జీవన తీరాలు 1977లో విడుదలైన తెలుగు సినిమా. మారుతి కంబైన్స్ పతాకంపై, జీ. వి. శేఖర్ దర్సకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం.ఈ చిత్రంలో శివాజీ గణేశన్ , కృష్ణంరాజు వాణిశ్రీ, జయసుధ, జగ్గయ్య, ప్రధాన పాత్రలో నటించారు . ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.

జీవన తీరాలు
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.వి.శేఖర్
తారాగణం శివాజీ గణేశన్
కృష్ణంరాజు,
వాణిశ్రీ
సంగీతం చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
గీతరచన ఆత్రేయ, ఆరుద్ర, సి.నారాయణ రెడ్డి
నిర్మాణ సంస్థ మారతి కంబైన్స్
భాష తెలుగు

శివాజి గణేషన్ ఒక అల్లాటప్పా రౌడీ. వాణిశ్రీ, కృష్ణంరాజు ప్రేమించుకుంటారు, కానీ ఆ తరువాత కృష్ణంరాజు, జయసుధను పెండ్లాడతాడు. ఆ ప్రేమకు ప్రతిఫలంగా జన్మించిన బాబును వాణిశ్రీ అడవిలో వదిలి వెళ్తుంది. ఆ బిడ్డ శివాజీ గణేషన్ కు దొరుకుతాడు. ఆ బిడ్డను పెంచే క్రమంలో మంచివాడిగా మారి, కుల భహిష్కరణకు గురయ్యి, పట్నం చేరతాడు. వాణిశ్రీ కూడా పట్నం చేరి జగ్గయ్య వద్ద సెక్రట్రీగా చేరుతుంది. అక్కడ మూడు సంవత్సరాలు పనిచేశాక జగ్గయ్య ప్రతిపాదించగా, తన గతం గురించి దిగులు చెందకు అని ఒప్పించటంతో, వాణిశ్రీ జగ్గయ్యను పెండ్లాడుతుంది. వారికి సంతు కలగదు. కృష్ణంరాజు, జయసుధలకు ఒక కుమారుడు. పది వర్షాల తరువాత ఆ కుమారుడూ, శివాజీ గణేషన్ పెంచుకుంటున్న కుమారుడు ఒకే పాఠశాలలో చేరతారు. అక్కడ వారిద్దరూ మంచి స్నేహితులవుతారు. కానీ అనాథ అని శివాజీ గణేషన్ పెంచుకుంటున్న రవిని అందరూ ఏడిపించటంతో జయసుధ కుమారుడైన కిరణ్ అతనికి తోడుగా నిలుస్తాడు. కాని తోటి వారి బాధలు తట్టుకోలేని రవి జగ్గు అనే రౌడీతో జగకూడతాడు. శివాజీ గణేషన్ బెల్టుతో తన్ను తాను కొట్టుకోవటంతో రవిలో మార్పు వస్తుంది. పాఠశాలలో తరువాత ఒకరోజు తోటి విద్యార్థి ఏడిపించటంతో, రవి అతన్ని ఇనుప సువ్వ తీసుకోని చంపుతా అని వెంటబడతాడు. కిరణ్ అడ్డుకోవాలని ప్రయత్నించి కారు క్రింద పడి మరణిస్తాడు. తరువాత ఒక రోజు రవి పాఠశాలకు వెళ్తుంటే జగ్గు నగలు దొంగతనం చేసి పోలీసులు వెంటబడటంతో నగలు రవి చేతిలో ఉంచి పారిపోతాడు. పోలీసులు రవిని అరస్టు చేస్తారు. జగ్గయ్య రవి తరుపున, కృష్ణంరాజు ప్రజా ప్రాసిక్యూటర్ గానూ వాదిస్తూ, అనాథ అని కృష్ణంరాజు దూషించటంతో, తట్టుకోలేని వాణిశ్రీ ఇండైరెక్టుగా అతను నా కుమారుడే, నా కుమారుడే అని కృష్ణంరాజుకు చెపుతుంది. జగ్గయ్య వాదించి రవిని నిర్దోషి అని నిరూపించి - విడుదల చేసి భార్య అయిన వాణిశ్రీని వెళ్లి రవిని తెచ్చుకోమంటాడు. కృష్ణంరాజు కూడా చేసిన తప్పుగురించి జయసుధ దగ్గర ఒప్పుకోవటంతో, జయసుధ వెళ్ళి ఆ కుమారుడిని తీసుకోని రమ్మంటుంది. కృష్ణంరాజు, వాణిశ్రీ వెళ్లి శివాజీగణేషన్ ను అడగటం, శివాజీ అప్పుడు పవర్ ఫుల్ డైలాగులు చెప్పటం, ఆ తరువాత జగ్గయ్య వచ్చి తండ్రిలా ఉంటా అనంటతే జగ్గయ్య, వాణిశ్రీలకు ఆ కుమారుడిని అప్పగిస్తారు. కానీ రవి పెంచిన శివాజీగణేషన్ పై మమకారంతో తిరిగి రావటంతో కథ ముగుస్తుంది. సినిమాలో కృష్ణంరాజు ఆ రోజుల్లో చాలా అందంగా చూపారు. వాణిశ్రీ యువ పాత్ర, పెద్దదయ్యాక వేసిన పాత్రలలో జీవించింది. శివాజీగణేషన్ పవర్ ఫుల్ డైలాగులతో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు.

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు

ఈ సినిమాలో 2 పాటలను ఆరుద్ర రచించారు.[1]

  1. నీ కన్నులలో కలనై నీ కౌగిలిలో చలినై ఉండిపోని - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆత్రేయ
  2. ఏ రాగమని పాడను ఏ తీగనే మీటను ఎదుట రూపమే - పి.సుశీల - రచన: వీటూరి
  3. కెరటానికి ఆరాటం తీరం చేరాలని తీరానికి ఉబలాటం - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - డా. సి. నారాయణ రెడ్డి
  4. జీవనతీరాలు నవజీవన తీరాలు ఆశలు బాధలు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆరుద్ర
  5. నడిరేయి అవుతూవున్నా నిదురేల రాదు నీకు జోజో - పి.సుశీల - రచన: ఆరుద్ర
  6. బస్తీమె సవాల్ బాబూ ఈ లోకం జబర్దస్తీమె సవాల్ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

మార్చు
  1. కురిసే చిరుజల్లులో, ఆరుద్ర సినీ గీతాలు, 5వ సంపుటం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.