జూకంటి జగన్నాథం

జూకంటి జగన్నాథం తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లా జిల్లాకు చెందిన ప్రముఖ వచన కవి. కథకుడు. స్వగ్రామం తంగళ్లపల్లి. 20 జూన్ 1955లో జన్మించారు. తల్లిదండ్రులు శ్రీమతి సుశీల శ్రీ దుర్గయ్య గార్లు. వీరు ప్రధానంగా వచన కవిత్వం రాస్తారు. కథల సంకలనం కూడా వచ్చింది. వీరి కవిత్వంపై యం. నారాయణ శర్మ విశ్లేషణ చేసి ఊరి దుఃఖంపేరుతొ ఒక వ్యాసాల పుస్తకాన్ని ప్రచురించారు.[1] అభ్యుదయ, విప్లవ, దళిత, బహుజన, మైనార్టీ వాదాల కవిత్వం రాశారు. ప్రధానంగా ప్రపంచీకరణ పరిణామాలను మొదటగా తెలుగు సాహిత్యంలో రాసిన కవిగా గుర్తింపు పొందారు.[2]

జూకంటి జగన్నాథం
జూకంటి జగన్నాథం
జననం (1955-06-20) 1955 జూన్ 20 (వయసు 68)
తంగళ్లపల్లి, సిరిసిల్ల మండలం, సిరిసిల్ల జిల్లా, తెలంగాణ, భారతదేశం
నివాస ప్రాంతంసిరిసిల్ల, తెలంగాణ
వృత్తికవి
మతంహిందూ
తండ్రిదుర్గయ్య
తల్లిసుశీల

వచన కవిత్వ సంకలనాలు:

1. పాతాళ గరిగె (1993)

2. ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (1996)

3. గంగడోలు (1998)

4. వాస్కోడిగామా డాట్ కామ్ (2000)

5. బొడ్డుతాడు (2002)

6. ఒకరోజు పదిగాయాలు (అత్యాధునిక కావ్యం) 2004

7. తల్లికొంగు (2006)

8. పిడికెడు కలలు! దోసెడు కన్నీళ్లు ! (2008)

9. తారంగం (2009)

10. రాజపత్రం (2011)

11. చిలుక రహస్యం (2012)

12. చెట్టును దాటుకుంటూ.... (2015)

13. వస (2017)

14. ఊరు ఒక నారుమడి (2018)

15. సద్దిముల్లె (2020)

కథా సంకలనం: వైపణి (2004)[3]

అవార్డులు:

1. వలస (కథ) ఆంధ్రజ్యోతి వీక్లీ దీపావళి కథల పోటీలో ద్వితీయ బహుమతి (1986)

2 సినారె కవితా పురస్కారం (1998)

3. నూతన పాటి గంగాధరం పురస్కారం (2000)

4. ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం

5. గరికపాటి పురస్కారం (2004)

6. సృజనాత్మకత ప్రక్రియలకు తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి అవార్డ్ (2002)

7. రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథా పురస్కారం (2008)

8. కవిత్వం విభాగంలో తెలుగు యూనివర్సిటీ ప్రతిభా పురస్కారం (2011)

9. తెలంగాణ ఉత్తమ సాహితీవేత్త పురస్కారం (2015)

10. తెలంగాణ సారస్వత పరిషత్తు సినారె పురస్కారం (2019)[4]

మూలాలు

1. |ఆంధ్రభూమి పత్రికలో ఊరి దుఃఖం పుస్తక ]]

2. జూకంటి జగన్నాథం కవిత్వంలో ప్రపంచీకరణ పరిణామాలు | Venkateshwarlu Boorla - Academia.edu

3. https://www.telugubooks.in/products/jukanti-jagannadham-kathalu

4. https://www.ntnews.com/telangana/c-narayana-reddy-award-for-jukanti-149018

5. https://www.manatelangana.news/about-poet-jukanti-jagannatham/

6.జూకంటి జగన్నాథంతో మోత్కుల నారాయణ గౌడ్ ముఖాముఖి

7.https://kathanilayam.com/writer/75