జీశాట్-6A

(జీశాట్-6ఏ నుండి దారిమార్పు చెందింది)

జీశాట్-6A అనునది ఒక కృత్రిమ ఉపగ్రహము.దీనిని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ, క్లుప్తంగా ఇస్రోరూపొందించింది.గతంలో ఇదే జీశాట్ శ్రేణికి చెందిన పలు ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షకక్ష్యలో విజయవంతంగా ప్రవేశ పెట్టినది.జీఎస్‌ఎల్‌వీ డీ6 అను ఉపగ్రహవాహక నౌక/రాకెట్నునెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట లోని షార్ వేదికగా ఇస్రో సంస్థ 2015, అగస్టు27 (గురువారం) సాయంత్రం 4గంటల52నిమిషాలకు ప్రయోగించి, ఈ ఉపగ్రహవాహక నౌక ద్వారా జీశాట్-6 ఉపగ్రహన్ని దిగ్విజంయంగా నిర్ణిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.జీఎస్‌ఎల్‌వీ డీ6 అను ఉపగ్రహవాహక నౌక/రాకెట్నునెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట లోని షార్ వేదికగా ఇస్రో సంస్థ 2015, అగస్టు27 (గురువారం) సాయంత్రం 4 గంటల 52 నిమిషాలకు ప్రయోగించి, ఈ ఉపగ్రహవాహక నౌక ద్వారా జీశాట్-6 ఉపగ్రహన్ని దిగ్విజంయంగా నిర్ణిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు[1]. జీశాట్-6 ఉపగ్రహ ప్రయోగం స్థానంలో ఈ జీశాట్-6A ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టనున్నారు.3,425 కిలోల బరువున్నజీశాట్-17 ఉపగ్రహాన్ని 2017 జూన్ 29 న ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుండి ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఏరియన్ 5 రాకెట్ ద్వారా ప్రయోగించారు. జీశాట్-19 అనేది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తయారుచేసిన ఉపగ్రహం. గతంలో ఇస్రో జీశాట్ సీరిస్‌లో జీశాట్-1 ఉపగ్రహం, జీశాట్-2 ఉపగ్రహం జీశాట్-3 ఉపగ్రహం, అలాగాజీశాట్-19 వరకు ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోహించడంజరిగింది. ఈ ప్రయోగం విజయవంతం అయినచో అత్యంత బరువైన ఉపగ్రహాలను స్వంతగడ్ద మీదనుంచి ప్రయోగించేసత్తా ఇస్రోకు లభి స్తుంది. అందువలన ఈ ప్రయోగ విజయం ఇస్రోకు, భారత దేశానికి అత్యంత ప్రతిష్ఠకరామిన ప్రయోగం. జీశాట్-19 ఉపగ్రహం బరువు 3, 136 కిలోలు. ఇంతటి బరువున్న ఉపగ్రహాన్నిభారత ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించ లేదు. ఈ ఉపగ్రహాన్ని నిర్దిష్త అంతరిక్షకక్షలో ప్రవేశపెట్టుటకై జీఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన మార్క్3డీ1 అను ఉపగ్రహవహక నౌకను ఉపయోగించారు. ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో వున్న శ్రీహరికోటలోని సతిష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని రెండవ ప్రయోగ వేదిక నుండి సోమవారం జూన్ 5. 2017న ప్రయోగించారు అనుకున్న విధంగా ప్రయోగం విజయవంతం అయ్యింది. మొదటి సారిగా చేసిన మార్క్3డీ1 ఉపగ్రహ నౌక ప్రయోగం విజయవంతం అయ్యింది. అనుకున్న విధంగా జీశాట్-19 ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశ పెట్టినది. ఈ ప్రయోగంతో 3నుండిచ్4 టన్నుల బరువున్న ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్తగల సామర్ధ్యం పొంది, ఇలాంటి అంతరిక్ష పరిజ్ఞానంకలిగిన అమెరికా, రష్యా, యూరొఫ్, చైనా, జపాన్ దేశాల సరసన చేరింది[2] ఇంతకుముందు 2. 2-2. 5టన్నుల ఉపగ్రహాలను మాత్రమే ప్రవేశపెట్టారు.

