దాశరథి సాహితీ పురస్కారం

తెలంగాణ ప్రభుత్వ పురస్కారం

దాశరథి సాహితీ పురస్కారం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం దాశరథి కృష్ణమాచార్య (జూలై 22) జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సాహిత్యరంగంలో కృషిచేసినవారికి అందజేసే పురస్కారం.[1]

తెలంగాణ ప్రభుత్వం అందించే దాశరథి సాహితీ పురస్కారంలో 2023, జూలై 22న రవీంద్రభారతిలో జరిగిన పురస్కార కార్యక్రమ ప్రారంభోత్సవం (చిత్రంలో వి. శ్రీనివాస్ గౌడ్, కెవి. రమణాచారి, గోరటి వెంకన్న, రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్, మామిడి హరికృష్ణ, జూలూరు గౌరీశంకర్, అయాచితం శ్రీధర్, దీపికారెడ్డి, మంత్రి శ్రీదేవి తదితరులు)
ఎన్.గోపికి 2017 దాశరథి సాహితీ పురస్కారం అందజేత
2018 దాశరథి సాహితీ పురస్కార ప్రారంభోత్సవం
వఝల శివకుమార్ కి 2018 దాశరథి సాహితీ పురస్కారం అందజేత
సీఎం కెసీఆర్ చేతులమీదుగా 2020 దాశరథి పురస్కారం అందుకున్న తిరునగరి రామానుజయ్య
వేణు సంకోజుకు 2022 దాశరథి పురస్కారం అందజేత
తెలంగాణ ప్రభుత్వం అందించే దాశరథి సాహితీ పురస్కారంలో 2023, జూలై 22న రవీంద్రభారతిలో జరిగిన పురస్కార కార్యక్రమంలో మాట్లాడుతున్న గోరటి వెంకన్న

రూపకల్పన

మార్చు

నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చాటిన దాశరథి కృష్ణమాచార్య జన్మదిన వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంలో, సాహిత్యరంగంలో కృషిచేసిన వారికి ఈ పురస్కారంను అందజేయడం జరుగుతుంది. పురస్కార కమిటీ ఎంపిక చేసిన అవార్డు గ్రహీతకు 1,01,116 రూపాయల నగదుతోపాటు దాశరథి స్మారక అవార్డును అందిస్తారు.[2]

2015 తొలి దాశరథి సాహితీ పురస్కారంను కవి ఆచార్య తిరుమల శ్రీనివాసాచార్య కి అందజేయడం జరిగింది. 2015 పురస్కార ఈ కమిటీ చైర్మన్‌గా తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి, సభ్యులుగా విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ రావికంటి వసునందన్, ప్రొఫెసర్ మసన చెన్నప్పలు, కన్వీనర్‌గా సాంస్కృతికశాఖ సంచాలకులు ఉన్నారు.[3]

2016 దాశరథి సాహితీ పురస్కారంను కవి జె.బాపురెడ్డికి అందజేశారు.[4]

2017 దాశరథి సాహితీ పురస్కారంను కవి ఆచార్య ఎన్.గోపి కి అందజేశారు.[5]

2018 దాశరథి సాహితీ పురస్కారంను కవి వఝల శివకుమార్ కి అందజేశారు.[6][7]

2019 దాశరథి సాహితీ పురస్కారంను కవి డా. కూరెళ్ల విఠలాచార్యకి అందజేశారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌, హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ బి.ఎస్.రాములు, సంగీత నాటక అకాడమి చైర్మన్ బాద్మి శివకుమార్, సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.[8][9]

2020 దాశరథి సాహితీ పురస్కారంకు కవి డా. తిరునగరి రామానుజయ్య ఎంపికవ్వగా 2020, ఆగస్టు 15న ప్రగతి భవన్ లో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పురస్కారం అందజేశాడు.[10]

2021 దాశరథి సాహితీ పురస్కారంకు తెలుగు యూనివ‌ర్సిటీ మాజీ ఉప‌కుల‌ప‌తి, సాహితీవేత్త డాక్ట‌ర్. ఎల్లూరి శివారెడ్డి ఎంపికయ్యాడు.[11]ఆయన 2021, జూలై 22న హైదరాబాద్ రవీంద్రభారతి లో జరిగిన కార్యక్రమంలో అవార్డుతో పాటు 1,01,116 న‌గ‌దును సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ చేతుల మీదుగా అందుకున్నాడు.[12]

