జెన్నీ లూమెట్

అమెరికన్ సినిమా నటి, స్క్రీన్ ప్లే రచయిత

జెన్నీ లూమెట్ (1967, ఫిబ్రవరి 2)[2] అమెరికన్ సినిమా నటి, స్క్రీన్ ప్లే రచయిత్రి. దర్శకుడు సిడ్నీ లూమెట్ కుమార్తె, లీనా హార్న్ మనవరాలు. లూమెట్ 2008 జోనాథన్ డెమ్మే సినిమా రాచెల్ గెట్టింగ్ మ్యారీడ్ స్క్రీన్‌ప్లేను వ్రాసినందుకు ప్రసిద్ధి చెందింది.[3][4]

జెన్నీ లూమెట్
జననం (1967-02-02) 1967 ఫిబ్రవరి 2 (వయసు 57)[1]
వృత్తిసినిమా నటి, స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు1982–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
బాబీ కన్నవాలే
(m. 1994; div. 2003)
అలెగ్జాండర్ వైన్‌స్టెయిన్‌
(m. 2008)
పిల్లలు2, జేక్ కన్నవాలే
తల్లిదండ్రులు
బంధువులులీనా హార్న్
(నానమ్మ)
బరూచ్ లూమెట్
(తాత)

జననం, విద్య

మార్చు

జెన్నీ లూమెట్ 1967, ఫిబ్రవరి 2న దర్శకుడు సిడ్నీ లూమెట్ - పాత్రికేయురాలు/రచయిత్రి గెయిల్ బక్లీ (గెయిల్ బక్లీ జోన్స్) దంపతులకు న్యూయార్క్ నగరంలో జన్మించింది. అమ్మమ్మ గాయని లీనా హార్న్.[5] 1984లో లూమెట్ డాల్టన్ స్కూల్ నుండి పట్టభద్రురాలయింది.[6]

వ్యక్తిగత జీవితం

మార్చు

లూమెట్ 1994లో నటుడు బాబీ కన్నవాలేను వివాహం చేసుకున్నది. వారికి ఒక కుమారుడు నటుడు జేక్ కన్నవాలే ఉన్నాడు.[7] వాళ్ళు 2003లో విడాకులు తీసుకున్నారు.[8] 2008లో అలెగ్జాండర్ వైన్‌స్టెయిన్‌ను రెండవ వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె ఉంది.[9]

సినిమాలు

మార్చు
  1. 1982: డెత్‌ట్రాప్
  2. 1988: రన్నింగ్ ఆన్ ఎంప్టీ
  3. 1988: టఫ్ దన్ లెదర్
  4. 1995: డాడ్జ్‌బాల్
  5. 2017: ది మమ్మీ
  6. 2017: స్టార్ ట్రెక్: డిస్కవరీ
  7. 2020: స్టార్ ట్రెక్: పికార్డ్
  8. 2021: క్లారిస్
  9. 2022: ది మ్యాన్ హూ ఫెల్ టు ఎర్త్
  10. 2022: స్టార్ ట్రెక్: స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్[10]

అవార్డులు

మార్చు
  • 2008: ఫిల్మ్ ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్స్, ఉత్తమ మొదటి స్క్రీన్ ప్లే (నామినేషన్) రాచెల్ గెట్టింగ్ మ్యారీడ్ [11]
  • 2008: న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్, రాచెల్ గెట్టింగ్ మ్యారీడ్[12] కి ఉత్తమ స్క్రీన్ ప్లే
  • 2008: టొరంటో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్, రాచెల్ గెట్టింగ్ మ్యారీడ్[13] కి ఉత్తమ స్క్రీన్ ప్లే
  • 2009: ఎన్ఎఎఎసిపి ఇమేజ్ అవార్డ్స్, రాచెల్ గెట్టింగ్ మ్యారేజ్ కోసం మోషన్ పిక్చర్ (థియేట్రికల్ లేదా టెలివిజన్)లో అత్యుత్తమ రచన

మూలాలు

మార్చు
  1. Sidney Lumet: Interviews
  2. Rapf, Joanna E., ed. (2005). Sidney Lumet: Interviews. University Press of Mississippi. p. Chronology xix. ISBN 978-1578067244. 1967 ... Daughter Jenny Lumet born
  3. Scott, A. O. (October 2, 2008). "Anne Hathaway's Wreaking Havoc in Jonathan Demme's New Film". The New York Times.
  4. Gross, Terry; Lumet, Jenny; Demme, Jonathan (October 9, 2008). "Behind The Scenes Of 'Rachel Getting Married': Demme, Lumet on Getting 'Rachel' Married" (Includes audio interview). Fresh Air (in ఇంగ్లీష్). NPR.
  5. Brozan, Nadine (June 20, 1986). "Born in a Trunk: The Story of the Hornes". The New York Times.
  6. Stone, Michael (March 10, 1986). "Pressure Points: Frazzled Students at the City's Top Schools". New York (magazine) (in ఇంగ్లీష్). p. 31.
  7. Gioia, Michael (February 20, 2015). "Heavy Metal Rocker and Broadway's New Fish: Get to Know Bobby Cannavale's Teenage Son, Jake". Playbill (in ఇంగ్లీష్).
  8. Witchel, Alex (March 29, 2013). "Bobby Cannavale, Broadway's Hottest Outsider". The New York Times.
  9. Horyn, Cathy (June 24, 2011). "For the Screenwriter Jenny Lumet, a Childhood With Two Icons". The New York Times.
  10. Sperling, Nicole (2021-08-01). "Can Paramount+ Succeed? One Producer Hopes to Make It So". The New York Times. ISSN 0362-4331. Retrieved 2023-05-27.
  11. Cuthrell-Tuttleman, Willa (August 2, 2019). "Jenny Lumet Will Co-Showrun CBS All Access' "The Man Who Fell To Earth" Adaptation". Women in Hollywood. Retrieved 2023-05-27.
  12. "2008 Awards: Best Screenplay: Jenny Lumet, Rachel Getting Married". New York Film Critics Circle. 2008.
  13. "Author Q&A: Jenny Lumet, Screenwriter, "Rachel Getting Married"". Write On Online. Retrieved 2023-05-27.

బయటి లింకులు

మార్చు