జీశాట్-6A
GSAT 6A ఉహ చిత్రం
మిషన్ రకంసమాచార ఉపగ్రహం
ఆపరేటర్ఇస్రో
COSPAR ID2018-027A Edit this at Wikidata
SATCAT no.43241Edit this on Wikidata
మిషన్ వ్యవధిజీవిత కాలం: 10 years
Elapsed: 6 సంవత్సరాలు, 8 నెలలు, 6 రోజులు
అంతరిక్ష నౌక లక్షణాలు
బస్I-2K
తయారీదారుడుభారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ
Space Applications Centre
లాంచ్ ద్రవ్యరాశి2,140 కిలోగ్రాములు (4,720 పౌ.)
కొలతలు1.53 × 1.65 × 2.4 మీ. (5.0 × 5.4 × 7.9 అ.)
శక్తి3,119 వాట్స్
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీNot recognized as a date. Years must have 4 digits (use leading zeros for years < 1000). UTC
రాకెట్భూసమకాలిక ఉపగ్రహ వాహక నౌక(జీఎస్‌ఎల్‌వి)/మార్క్ II
లాంచ్ సైట్సతిష్ ధవన్ అంతరిక్ష కేంద్రం ,శ్రీ హరికోట,నెల్లూరు జిల్లా.రెండవ ప్రయోగ కెంద్రం
కాంట్రాక్టర్ఇస్రో
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థభూకేంద్రిత కక్ష్య
రెజిమ్భూస్థిర కక్ష్య
ట్రాన్స్‌పాండర్లు
కవరేజ్ ప్రాంతంఇండియా
జీశాట్
 

జీశాట్-6A

మార్చు

ఈ ఉపగ్రహం బరువు 2140 కిలోలు[3].ఇందులో 6 మీటర్ల వ్యాసం వున్న తెరచుకోనుఎంటేన్నా ఉంది. దానితో పాటు హబ్ సమాచారానికై 0.80మీటర్ల ఎంటేన్నా అదనంగా ఉంది.ఈ ఉపగ్రహం మొత్తం పరిమాణం కొలతలు 1.53X1.65X2.4 మీటర్లు.ఉపగ్రహం విద్యుత్తు శక్తి విలువ3119 watts.ఈ ఉపగ్రహం I-2K స్పేస్ క్రాఫ్ట్ బస్ కల్గి ఉంది.