2022 దాశరథి సాహితీ పురస్కారంకు సాహితీవేత్త వేణు సంకోజు ఎంపికయ్యాడు.[13] ఆయన 2022, జూలై 22న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో అవార్డుతోపాటు 1,01,116 న‌గ‌దును సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ చేతుల మీదుగా అందుకున్నాడు.[14]

 
2023 దాశరథి సాహితీ పురస్కార కార్యక్రమంలో పురస్కారం అందుకుంటున్న అయాచితం నటేశ్వరశర్మ

2023 దాశరథి సాహితీ పురస్కారంకు సాహితీవేత్త అయాచితం నటేశ్వరశర్మ ఎంపికయ్యాడు.[15] ఆయన 2023, జూలై 22న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో అవార్డుతోపాటు 1,01,116 న‌గ‌దును సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ చేతుల మీదుగా అందుకున్నాడు.[16]

2024 దాశరథి సాహితీ పురస్కారంకు జూకంటి జగన్నాథం ఎంపికయ్యాడు.

మూలాలు

మార్చు
  1. నమస్తే తెలంగాణ (18 July 2018). "ప్రముఖ కవి వజ్జల శివకుమార్‌కు దాశరథి అవార్డు". Archived from the original on 26 July 2018. Retrieved 27 July 2018.
  2. నమస్తే తెలంగాణ (16 April 2015). "దాశరథి కృష్ణమాచార్య అవార్డు కమిటీ ఎంపిక". Archived from the original on 26 July 2018. Retrieved 27 July 2018.
  3. The Hans India (7 December 2017). "The powerful four liners". Archived from the original on 26 July 2018. Retrieved 27 July 2018.
  4. నమస్తే తెలంగాణ (22 July 2016). "కవి బాపురెడ్డికి దాశరథి సాహిత్య పురస్కారం ప్రదానం". Archived from the original on 26 July 2018. Retrieved 27 July 2018.
  5. Telangana Today (22 July 2017). "Acclaimed poet Gopi conferred with Dasarathi Sahiti Puraskar". Archived from the original on 26 July 2018. Retrieved 27 July 2018.
  6. ఆంధ్రజ్యోతి (23 July 2018). "పీడిత ప్రజల గొంతుక దాశరథి". Archived from the original on 26 July 2018. Retrieved 27 July 2018.
  7. ఆంధ్రభూమి (23 July 2018). "హైదరాబాద్ : దాశరథి కవితలు ఉద్యమ కెరటాలు". Archived from the original on 26 July 2018. Retrieved 27 July 2018.
  8. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (23 July 2019). "దాశరథి ఉద్యమస్ఫూర్తి". Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019.
  9. ఆంధ్రజ్యోతి, తెలంగాణ వార్తలు (23 July 2019). "తెలంగాణ ప్రజల గొంతుక దాశరథి". Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019.
  10. నమస్తే తెలంగాణ, తెలంగాణ (15 August 2020). "ప్రముఖ సాహితీవేత్త తిరునగరికి దాశ‌ర‌థి అవార్డు". ntnews. Archived from the original on 15 August 2020. Retrieved 15 August 2020.
  11. EENADU. "సాహితీవేత్త శివారెడ్డికి దాశరథి అవార్డు". EENADU. Archived from the original on 21 July 2021. Retrieved 21 July 2021.
  12. Namasthe Telangana (22 July 2021). "సాహితీ వేత్తకు గౌరవం". Archived from the original on 24 July 2021. Retrieved 24 July 2021.
  13. "కవి వేణు సంకోజుకు దాశరథి అవార్డు". web.archive.org. 2022-07-21. Archived from the original on 2022-07-21. Retrieved 2022-07-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  14. telugu, NT News (2022-07-23). "కవులు, రచయితలు తెలంగాణకు రెండు కండ్లు". Namasthe Telangana. Archived from the original on 2022-07-23. Retrieved 2022-07-23.
  15. Namasthe Telangana (19 July 2023). "క‌వి, ర‌చ‌యిత న‌టేశ్వ‌ర శ‌ర్మ‌కు దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్య పుర‌స్కారం". Archived from the original on 19 July 2023. Retrieved 19 July 2023.
  16. Namasthe Telangana (23 July 2023). "దాశరథి కలలు సాకారం.. ఆయన స్ఫూర్తితోనే కేసీఆర్‌ పాలన : మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌". Archived from the original on 23 July 2023. Retrieved 23 July 2023.

ఇతర లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.