జీన్-జాక్వెస్ అన్నాడ్

ఫ్రెంచ్ సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత

జీన్-జాక్వెస్ అన్నాడ్ ఫ్రెంచ్ సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత.

జీన్-జాక్వెస్ అన్నాడ్
జీన్-జాక్వెస్ అన్నాడ్ (2015)
జననం (1943-10-01) 1943 అక్టోబరు 1 (వయసు 81)
జువిసీ-సర్-ఓర్జ్‌, ఎస్సోన్నె, ఫ్రాన్స్‌
విద్యాసంస్థడెస్ హౌట్స్ ఎటుడెస్ సినిమాటోగ్రాఫిక్స్
వృత్తిసినిమా దర్శకుడు • స్క్రీన్ రైటర్ • నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1965–ప్రస్తుతం

జననం, విద్య

మార్చు

జీన్-జాక్వెస్ అన్నాడ్ 1943, అక్టోబరు 1న ఫ్రాన్స్‌ లోని ఎస్సోన్నెలోని జువిసీ-సర్-ఓర్జ్‌లోని డ్రవేయిల్‌లో జన్మించాడు.[1] వాగిరార్డ్‌లోని టెక్నికల్ స్కూల్‌లో చదువుకున్న అన్నాడ్ 1964లో పారిస్‌లోని ప్రతిష్టాత్మక ఫిల్మ్ స్కూల్ ఇన్‌స్టిట్యూట్ డెస్ హౌట్స్ ఎటుడెస్ సినిమాటోగ్రాఫిక్స్ నుండి పట్టభద్రుడయ్యాడు.

సినిమారంగం

మార్చు

క్వెస్ట్ ఫర్ ఫైర్ (1981), ది నేమ్ ఆఫ్ ది రోజ్ (1986), ది బేర్ (1988), ది లవర్ (1992), సెవెన్ ఇయర్స్ ఇన్ టిబెట్ (1997), ఎనిమీ ఎట్ ది గేట్స్ (2001), బ్లాక్ గోల్డ్ (2011), వోల్ఫ్ టోటెమ్ (2015) మొదలైన సినిమాలకు దర్శకత్వం వహించాడు.

అన్నాడ్ సినిమారంగంలో ఐదు సీజర్ అవార్డులు, ఒక డేవిడ్ డి డోనాటెల్లో అవార్డు, ఒక నేషనల్ అకాడమీ ఆఫ్ సినిమా అవార్డులతోపాటు అనేక అవార్డులను అందుకున్నాడు. అన్నాడ్ తీసిన తొలి సినిమా బ్లాక్ అండ్ వైట్ ఇన్ కలర్ (1976), ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అకాడమీ అవార్డును అందుకుంది.[2]

దర్శకత్వం

మార్చు
సంవత్సరం శీర్షిక దర్శకత్వం రచన నిర్మాణం
1976 బ్లాక్ అండ్ వైట్ ఇన్ కలర్ Yes Yes
1979 హాట్ హెడ్ Yes
1981 క్వెస్ట్ ఫర్ ఫైర్ Yes
1986 ది నేమ్ ఆఫ్ ది రోజ్ Yes
1988 ది బియర్ Yes
1992 ది లవర్ Yes Yes
1995 వింగ్స్ ఆఫ్ కరేజ్ Yes Yes Yes
1997 సెవన్ ఇయర్స్ ఇన్ టిబెట్‌ Yes Yes
2001 ఎనిమీ ఎట్ ద గేట్స్ Yes Yes Yes
2004 టు బ్రదర్స్ Yes Yes Yes
2007 హిజ్ మెజెస్టి మైనర్ Yes Yes Yes
2011 బ్లాక్ గోల్డ్ Yes Yes
2015 వోల్ఫ్ టోటెమ్ Yes Yes Yes
2022 నోట్రే-డేమ్ బ్రూల్ Yes Yes

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు దర్శకుడు నిర్మాత ఇతర వివరాలు
2018 హ్యారీ క్యూబెర్ట్ ఎఫైర్ గురించి నిజం Yes Yes టీవీ మినీ-సిరీస్

అవార్డులు,నామినేషన్లు

మార్చు

అన్నాడ్ ఇన్‌స్టిట్యూట్ డి ఫ్రాన్స్‌లో సభ్యుడిగా ఉన్నాడు. నేషనల్ ఫ్రెంచ్ అకాడమీ ఫిల్మ్ అవార్డు, నైట్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్, కమాండర్ ఆఫ్ ది ఆర్ట్స్ అండ్ లెటర్స్, యూరోపియన్ మీడియా కోసం చార్లెమాగ్నే మెడల్ (కార్ల్స్‌మెడైల్ ఫర్ డై యూరోపిస్చెన్ మెడియన్).

  • అకాడమి పురస్కారం
    • 1976: బ్లాక్ అండ్ వైట్ ఇన్ కలర్ (విజేత – ఉత్తమ విదేశీ భాషా చిత్రం )
  • సీజర్ అవార్డు
    • 1982: క్వెస్ట్ ఫర్ ఫైర్ (విజేత - ఉత్తమ చిత్రం )
    • 1982: క్వెస్ట్ ఫర్ ఫైర్ (విజేత - ఉత్తమ దర్శకుడు )
    • 1987: ది నేమ్ ఆఫ్ ది రోజ్ (విజేత- ఉత్తమ విదేశీ చిత్రం )
    • 1988: ది బేర్ ( నామినేషన్ - ఉత్తమ చిత్రం )
    • 1988: ది బేర్ (విజేత - ఉత్తమ దర్శకుడు )
    • 1992: ది లవర్ (నామినేషన్ )
  • డేవిడ్ డి డోనాటెల్లో
    • 1987: ది నేమ్ ఆఫ్ ది రోజ్ (విజేత)
  • యూరోపియన్ ఫిల్మ్ అకాడమీ
    • ఎనిమీ ఎట్ ది గేట్స్ (నామినేషన్)

మూలాలు

మార్చు
  1. "Jean-Jacques Annaud - BFI". BFI. Retrieved 25 May 2018.
  2. "The 49th Academy Awards (1977) Nominees and Winners". Oscars. Retrieved 16 May 2013.

బయటి లింకులు

మార్చు