ఈ ఉపగ్రహం సమాచార ఉపగ్రహం.ఈ ఉపగ్రహంలో అయిదు ఎస్ బాండ్ స్పార్ట్ బీమ్స్ ఏర్పాటు చేసారు. మొబైల్ బ్రాడ్ బాండ్ సేవలకు ఈ ఎస్ బాండ్ బీమ్‌లు ఉపయోగ పడును.అలాగే ఒక సి బాండ్ బీమ్ కల్గి ఉంది. ఉపగ్రహంలో అమర్చిన రెండు ఎంటేన్నాలు మొబైల్ పోనులకు నాణ్యమైన సిగ్నల్స్ అందించును.ఈ ఉపగ్రహం పదేళ్ళ పాటు సేవలు అందించును.ఈ ఉపగ్రహ ప్రయోగం కోసం ఇస్రో 270 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.ఈ ఉపగ్రహం మొత్తం బరువు 2140 కిలోలు కాగా అందులో నిల్వ చేసిన ఇంధనం బరువు 1,132 కిలోలు.ఈ ఇంధనం ఉపగ్రహం మొదట రాకెట్ వలన బదిలీ కక్షలో ప్రవేశ పెట్టిన తరువాత ఉపగ్రహాన్ని అసలైన కక్ష్యలోకి పంపుటకు ఉపయోగపడును. ఈ ఉపగ్రహంలో ఇస్రో తొలిసారిగా 6 మీటర్ల వ్యాసం వున్నా ఎంటేన్నాను ఉపయోగించారు.ఈ ఎంత పెద్ద ఎంటేన్నా వలన ఎక్కువ సమాచారాన్ని నాణ్యతగా ప్రసారం చెయ్యవచ్చు.జీ శాట్- 6ఏ అత్యంత శక్తివంతమైన ఎస్ బాండ్ కల్గిన రెండవ సమాచార ఉపగ్రహం కాగా మొదటిది జీ శాట్-6 ఉపగ్రహం.2015 ఆగస్టులో ప్రయోగించిన జీ శాట్-6 ఉపగ్రహానికి అనుబంధంగా జీ శాట్- 6 ఏ ఉపగ్రహం పనిచేస్తుంది.2017-2018 సంవత్సరానికి సంబంధించి జీ శాట్- 6ఏ చివరి ప్రయోగం.[4] అలాగే 2018 కి సంబంధించి ఇస్రో మొదటి ప్రయోగం. ఈ ప్రయోగం విజయవంతంగా ముగిసింది.

తెరచుకునే ఎంటేన్నా

మార్చు

తెరచుకునే ఎంటేన్నా/అంటేన్నా కల్గి వుండటం ఈ ఉపగ్రహం ప్రత్యేకత.ప్రయోగ సమయంలో ముడుచుకుని వుండే దీని మొదటి ఎంటేన్నాఉపగ్రహం, కక్ష్యలోకి చేరినాక గొడుగులా తెరచుకుంటుంది. ఈ ఎంటేన్నా 6 మీటర్ల వెడల్వు ఉంది. ఇప్పటి వరకు ఇస్రో తయారు చేసిన ఎంటేన్నాకు మూడు రెట్లు పెద్దది.ఈ ఉపగ్రహం కేవలం సమాచార ప్రసారంతో పాటు మిలిటరీకి కుడా సేవలు అందించును[4].

ఎస్ బాండ్ అనగా నేమి?దీని ప్రత్యేకత ఏమిటి?

మార్చు

ఎస్ బాండ్ అనేది 2 నుండి 4 గేగా హెడ్జ్ (GHz) పౌనః పున్యం కల్గిన ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రం. ఇది 3.0 GHz వద్ద (UHF), (SHF) ను సాధారణ సరిహద్దు దాటి పని చేయును.ఎస్ బాండ్‌ను వాతావరణ రాడారు లలో, షిప్/నౌకల ఉపరితల రాడార్లలో, మరి కొన్నిరకాల సమాచార ప్రసార ఉపగ్రహాలలో ఉపయోగిస్తారు.ఎస్ బాండును ఎంతో ఉపయుక్క్త బాండ్ సర్వీసు. ఎస్ బాండు యొక్క2.5 గేగా హెడ్జ్ బాండ్ ను 4G సర్వీసులో ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తారు.

