జె. జె. శోభ
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తిపేరు | జావూర్ జగదీశప్ప శోభ | |||||||||||||||||||||||||
జాతీయత | భారతీయురాలు | |||||||||||||||||||||||||
జననం | పశుపతిహాల్, ధారవాడ, కర్ణాటక | 1978 జనవరి 14|||||||||||||||||||||||||
నివాసం | సికిందరాబాదు, తెలంగాణ | |||||||||||||||||||||||||
క్రీడ | ||||||||||||||||||||||||||
దేశం | భారతదేశం | |||||||||||||||||||||||||
క్రీడ | అథ్లెటిక్స్ | |||||||||||||||||||||||||
పోటీ(లు) | హెప్టాథ్లాన్ | |||||||||||||||||||||||||
సాధించినవి, పతకాలు | ||||||||||||||||||||||||||
వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన(లు) | 6211 పాయింట్లు (ఢిల్లీ, 2004) | |||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
|
జావూర్ జగదీశప్ప శోభ (జననం 1978 జనవరి 14) కర్ణాటక ధార్వాడ్ సమీపంలోని పశుపతిహాల్ అనే గ్రామానికి చెందిన భారతీయ ప్రొఫెషనల్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్. ఆమె ప్రస్తుతం తెలంగాణలోని సికింద్రాబాదులో నివసిస్తోంది. ఆమె హెప్టాథ్లాన్ పాల్గొని, 2003లో మొట్టమొదటి ఆఫ్రో-ఆసియన్ గేమ్స్‌లో విజేతగా నిలిచింది. 2004లో 6211 పాయింట్లు సాధించి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో పాటు జాతీయ రికార్డు కూడా నెలకొల్పింది.
2004లో ఏథెన్స్లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో ప్రదర్శనతో ఆమె వార్తల్లోకి వచ్చింది. అక్కడ ఏడు విభాగాల హెప్టాథ్లాన్‌లో చివరి నుంచి రెండోదైన జావెలిన్ త్రోలో గాయపడినప్పటికీ ఆమె ఈవెంటును పూర్తి చేసింది. చికిత్స కోసం మైదానం నుండి తొలగించవలసివచ్చినప్పటికీ, ఆమె ఎడమ చీలమండకు కట్టుతో తిరిగి వచ్చి చివరి విభాగమైన 800 మీటర్ల పరుగు పందెంలో 3వ స్థానంలోనూ, మొత్తం మీద 6172 పాయింట్లతో 11వ స్థానంలోనూ నిలిచింది. ఆమె అద్భుతమైన ప్రదర్శనకు గాను 2004 సంవత్సరానికి అర్జున అవార్డును అందుకుంది.
2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పూర్తి ఆరోగ్యంతో పాల్గొన్న శోభ హెప్టాథ్లాన్ ఈవెంట్లో 5749 పాయింట్లు సాధించి 29వ స్థానంలో నిలిచింది.[1]
అంతర్జాతీయ ప్రదర్శన
మార్చుసంవత్సరం | క్రీడా పోటీలు | వేదిక | స్థానం | ఈవెంట్ | పాయింట్లు |
---|---|---|---|---|---|
భారతదేశం తరఫున | |||||
2002 | ఆసియా ఛంపియన్‌షిప్స్ | కొలంబో, శ్రీలంక | 2 | హెప్టాథ్లాన్ | 5775 |
ఆసియా క్రీడలు | బూసాన్, దక్షిణ కొరియా | 3 | హెప్టాథ్లాన్ | 5870 | |
2003 | ఆఫ్రో-ఆసియా క్రీడలు | హైదరాబాదు, భారతదేశం | 1 | హెప్టాథ్లాన్ | 5884 |
2004 | ఒలింపిక్ క్రీడలు | ఏథెన్స్, గ్రీస్ | 11 | హెప్టాథ్లాన్ | 6172 |
2006 | ఆసియా క్రీడలు | దోహా, కతార్ | 3 | హెప్టాథ్లాన్ | 5662 |
2007 | ఆసియా ఛంపియన్‌షిప్స్ | అమాన్, జోర్డాన్ | 2 | హెప్టాథ్లాన్ | 5356 |
2008 | ఆసియా ఇన్‌డోర్ ఛంపియన్‌షిప్స్ | దోహా, కతార్ | 4 | హెప్టాథ్లాన్ | 3860 |
ఒలింపిక్ క్రీడలు | బీజింగ్, చైనా | 29 | హెప్టాథ్లాన్ | 5749 |