జాస్తి వెంకట రాముడు 1981 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్ 2 నుండి 2016 జులై 23 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ అఫ్ పోలీస్ (డీజీపీ)గా విధులు నిర్వహించాడు.[2]

జేవీ రాముడు, ఐపీఎస్‌ (రిటైర్డ్)
జననం1957
తల్లిదండ్రులుగోవిందమ్మ (తల్లి)[1]

జననం, విద్యాభాస్యం మార్చు

జాస్తి వెంకట రాముడు 1957లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తాడిమర్రి మండలం, నార్సింపల్లి గ్రామంలో జన్మించాడు.[3]ఆయన బత్తులపల్లిలో పాఠశాల విద్యాభాస్యం పూర్తి చేసి, ధర్మవరంలో ఇంటర్మీడియట్, అనంతపురంలో డిగ్రీ పూర్తి చేసి 1981లో ఐపీఎస్ కు ఎంపికయ్యాడు.

వృత్తి జీవితం మార్చు

జేవీ రాముడు విశాఖపట్నంలో ఐపీఎస్‌ శిక్షణ పూర్తి చేసుకొని గుంటూరు ఏఎస్పీగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన అనంతరం వరంగల్, హైదరాబాద్, నల్గొండలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయనను రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. ఆయన 2014 జూన్ 1న ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జి డీజీపీగా నియమితుడై,[4] 2014 జులై 24న పూర్తి స్థాయి డీజీపీగా భాద్యతలు చేపట్టాడు.[5]

మూలాలు మార్చు

  1. India Herald. "ఏపీ డీజీపీ జేవీ రాముడికి మాతృవియోగం." Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
  2. The Hindu (16 August 2016). "J.V. Ramudu takes over as DGP of residuary A.P." (in Indian English). Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
  3. Sakshi (23 July 2016). "కన్పించని ముద్ర". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
  4. Sakshi (1 June 2014). "పోలీస్ బాస్లు.. తెలంగాణకు అనురాగ్ శర్మ, ఏపీకి జేవీ రాముడు". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
  5. Sakshi (24 July 2014). "ఏపీ డీజీపీగా జె.వి.రాముడు నియామకం". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.

బయటి లింకులు మార్చు