మల్లావఝ్ఝల నారాయణ శర్మ

కవి, విమర్శకులు.

మల్లావఝ్ఝల నారాయణ శర్మ (ఎం.నారాయణ శర్మ) ప్రముఖ కవి, విమర్శకులు. కవి సంగమం రచయితలలో ఒకరు.

మల్లావఝ్ఝల నారాయణ శర్మ
M. Narayana Sharma.jpg
మల్లావఝ్ఝల నారాయణ శర్మ
జననంఎం.నారాయణ శర్మ
(1971-10-24) 1971 అక్టోబరు 24 (వయస్సు: 49  సంవత్సరాలు)
కరీంనగర్, కరీంనగర్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
నివాస ప్రాంతంహైదరాబాద్
వృత్తిసంస్కృత లెక్చరర్‌
ప్రసిద్ధిప్రముఖ కవి, విమర్శకులు.
మతంహిందూ
భార్య / భర్తఅరుణా నారదభట్ల
పిల్లలుభాషిత
తండ్రిరామచంద్ర శర్మ
తల్లిరమాదేవి

జననంసవరించు

మల్లావఝ్ఝల రామచంద్ర శర్మ, రమాదేవి దంపతులకు 1971, అక్టోబరు 24న కరీంనగర్ జిల్లా కేంద్రంలో జన్మించారు.

నివాసం - ఉద్యోగంసవరించు

హైదరాబాద్‌లో ఉంటున్నారు. సంస్కృత లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.

వివాహం - పిల్లలుసవరించు

నారాయణ శర్మకు అరుణా నారదభట్ల గారితో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు (భాషిత).

ప్రచురితమైన మొదటికవితసవరించు

"ఆశాజ్యోతి" స్కూల్‌లో ఆరవ తరగతిలో ఉన్నప్పుడు స్కూల్ మాగజైన్ "చైతన్య"లో మొదటికవిత ప్రచురితమైంది.

ప్రచురితమైన పుస్తకాలుసవరించు

 1. ఉప్పెన (కవిత్వం) -1997
 2. సృష్టి (దీర్ఘ కవిత) -1998
 3. తమో చిత్రాలు (కవిత్వం) -1999
 4. ప్రగతిబాల (శతకం) -1999[1]
 5. డా.ఎన్.గోపి కవితా రూప సృష్టి నానీలు పరిశీలన (విమర్శ) -2005
 6. అస్తిత్వ పుష్పాలు (నానీలు) -2011[2]
 7. డా.సి.నారాయణ రెడ్డి-నాగార్జున సాగరం-కళా సాహితీ ఛందఃపరిశీలన (విమర్శ) -2012
 8. ఈనాటి కవిత (కవిసంగమం కవుల కవిత్వంపై విశ్లేషణ) -2014[3][4]
 9. ఊరిదుఃఖం (జూకంటి జగన్నాథం కవిత్వం పై విమర్శ) -2016
 10. సాధారణ (కవిత్వ విమర్శ)2016
 11. వ్యక్తీకరణ (కవిత్వ విమర్శ) -2016
 12. జలగీతం సంస్కృతానువాదం(తెలుగు మూలం డా.ఎన్.గోపి(-2018.)
 13. .విశ్వమానవతా వీచికలు(తిరుమల శ్రీనివాసా చార్యుల రుబాయిల పరిశీలన)-2018
 14. .జలగీతం కావ్య సమాలోచనం -(కవిత్వ విమర్శ)2017)

బహుమానాలు - బిరుదులు - గుర్తింపులుసవరించు

 1. ఎం.వి.నరసింహారెడ్డి పురస్కారం (శాతవాహన విశ్వవిద్యాలయం) నాగార్జున సాగరం విమర్శకు.
 2. తేజ పురస్కారం- నాగార్జున సాగరం విమర్శకు.
 3. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారం (విమర్శకు)-2018
 4. తెలుగు సాహిత్య కళాపీఠం విశిష్టపురస్కారం (విమర్శకు)2018
 5. సమైక్య సాహితి రావికంటి రామయ్య గుప్త స్మారక పురస్కారం-2019

మూలాలుసవరించు

 1. నవతెలంగాణ, దర్వాజ, స్టోరి. "ఉపాధ్యాయ వృత్తిపై తెలుగు కవిత్వం". Retrieved 24 January 2017.
 2. నవతెలంగాణ, అంకురం, స్టోరి. "సాహితీ 'సోపతి'". Retrieved 24 January 2017.
 3. నమస్తే తెలంగాణ. "వి సంగమం నుంచి కవిత్వ విమర్శ". Archived from the original on 3 జూలై 2015. Retrieved 24 January 2017. Check date values in: |archive-date= (help)
 4. నవ తెలంగాణ. "కవిత్వ రహస్యాల్ని చెప్పిన రచన". Retrieved 24 January 2017.

ఇతర లంకెలుసవరించు