జుల్ఫికర్ అహ్మద్ (క్రికెటర్)

పాకిస్తానీ మాజీ క్రికెటర్

జుల్ఫికర్ అహ్మద్ (జననం 1926, నవంబరు 22 - 2008, అక్టోబరు 3[1]) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1952 నుండి 1956 వరకు తొమ్మిది టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.[2]

జుల్ఫికర్ అహ్మద్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1926-11-22)1926 నవంబరు 22
లాహోర్, పంజాబ్, బ్రిటిష్ ఇండియా
మరణించిన తేదీ2008 అక్టోబరు 3(2008-10-03) (వయసు 81)
లాహోర్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్‌బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 13)1952 23 October - India తో
చివరి టెస్టు1956 11 October - Australia తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 9 61
చేసిన పరుగులు 200 975
బ్యాటింగు సగటు 33.33 19.11
100లు/50లు 0/1 0/4
అత్యధిక స్కోరు 63* 73
వేసిన బంతులు 1,285 9,337
వికెట్లు 20 163
బౌలింగు సగటు 18.30 21.84
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 12
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 3
అత్యుత్తమ బౌలింగు 6/42 7/69
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 21/–
మూలం: CricInfo, 2019 12 July

జననం మార్చు

జుల్ఫికర్ అహ్మద్ 1926, నవంబరు 22న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించాడు. లాహోర్‌లోని ఇస్లామియా కళాశాలలో చదువుకున్నాడు. ఇతని సోదరి షాజాది, పాకిస్థాన్ తొలి టెస్టు క్రికెట్ కెప్టెన్ అబ్దుల్ హఫీజ్ కర్దార్‌ను వివాహం చేసుకుంది.[3]

క్రికెట్ రంగం మార్చు

ఆఫ్-స్పిన్ బౌలర్ గా, లేట్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు.[4] 1955లో కరాచీలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 79 పరుగులకు 11 వికెట్లు తీసుకున్నాడు.

1952-53లో భారత పర్యటనలో పాకిస్తాన్ మొదటి టెస్ట్ జట్టులోకి వచ్చాడు. 1954లో ఇంగ్లాండ్‌లో పాకిస్తాన్ పర్యటనలోనూ, 1955-56, 1956-57లో వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన స్వదేశీ సిరీస్‌లలో ఎంపికయ్యాడు. మొత్తం తొమ్మిది టెస్టులు ఆడి 200 పరుగులు చేసి 20 వికెట్లు తీశాడు. 1955లో న్యూజిలాండ్‌తో జరిగిన కరాచీ టెస్టులో అహ్మద్ 79 పరుగులకు 11 వికెట్లు తీసుకున్నాడు.

మరణం మార్చు

జుల్ఫికర్ అహ్మద్ తన 81 ఏళ్ళ వయసులో 2008, అక్టోబరు 3న లాహోర్ లో మరణించాడు.[5]

మూలాలు మార్చు

  1. "Former Test cricketer Zulfiqar passes away". Daily Times. 4 October 2008. Archived from the original on 5 October 2008. Retrieved 27 April 2019.
  2. "Zulfiqar Ahmed Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-22.
  3. "Cricketing dynasties: The 22 families of Pakistan Test cricket — Part 2 | Sports | thenews.com.pk". www.thenews.com.pk.
  4. Pakistan v New Zealand, Karachi 1955-56
  5. "Former Test cricketer Zulfiqar passes away". Daily Times. 4 October 2008. Archived from the original on 5 October 2008. Retrieved 27 April 2019.

బాహ్య లింకులు మార్చు