జుల్ఫికర్ బాబర్
జుల్ఫికర్ బాబర్ (జననం 1978, డిసెంబరు 10) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 2013 - 2016 మధ్యకాలంలో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు కొరకు ఆడాడు.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | ఒకారా, పంజాబ్, పాకిస్థాన్ | 1978 డిసెంబరు 10|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 215) | 2013 14–17 October - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2016 Oct 30 - Nov 3 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 198) | 2014 అక్టోబరు 7 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2015 ఏప్రిల్ 22 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 52) | 2013 జూలై 27 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2014 ఏప్రిల్ 1 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 78 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2004–Present | Water and Power Development Authority | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005–2010 & 2013-2015 | Multan Tigers | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–2012 | Quetta Bears | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2017 | క్వెట్టా గ్లాడియేటర్స్ (స్క్వాడ్ నం. 78) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | కరాచీ కింగ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2018 మార్చి 21 |
దేశీయ క్రికెట్
మార్చు2009/10 క్వాయిడ్-ఐ-అజం ట్రోఫీలో, 16.42 సగటుతో 69 వికెట్లు తీశాడు. 2012/13 సీజన్‌లో 13 మ్యాచ్ లలో 17.04 సగటుతో 93 ఫస్ట్‌క్లాస్ వికెట్లు తీశాడు.
2013 అక్టోబరులో పాకిస్థాన్ చీఫ్ మినిస్టర్స్ XI, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్స్ XI మధ్య జరిగిన ప్రాక్టీస్ గేమ్‌లో 22 పరుగులకు 6 వికెట్లు తీసుకున్నాడు.
2016లో ప్రారంభమైన పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అతను గ్రాంట్ ఇలియట్‌తో కలిసి ఏ రూపంలోనైనా టీ20లో అత్యధిక 10వ వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.[2][3] అతను 2018–19 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో వాటర్ అండ్ పవర్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఆరు మ్యాచ్‌ల్లో ముప్పై ఒక్క అవుట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.[4]
అంతర్జాతీయ క్రికెట్
మార్చుబాబరు 2013, జూలై 27న వెస్టిండీస్‌తో టీ20 అరంగేట్రం ఆడాడు. 34 సంవత్సరాల 229 రోజుల వయస్సులో వచ్చిన అతి పెద్ద పాకిస్తానీ ఆటగాళ్ళలో ఒకడిగా నిలిచాడు.
36 ఏళ్ళ 178 రోజుల వయసున్న ఇంజమామ్-ఉల్-హక్ తర్వాత బాబరు పాకిస్థాన్‌కు రెండో అతి పెద్ద టీ20 అరంగేట్రం చేశాడు.
23 పరుగులకు 3 వికెట్లు తీసుకున్నాడు. ఆటలో అతని జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 17 బంతుల్లో అమూల్యమైన 13* పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి ఒక సిక్సర్ కొట్టి జట్టును 2 వికెట్ల విజయానికి నడిపించాడు.[5] తరువాతి మ్యాచ్ లో 6 బంతుల్లో 11* పరుగులు చేశాడు. 37 పరుగులకు మరో 2 వికెట్లు తీసుకున్నాడు.[6] సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, అరంగేట్రం సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు.
ప్రపంచ టీ20 2014 కొరకు పాకిస్తాన్ ప్రపంచ కప్ జట్టులో ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 1వ ఓవర్‌లో డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్‌ల వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.[7]
2014, అక్టోబరు 7న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ తరపున తన వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.[8]
వ్యక్తిగత జీవితం
మార్చుబాబరు లాహోర్‌కు 85 మైళ్ళ దూరంలో ఉన్న ఒకారా అనే చిన్న పట్టణానికి చెందినవాడు.
బాబరు పాకిస్తాన్ మాజీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు అబ్దుల్ గఫార్ కుమారుడు. అతను పాకిస్తాన్ తరపున ఒక ఆట ఆడాడు. క్రికెట్‌పై తన కుమారుడికి ఉన్న అభిరుచిని తెలుసుకుని సాకర్ ఆడమని ఎప్పుడూ బలవంతం చేయలేదని బాబరు చెప్పాడు.[9]
మూలాలు
మార్చు- ↑ "Zulfiqar Babar". Cricinfo. ESPN. Retrieved 18 November 2012.
- ↑ "17th Match: Quetta Gladiators v Peshawar Zalmi at Sharjah, Feb 14, 2016 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-04.
- ↑ "Records | Twenty20 matches | Partnership records | Highest partnerships by wicket | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-04.
- ↑ "Quaid-e-Azam Trophy, 2018/19 - Water and Power Development Authority: Batting and bowling averages". Retrieved 22 November 2018.
- ↑ "1st T20I: West Indies v Pakistan at Kingstown, Jul 27, 2013 - Cricket Scorecard - ESPN Cricinfo".
- ↑ "2nd T20I: West Indies v Pakistan at Kingstown, Jul 28, 2013 - Cricket Scorecard - ESPN Cricinfo".
- ↑ "Recent Match Report - Australia vs Pakistan, ICC Men's T20 World Cup, 16th Match, Group 2 | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2019-02-19.
- ↑ "Australia tour of United Arab Emirates, 1st ODI: Australia v Pakistan at Sharjah, Oct 7, 2014". ESPN Cricinfo. Retrieved 7 October 2014.
- ↑ "Zulfiqar Babar Test debut". 15 October 2013. Archived from the original on 3 మార్చి 2016. Retrieved 6 అక్టోబరు 2023.