసన్ వవస్థ, / ఇనేర్టియల్ గైడెన్స్ వ్యవస్థ ఉపగ్రహ ప్రయోగవాహనం బయలు దేరినసమయం నుండి, ఉపగ్రహాన్నికక్ష్యలో ప్రవేశపెట్టువరకు స్వయంగా పర్యవేక్షిస్తూ, మార్గదర్శనము చేయును. డిజిటల్ అటో పైలెట్, క్లోస్డ్ లూప్ గైడెన్స్ స్కీం, సరియైన దిశలో, సమయంలో నిర్దేశితకక్ష్యలో ఉపగ్రహం ప్రవేశించేలా చేస్తుంది[2].

ఉపగ్రహ వాహకం మూడు దశల వివరాలు[2]

మార్చు
పరామితులు మొదటి దశ S139 మొదటి దశL40స్ట్రాపాన్ రెండవ దశ (GS2) మూడవ దశ (GS3)
పొడవు (మీటర్లు) 20. 134 19. 682 11. 565 8. 72
వ్యాసం (మీటర్లు) 2. 8 2. 1 2. 8 2. 8
మొత్తం బరువు (టన్నులు) 161 190 44 15
చోదకము (ఇంధనం) HTPB UH 25&N2O4 UH 25&N2O4 LOX&LH2
చోదకం (ఇంధనం) బరువు, టన్నులు 138 42 39 12. 5
కేస్/ట్యాంకు నిర్మాణ పదార్థం మారగింగ్ ఉక్కు అల్యూమినియం మిశ్రమధాతువు అల్యూమినియం మిశ్రమధాతువు అల్యూమినియం మిశ్రమధాతువు
మండు (దహన) కాలం 106. 9 148 137 709
గరిష్ఠ త్రోయు పీడనంkN 4768 763 799 73. 5 (Normal)
నియంత్రణ వ్యవస్థ Engine gimballing -Single Plane Engine Gimalling
– two place for pitch
and yaw control, hot gas
Reaction Control System
(RCS) for roll control
2 Vernier engines for
thrust phase control and
cold gas RCS for
cost phase control.

GSLV-F02 కన్న GSLV-F04 లో అదనంగా చేసిన ముఖ్యమైన మార్పులు[3]

మార్చు
  • స్వదేశీయంగా తయారుచేసిన IS1/2 V
  • GSLV-D1లో ఉపయోగించిన దూరసమాచార వ్యవస్థను ఈ ఉపగ్రహ వాహకనౌకలో ఉపయోగించారు.
  • GS2లో తుప్పపట్టని ఉక్కు /స్టెయిన్‌లెస్‌స్టీలుతో చేసిన నీళ్ళటాంకును ఉపయోగించారు.
  • GS1 మొదటి దశలోని DAPలో నూతననియంత్రణ లాజిక్‌ను అమర్చారు.
  • L40 యొక్క అప్పర్, లోవర్ బౌండ్ పెర్ఫార్మెన్స్‌ను తనిఖీ చెయ్యుటకు పునరీక్షించిన (revised) ALS సిస్టాన్నిఉపయోగించారు.

సరళమైన IS1/2V

మార్చు

ఉపగ్రహ దశలను బోల్ట్ బిగింపుద్వారా పట్టి ఉంచు గ్రిడ్ నిర్మాణం. దీని వ్యాసం 2800 మిల్లీమీటర్లు, ఎత్తు 1752 మిల్లీమీటర్లు. తెరచి ఉన్నఈ ఐసోగ్రిడ్ అల్యూమినియం లోహపలకను వర్తులాకారములో రెండు అర్ధభాగాలుగా చేసి నిలువుగా బోల్టులచే బిగించబడి ఉంటాయి. వెనుక చివరి, ముందు చివరి రింగులకు తెరచి ఉన్న ఐసోగ్రిడ్ స్తూపాకార భాగాన్ని బోల్టులతో బిగించెదరు. ఐసోగ్రిడ్ స్తుపాకార నిర్మాణాన్ని AA7075 అల్యూమినియం మిశ్రమ ధాతువుతోను, చివరి రింగులను AA2014 AA7075 అల్యూమినియం మిశ్రమధాతువుతోను తయారుచేసారు. IS ½V నిర్మాణాన్ని PC 10 రంగు వేసారు. ఈ పెయింటింగ్ GS2 దశనుండి వెలువడు వేడివలన ఐసోగ్రిడ్ నిర్మాణం వేడెక్కకుండ నిలువరించును.[3]

జీఎస్‌ఎల్‌వి-F04 ఉపగ్రహ వాహకనౌక గమన వివరాలు[3]

మార్చు
ఘటన సమయం, సెకన్లు ఎత్తు, కి. మీ త్వరణం, కి. మీ/సెకండు
ప్రయోగ ప్రారంభం
(S139ఇంజను ప్రారంభం)
0 0. 026 0. 452
మొదటి దశ దహనం నిలుపుదల 147. 7 68. 78 2. 808
GS2ఇంజను దహన ప్రారంభం 148. 3 69. 23 2. 809
GS1 వేరుపడటం 149. 9 70. 45 2. 810
IS1/2 వేరుపడటం 155. 7 74. 73 2. 866
ఉష్ణకవచం విడిపోవటం 227. 8 115. 00 3. 870
GS2 వేరుపడటం 291. 0 132. 82 5. 372
GS3 ఆపివెయ్యడం 1000. 218. 52 10. 215
ఉపగ్రహం వేరుపడటం 1015. 9 231. 68 10. 223

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "GSLV-F04(September2,2007)". isp.justthe80.com. Archived from the original on 2015-08-31. Retrieved 2015-09-13.
  2. 2.0 2.1 2.2 2.3 "GSLV-F04". isro.gov.in. Archived from the original on 2015-08-21. Retrieved 2015-09-13.
  3. 3.0 3.1 3.2 "GSLV-F04 INSAT 4CR Mission" (PDF). isro.gov.in. Archived from the original (PDF) on 2015-11-14. Retrieved 2015-09-13.