జె. చిత్తరంజన్ దాస్

జక్కుల చిత్తరంజన్‌ దాస్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1989లో జరిగిన ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుపై పోటీ చేసి ఆయనను ఓడించి జాయింట్ కిల్లర్‌గా తెలుగు రాజకీయాల్లో నిలిచి అనంతరం మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా పని చేశాడు.[1]

జె. చిత్తరంజన్ దాస్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1984 - 1994
ముందు ఎస్.జైపాల్ రెడ్డి
తరువాత ఎడ్మ కిష్టారెడ్డి
నియోజకవర్గం కల్వకుర్తి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1950
కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ బీజేపీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ , తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు నర్సింహదాస్‌, నారాయమ్మ
జీవిత భాగస్వామి విజయ లక్ష్మి

జననం, విద్యాభాస్యం మార్చు

జె. చిత్తరంజన్ దాస్ 1950లో తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, కల్వకుర్తిలో నర్సింహదాస్‌, నారాయమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన మహబూబ్​నగర్ లో బీకామ్ పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం మార్చు

జె. చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్ పార్టీ ద్వారా విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి యూత్‌ కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పని చేసి, కల్వకుర్తి బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా, జిల్లా కాంగ్రెస్‌ సేవాదళ్‌ చైర్మన్‌గా పని చేశాడు. ఆయన 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కల్వకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాపార్టీ అభ్యర్థి లింగారెడ్డిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

జె. చిత్తరంజన్ దాస్ 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కల్వకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నందమూరి తారకరామరావు ను 3,568 ఓట్ల మెజార్టీతో ఓడించి రెండవసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో కార్మిక, ఉపాధి కల్పన, టూరిజం శాఖా మంత్రిగా , తరువాత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.[3][4]

జె. చిత్తరంజన్ దాస్ 1994 ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయనకు 1999లొ టిక్కెట్ ఇవ్వకపొవడంతో తెలుగుదేశం పార్టీలో చేరాడు. చిత్తరంజన్ దాస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి ఓబిసి సెల్ ఛైర్మన్‌గా పనిచేశాడు. ఆయన 2018లో కొల్లాపూర్ లేదా జడ్చర్ల నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ చిత్తరంజన్ దాస్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కలేదు. దీంతో ఆయన లోక్ సభ ఎన్నికల సందర్భంగా 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు.[5][6] జె. చిత్తరంజన్ దాస్ సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరాడు.[7]

మూలాలు మార్చు

  1. News తెలుగు (14 November 2018). "తెలంగాణ ఎన్నికలు: 'ఎన్టీఆర్‌పై ఎలా గెలిచానంటే'". Archived from the original on 12 December 2021. Retrieved 12 December 2021.
  2. Eenadu (3 November 2023). "భాజపా అభ్యర్థులు వీరే". Archived from the original on 3 November 2023. Retrieved 3 November 2023.
  3. Sakshi (17 November 2018). "ఎన్‌టీఆర్‌పై గెలుపును మరిచిపోలేను". Archived from the original on 12 December 2021. Retrieved 12 December 2021.
  4. Andhrajyothy (10 October 2018). "'కల్వకుర్తి' తీర్పు విలక్షణం". Archived from the original on 12 December 2021. Retrieved 12 December 2021.
  5. "కాంగ్రెస్‌కు మరో ఇద్దరు రాజీనామా". 23 March 2019. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
  6. "J. Chittaranjan Das, Ananda Bhasker Rapolu resign from Congress". Business Standard. 23 March 2019. Archived from the original on 12 December 2021. Retrieved 12 December 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 12 సెప్టెంబరు 2019 suggested (help)
  7. Mana Telangana (30 September 2023). "బిజెపిలో చేరిన మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్". Archived from the original on 2 November 2023. Retrieved 2 November 2023.