ప్రయోగం తేది- జిఎస్ఎల్ వి –ఎఫ్08 వాహకనౌక వివరాలు

మార్చు

2018 మార్చి నెల 29 వ తారీఖు సాయంత్రం సరిగా 4:56 గంటలకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతిష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో వున్న రెండవ ప్రయోగ వేదిక నుండి ప్రయోగించారు.ఈ ఉపగ్రహాన్ని జిఎస్ఎల్‌వి –ఎఫ్08 ఉపగ్రహ వాహక నౌక ద్వారా అంతరిక్షములో ప్రవేశ పెట్టారు.జిఎస్ఎల్ వి రాకెట్ లు మూడు దశలను మాత్రమే కల్గి వుండును. మూడో దశ పైభాగాన ఉపగ్రహం అమర్చి వుండును.మొదటి దశలో ఘన ఇంధనం వుండును.దాని ఉపరితలం మీద అమర్చిన రెండు ఎర్త్ చోదకాలు ద్రవ ధనాన్ని కల్గి వుండును.రాకెట్ రెండవదశ ద్రవ ఇంధనాన్ని కల్గి వుండును.మూడవ దశ క్రయోజనిక్ ఇంజను .ఇందులోఆక్సిజన్ను మైనస్ 183°C వద్ద ద్రవరూపంలో నిల్వ చెయ్యగా, హైడ్రోజన్ మైనస్ 250 °C వద్ద నిలవ చేసి ఉపయోగిస్తారు. ఈ క్రయోజనిక్ ఇంజనును స్వదేశీయంగా తయారు చేస్తారు. జిఎస్ఎల్ వి –ఎఫ్08 రకపు వాహక నౌక ద్వారా 3.0టన్నుల వరకు బరువు ఉన్న ఉపగ్రహాన్ని భూస్థిర లేదా భూసమవర్త కక్ష్యలో ప్రవేశ పెట్టవచ్చును. జీఎస్‌ఎల్‌వి-ఎఫ్08 ఉపగ్రహ ప్రయోగం ప్రారంభం బుధవారం (2018 మార్చి 28 వ తారిఖు) మధ్యహాన్నం 1:56 గంటలకు కౌంట్ డౌన్ మొదలై 27 గంటలు ఎటువంటీ విఘ్నం లేకుందా గురువారం సాయంత్రం 4:56 గంటలవరకు కొనసాగింది.49.1 మీటర్ల పొడవు, మూడూదశలు వున్న జీఎస్‌ఎల్‌వి-ఎఫ్08 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగ కెంద్రం నుండి బయలు దేరిన 17 నిమిషాల తరువాత జీశాట్-6A ను విజయవంతంగా కక్ష్యలో వదిలినది. 49.1 మీటర్ల పొడవున్న జిఎస్ఎల్‌వి –ఎఫ్08 4:56 నిమిషాలకు నిప్పులు కక్కుకుంటూ గగనం తలంలోని తన లక్ష్యం వైపు దూసుకెళ్లింది.మొదటి దశను ఒక్కొక దానిలో 42.7 టన్నుల ద్రవ ఇంధనం వున్న నాలుగు బూస్టర్లు (170.8 టన్నులు), కోరుఅలోను దశలోని 138.11 టన్నుల ఘన ఇంధ్నం సహాయంతో రాకెట్ 151 సెకన్లలలో పూర్తి అయ్యీంది.రెండవ దసలో 39.48 టన్నుల ద్రవఇంధనం సహాయంతో గగనమ్లో 285 సెకన్లపాటు దూసుకెళ్లింది..తరువాత చివరి మూడో దశ అయిన క్రయోనిక్ దశలో 12.84 టన్నుల ఇంధనాన్ని మండించి 1065 సెకన్లలలో పూర్తి అయ్యింది.తరువాత తరాకెట్ ఉపగ్రహన్ని కక్ష్యలో ప్రవేశపెట్టినది.

ఉపగ్రహ భూనియంత్రణ కేంద్రంతో సంబంధాలు తెగిపోయిన జీశాట్-6A

మార్చు

ఉపగ్రహాన్ని విజయవంతంగా బదిలో కక్ష్యలో ప్రవేశ్హపెట్తినప్పటికి, ఉపగ్రహాకక్ష్య పెంచే ప్రయత్నంలో ఏర్పడిన సాంకేతిక లోపం వలన భూనియంత్రణ కేంద్రంతో జీశాట్-6A సంబంధాలు తెగిపోయినవి.కర్నాటక రాష్ట్రంలోని హాసన్ వద్ద వున్నఉపగ్రహ భూనియంత్రణ కేంద్రం సిబ్బంది ఉపగ్రహాకక్ష్య పెంచే ప్రయత్నంచేసారు.శుక్ర, శనివారాలు అనుకున్న విధంగా ఉపగ్రహ కక్షను పెంచారు.ఆదివారం తెల్లవారు జామున మూడో విడతగా ఉపగ్రహ కక్ష్యను 36 కిలోమీటర్లకు చేర్చుటకు ప్రయత్నిస్తుండగా హఠాత్తుగా ఉపగ్రహంలో విద్యుత్తు షార్ట్ సర్కుట్ జరిగి సంకేతాలు ఆగిపోయాయి.ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ప్రకటించింది.[5]

ఎట్టకేలకు జీశాట్-6A ను గుర్తించిన ఇస్రో

మార్చు

ఉపగ్రహంలోని కేబుల్ షార్ట్ సర్కుట్ వలన భూనియంత్రణ కెంద్రంతో సంబంధాలు కోల్పోయిన జీశాట్-6A జాడను ఇస్రో గుర్తించింది.ఇది భూమికి 26,000 కి.మీ పెరీజీ, 33.000కి.మీ అపోజీ కక్ష్యలో ఉపగ్రహం పరిభ్రమిస్తున్నట్లు గుర్తించారు.దీని కదలికలను ఇస్రో బృందం నిశితంగా పరిశీలిస్తున్నది. ఉపగ్రహం కక్ష్యలో తిరుగుతున్నప్పుడు ఒక నిర్ధిష్ట స్థానంలో సాంకేతాలు అందుకునే అవకాశం వున్నట్లు ఇస్రో భావిస్తున్నది[6]

ఇప్పటివరకు కక్ష్యలో చేరాక విఫలమైన ఉపగ్రహాలు

మార్చు

గతంలో ఇస్రో జూలై 10,2006 న ప్రయోగించిన ఇన్శాట్ 4C ఉపగ్రహం ప్రాథమిక కక్షనుండి అసలు కక్ష్యలో వెళ్ళు సమయంలో విఫలమైనది.అలాగే 2017 లో పంపిన ఐఅర్‌ఎస్‌ఎస్‌ఎస్ -1 హెచ్ కూడా దాని ఉష్ణకవచం తెరచుకోక పోవడం వలన అంతరిక్షంలో చక్కర్లు కొడుతున్నది.ఇప్పుడు జీశాట్-6A విద్యుత్తు షార్ట్ సర్లుట్ వలన సంబంధాలు కోల్ఫొయినది[7].

బయటి లింకులవీడియోలు

మార్చు

ఈ వ్యాసాలు కూడా చదవండి

మార్చు

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. "Launch of Isro's Geostationary Satellite Launch Vehicle". timesofindia.indiatimes.com. Archived from the original on 2015-08-28. Retrieved 2018-03-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "ISRO's heaviest rocket with GSAT-19 satellite launches into space". deccanchronicle.com. Retrieved 2017-06-12.
  3. "Isro to launch communication sat GSAT-6A on March 29". timesofindia.indiatimes.com. Retrieved 2018-03-30.
  4. 4.0 4.1 "ISRO's GSAT-6A Launch Scheduled For March 29 - Here's All You Need To Know". ndtv.com. Archived from the original on 2018-03-30. Retrieved 2018-03-31.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "జీ-శాట్6ఏ లో సాంకేతిక లోపం". sakshi.com/. Archived from the original on 2018-04-02. Retrieved 2018-03-02.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "ఎట్టకేలకు జీశాట్ -6ఏ జాడను గుర్తించిన ఇస్రో". sakshi.com. Archived from the original on 2018-04-10. Retrieved 2018-04-11.
  7. "జీశాట్-6ఏ విఫలప్రయోగమే?". sakshi.com. Archived from the original on 2018-04-05. Retrieved 2018-04-05.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=జీశాట్-6A&oldid=3832131" నుండి వెలికితీశారు